< నిర్గమకాండము 32 >
1 ౧ మోషే కొండ దిగి రావడం ఆలస్యం కావడం చూసిన ప్రజలు అహరోను దగ్గరికి వచ్చారు. “లే, మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి మా కోసం ఒక దేవుణ్ణి సిద్ధం చెయ్యి. ఐగుప్తు నుండి మమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన మోషే అనే వాడు ఏమయ్యాడో మాకు తెలియడం లేదు” అన్నారు.
Abantu sebebonile ukuthi uMozisi uphuzile ukwehla entabeni, abantu babuthana kuAroni bathi kuye: Sukuma, usenzele onkulunkulu abazahamba phambi kwethu; ngoba uMozisi lo, indoda eyasikhuphula elizweni leGibhithe, kasazi ukuthi yehlelwe yini.
2 ౨ అప్పుడు అహరోను “మీ భార్యల, కొడుకుల, కూతుళ్ళ చెవులకు ఉన్న బంగారు పోగులు తీసి నా దగ్గరికి తీసుకు రండి” అని చెప్పాడు.
UAroni wasesithi kubo: Qamulani amacici egolide asendlebeni zabomkenu, zamadodana enu, lezamadodakazi enu, liwalethe kimi.
3 ౩ ప్రజలంతా తమ చెవులకున్న బంగారు పోగులు తీసి అహరోను దగ్గరికి తెచ్చారు.
Bonke abantu basebeqamula amacici egolide ayesendlebeni zabo, bawaletha kuAroni.
4 ౪ అతడు వాటిని తీసుకుని దూడ రూపం అచ్చుతో పోత పోసి బంగారం దూడను తయారు చేయించాడు. అప్పుడు ప్రజలు “ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే” అని కేకలు వేశారు.
Wawemukela ezandleni zabo, walibumba ngesikhali sokukhanda, wawenza aba lithole elibunjwe ngokuncibilikisa. Basebesithi: Laba ngonkulunkulu bakho, Israyeli, abakukhuphule elizweni leGibhithe.
5 ౫ అహరోను దాన్ని చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాడు. తరువాత అహరోను “రేపు యెహోవాకు పండగ జరుగుతుంది” అని చాటింపు వేయించాడు.
UAroni eselibonile wakha ilathi phambi kwalo; uAroni wamemezela wathi: Kusasa kuzakuba khona umkhosi weNkosi.
6 ౬ తరువాతి రోజు ప్రజలు ఉదయాన్నే లేచి హోమబలులు, శాంతిబలులు సమర్పించారు. తరువాత ప్రజలు తినడానికి, తాగడానికి కూర్చున్నారు. నాట్యం చేయడం మొదలు పెట్టారు.
Basebevuka ekuseni kakhulu, banikela iminikelo yokutshiswa, basondeza iminikelo yokuthula; abantu bahlala phansi ukudla lokunatha, basebesukuma ukudlala.
7 ౭ అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “కొండ దిగి వెళ్ళు. ఐగుప్తు దేశం నుండి నువ్వు తీసుకు వచ్చిన నీ ప్రజలు చెడిపోయారు.
INkosi yasisithi kuMozisi: Hamba wehle, ngoba abantu bakho owabakhuphula elizweni leGibhithe bonakalisile;
8 ౮ వాళ్ళు పాటించాలని నేను నియమించిన ఉపదేశాల నుండి అప్పుడే తప్పిపోయారు. వాళ్ళ కోసం పోత పోసిన దూడ విగ్రహం తయారు చేసుకుని దానికి సాగిలపడి బలులు అర్పించి ‘ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే’ అని చెప్పుకుంటున్నారు.”
baphambukile masinyane endleleni engabalaya ngayo; bazenzele ithole elibunjwe ngokuncibilikisa, balikhonza, balihlabela, bathi: Laba ngonkulunkulu bakho, Israyeli, abakukhuphule elizweni leGibhithe.
9 ౯ యెహోవా ఇంకా ఇలా అన్నాడు. “నేను ఈ ప్రజలను గమనిస్తున్నాను. వాళ్ళు కఠిన హృదయులయ్యారు.
INkosi yasisithi kuMozisi: Ngibabonile lababantu, khangela-ke, bangabantu abantamo zilukhuni.
10 ౧౦ నువ్వు చూస్తూ ఉండు, నా కోపం వారి మీద రగులుకునేలా చేస్తాను. వాళ్ళను దహించివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను.”
Khathesi-ke ngiyekela ukuze ulaka lwami lubavuthele, ngibaqede; kodwa wena ngizakwenza ube yisizwe esikhulu.
