< యెహెజ్కేలు 6 >

1 నా దగ్గరికి తిరిగి యెహోవా వాక్కు వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
RAB bana şöyle seslendi:
2 “నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతాలకు అభిముఖంగా నిలబడి ఇలా ప్రకటించు.
“Ey insanoğlu, yüzünü İsrail dağlarına doğru çevir ve onlara karşı peygamberlik et.
3 ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా పర్వతాలతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఇలా చెప్తున్నాడు. చూడండి! మీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతున్నాను. మీ ఉన్నత స్థలాలను నాశనం చేస్తాను.
De ki, ‘Ey İsrail dağları, Egemen RAB'bin sözünü dinleyin. Egemen RAB dağlara, tepelere, vadilere, derelere şöyle diyor: Üzerinize kılıç göndereceğim, tapınma yerlerinizi yıkacağım.
4 తరువాత మీ బలిపీఠాలు పాడై పోతాయి. మీ దేవతా స్తంభాలు ధ్వంసం అవుతాయి. హతమైన మీ వాళ్ళను మీ విగ్రహాల ఎదుట పారవేస్తాను.
Sunaklarınızı devirecek, buhur sunaklarınızı paramparça edeceğim. Kılıçtan geçirilmiş halkınızı putlarınızın önüne düşüreceğim.
5 ఇశ్రాయేలు ప్రజల శవాలను వారి విగ్రహాల ఎదుట పేరుస్తాను. వాళ్ళ ఎముకలను మీ బలిపీఠాల చుట్టూ వెదజల్లుతాను.
İsrailliler'in cesetlerini putlarının önüne atacak, kemiklerini sunaklarının çevresine dağıtacağım.
6 మీరు ఏ పట్టణంలో నివసించినా ఆ పట్టణాలు నాశనం అవుతాయి. మీ బలిపీఠాలు నాశనం, నిర్జనం అవుతాయి. తరువాత అవి పగిలి పోతాయి. మాయమై పోతాయి. మీ దేవతా స్తంభాలు విరిగిపోతాయి. మీరు చేసినవన్నీ తుడిచిపెట్టుకు పోతాయి.
Yaşadığınız her yerde kentleriniz yakılıp yıkılacak, tapınma yerleriniz yerle bir edilecek. Öyle ki, sunaklarınız devrilip yıkılsın, putlarınız ezilip paramparça olsun, buhur sunaklarınız yok edilsin, el emeğiniz boşa çıksın.
7 ప్రజలు చనిపోయి మీ మధ్యలో కూలిపోతారు. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
Halkınız her yerde öldürülecek. O zaman benim RAB olduğumu anlayacaksınız.
8 అయితే మీలో కొంత శేషాన్ని నేను భద్రం చేస్తాను. మీరు వివిధ దేశాల్లోకి చెదరిపోయినప్పుడు మీలో కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకుంటారు.
“‘Birkaç kişiyi ölümden kurtaracağım. Ülkelere, uluslar arasına dağılan bazılarınız kılıçtan kurtulacak.
9 అప్పుడు అలా తప్పించుకుని ఇతర జాతుల మధ్య బందీలుగా ఉన్నవారు నా గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి నన్ను దూరం చేసిన తమ లైంగిక విశృంఖలత, విగ్రహాలపట్ల వాళ్ళకున్న అనురక్తీ నన్నెలా వేదనకి గురి చేసిందో ఆలోచిస్తారు. చండాలమైన పనులన్నిటితో తాము సాగించిన దుర్మార్గత పట్ల వాళ్ళ ముఖాలపై అసహ్యం కనిపిస్తుంది.
Kurtulanlar tutsak alındıkları uluslarda beni anımsayacaklar. Benden dönen sadakatsiz yüreklerinden, putları ardınca şehvete sürükleyen gözlerinden derin acı duydum. Yaptıkları kötülükler ve iğrenç uygulamalar yüzünden kendilerinden tiksinecekler.
10 ౧౦ అప్పుడు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు. వాళ్ళ పైకి కీడు రప్పిస్తానని నేను చెప్పిన మాట వెనుక ఒక కారణం ఉంది.”
Benim RAB olduğumu, başlarına bu felaketi getireceğimi boşuna söylemediğimi anlayacaklar.
11 ౧౧ ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “నీ చేతులు చరిచి నీ పాదాలు నేలకు తన్ను! ఇశ్రాయేలు జాతి సాగించిన అసహ్యమైన పనుల కోసం ‘అయ్యో’ అని రోదించు. ఎందుకంటే వాళ్ళని ఖడ్గం, కరువు, తెగులు హతం చేస్తాయి.
“‘Egemen RAB şöyle diyor: Ellerini çırp, ayaklarını yere vur, İsrail halkının bütün kötü ve iğrenç uygulamalarından ötürü ah çek! Çünkü kılıçla, kıtlıkla, salgın hastalıkla yok olacaklar.
12 ౧౨ దూరంగా ఉన్నవాళ్ళు తెగులు వల్ల చస్తారు. సమీపంలో ఉన్నవాళ్ళను ఖడ్గం హతం చేస్తుంది. మిగిలిన వాళ్ళు కరువు వల్ల చనిపోతారు. ఈ విధంగా నా క్రోధాన్ని అమలు చేస్తాను.
Uzaktakiler salgın hastalıktan ölecek, yakındakiler kılıçtan geçirilecek, kuşatma sırasında sağ kalanlar kıtlıktan ölecek. Böylece onlara duyduğum öfkeye son vereceğim.
13 ౧౩ వాళ్ళలో హతం అయిన వాళ్ళు ఎత్తయిన కొండలన్నిటి పైనా బలిపీఠాల చుట్టూ ఉన్న విగ్రహాల మధ్యలోనూ, పర్వత శిఖరాల పైనా, తమ విగ్రహాలకి పరిమళ ధూపం వేసిన పచ్చని చెట్లన్నిటి మధ్యా, సింధూర వృక్షాల మధ్యా పడి ఉంటారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
Putlarının arasına, sunaklarının çevresine, her yüksek tepeye, dağ doruğuna, her yeşeren bol yapraklı ağacın altına cesetleri serilince, benim RAB olduğumu anlayacaklar. Oralarda putlarına güzel kokulu buhur sundular.
14 ౧౪ నా శక్తిని కనుపరుస్తాను. వాళ్ళ దేశాన్నీ, వాళ్ళు నివసించే ప్రాంతాలన్నిటినీ దిబ్లాతు ఎడారిలా నిర్జనం గానూ, వ్యర్ధంగానూ చేస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని వాళ్లు తెలుసుకుంటారు.”
Elimi onlara karşı uzatacak, çölden Rivla'ya kadar yaşadıkları ülkeyi yerle bir edip ıssız bırakacağım. O zaman benim RAB olduğumu anlayacaklar.’”

< యెహెజ్కేలు 6 >