11 ౧౧ అందుకు మోషే తన దేవుడైన యెహోవాను బతిమిలాడాడు. “యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుకోవాలి? నీ బలిష్టమైన చెయ్యి చాపి ఐగుప్తు దేశం నుండి వీళ్ళను బయటకు రప్పించావు కదా.
Kodwa uMozisi wancenga ubuso beNkosi uNkulunkulu wakhe wathi: Kungani, Nkosi, ulaka lwakho lubavuthela abantu bakho owabakhupha elizweni leGibhithe ngamandla amakhulu langesandla esiqinileyo?
12 ౧౨ ఐగుప్తీయులు ‘వాళ్ళ దేవుడు వాళ్ళకు కీడు కలిగించి భూమిపై లేకుండా నశింపజేసి కొండల్లో చనిపోయేలా చేయడానికి వాళ్ళను తీసుకు వెళ్ళాడు’ అని ఎందుకు చెప్పుకోవాలి? నీ కోపాగ్ని నుండి మళ్లుకుని వాళ్లకు కీడు చెయ్యకు.
Kungani amaGibhithe ezakhuluma athi: Wabakhuphela ububi ukubabulala ezintabeni, lokubaqeda ebusweni bomhlaba? Phenduka ekuvutheni kolaka lwakho, uzisole ngobubi obumelene labantu bakho.
13 ౧౩ నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఆకాశంలో ఉండే నక్షత్రాలవలే మీ సంతానాన్ని అభివృద్ధి పరచి నేను చెప్పిన ఈ భూమి అంతటినీ మీ సంతానానికి ఇస్తాననీ, వాళ్ళు శాశ్వతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటారనీ, దానికి నువ్వే సాక్ష్యం అనీ వాళ్ళతో ఒప్పందం చేశావు” అన్నాడు.
Khumbula uAbrahama, uIsaka loIsrayeli, inceku zakho, owazifunga wena kizo wathi kuzo: Ngizakwandisa inzalo yenu njengezinkanyezi zamazulu, lalelilizwe lonke engikhulume ngalo, ngizalipha inzalo yenu, njalo bazalidla ilifa lalo kuze kube nininini.
14 ౧౪ అప్పుడు యెహోవా పరితపించి తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడు చెయ్యలేదు.
INkosi yasizisola ebubini eyayisithi izabenza ebantwini bayo.
15 ౧౫ దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చిన రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. ఆ పలకలపై రెండువైపులా దేవుడు నియమించిన ఆజ్ఞలు రాసి ఉన్నాయి.
UMozisi wasetshibilika wehla entabeni, lezibhebhe ezimbili zobufakazi esandleni sakhe; izibhebhe zazibhalwe inhlangothi zazo zombili; zibhalwe ngapha langapha.
16 ౧౬ ఆ పలకలు దేవుడు తయారు చేశాడు. ఆ పలకలు పట్టుకుని మోషే కొండ దిగి వచ్చాడు.
Lezibhebhe zazingumsebenzi kaNkulunkulu, lombhalo wawungumbhalo kaNkulunkulu, ubazwe ezibhebheni.
17 ౧౭ శిబిరంలో ప్రజలు వేస్తున్న కేకల శబ్దం యెహోషువకు వినబడింది. “మన శిబిరంలో యుద్ధ ధ్వని వినబడుతోంది” అన్నాడు.
Kwathi uJoshuwa esezwile umsindo wabantu beklabalala, wathi kuMozisi: Kulomsindo wempi enkambeni.
18 ౧౮ మోషే “అది జయ ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత వాయిద్యాల శబ్దం నాకు వినబడుతోంది” అన్నాడు.
Kodwa wathi: Kakusumsindo wokuklabalala kokunqoba, njalo kakusumsindo wokuklabalala kokunqotshwa; ngizwa umsindo wokuhlabelela.
19 ౧౯ అతడు శిబిరం చేరుకున్నప్పుడు ప్రజలు చేసుకున్న ఆ దూడ, నాట్యం చేస్తున్న ప్రజలు కనిపించారు. మోషే కోపం రగులుకుంది. అతడు తన చేతుల్లో ఉన్న పలకలను కొండ కింది భాగానికి విసిరేసి వాటిని పగలగొట్టాడు.
Kwasekusithi esesondele enkambeni walibona ithole lokugida; ulaka lukaMozisi lwaseluvutha, wasezilahla izibhebhe ezandleni zakhe, waziphahlazela phansi kwentaba.
20 ౨౦ ప్రజలు తయారు చేసుకున్న ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేశాడు. ఆ పొడిని నీళ్లలో కలిపి ఇశ్రాయేలు ప్రజల చేత తాగించాడు.
Wathatha ithole ababelenzile, walitshisa emlilweni, walichola laze lacoleka, walivuvuzela emanzini, wabanathisa wona abantwana bakoIsrayeli.
21 ౨౧ అప్పుడు మోషే “ఈ ప్రజల మీదికి ఈ గొప్ప అపరాధం వచ్చేలా చేయడానికి వీళ్ళు నిన్ను ఎలా ప్రేరేపించారు?” అని అహరోనును అడిగాడు.
UMozisi wasesithi kuAroni: Abantu laba benzeni kuwe ukuze ubehlisele isono esikhulu kangaka?
22 ౨౨ అహరోను “నా ప్రభూ, నీ కోపం రగులుకోనియ్యకు. ఈ ప్రజలు దుర్మార్గులు అనే విషయం నీకు తెలుసు.
UAroni wasesithi: Kalungavuthi ulaka lwenkosi yami; wena uyabazi abantu ukuthi batshekele ebubini.
23 ౨౩ వాళ్ళు ‘మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుణ్ణి సిద్ధం చెయ్యి. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకు వచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియడం లేదు’ అన్నారు.
Ngoba bathi kimi: Senzele onkulunkulu abazahamba phambi kwethu; ngoba uMozisi lo, indoda eyasikhuphula elizweni leGibhithe, kasazi ukuthi yehlelwe yini.
24 ౨౪ అప్పుడు నేను ఎవరి దగ్గర బంగారం ఉన్నదో వాళ్ళంతా దాన్ని ఊడదీసి తీసుకు రండి అని చెప్పాను. వాళ్ళు తెచ్చిన దాన్ని అగ్నిలో వేస్తే ఈ దూడ అయ్యింది” అని చెప్పాడు.
Ngasengisithi kubo: Loba ngubani olegolide, kabaliqamule. Basebenginika lona. Ngasengiliphosela emlilweni, kwasekuphuma lelithole.
25 ౨౫ ప్రజలు తమ శత్రువుల ఎదుట నవ్వులపాలు కావడానికి అహరోను కారకుడయ్యాడు. ప్రజలు విచ్చలవిడితనంగా తిరగడం మోషే గమనించాడు.
Kwathi uMozisi esebonile abantu ukuthi babengabambeki (ngoba uAroni wabayekela bangabambeki ukuze bayangeke kwababengabavukela),
26 ౨౬ అప్పుడు మోషే శిబిరం ద్వారం దగ్గర నిలబడి “యెహోవా పక్షంగా ఉన్నవాళ్ళంతా నా దగ్గరికి రండి” అన్నాడు. లేవీయులంతా అతని దగ్గరికి వచ్చారు.
uMozisi wasesima esangweni lenkamba, wathi: Loba ngubani ongoweNkosi, keze kimi! Kwasekubuthana kuye wonke amadodana kaLevi.
27 ౨౭ అతడు వాళ్ళను చూసి “మీలో ప్రతి ఒక్కరూ మీ కత్తులు నడుముకు కట్టుకోండి, శిబిరంలో గుమ్మం నుండి గుమ్మానికి వెళ్తూ ప్రతి ఒక్కరూ తమ సోదరుణ్ణి, తమ స్నేహితుణ్ణి, తమ పొరుగువాణ్ణి సంహరించండి” అన్నాడు.
Wasesithi kuwo: Itsho njalo iNkosi uNkulunkulu kaIsrayeli ithi: Ngulowo lalowo kahlome inkemba yakhe ethangazini lakhe, adabule aphenduke esuka esangweni esiya esangweni enkambeni, langulowo lalowo abulale umfowabo, langulowo lalowo umngane wakhe, langulowo lalowo umakhelwane wakhe.
28 ౨౮ లేవీయులు మోషే మాట ప్రకారం చేసారు. ఆ రోజున ప్రజల్లో సుమారు మూడు వేల మంది హతమయ్యారు.
Amadodana kaLevi asesenza njengelizwi likaMozisi; njalo kwawa ebantwini ngalolosuku abantu abangabazinkulungwane ezintathu.
29 ౨౯ మోషే లేవీయులతో “మిమ్మల్ని మీరు యెహోవాకు ప్రతిష్ట చేసుకోండి. మీలో ప్రతి ఒక్కరూ మీ కొడుకులనూ, సోదరులనూ చంపి యెహోవా ఆశీర్వాదాలు పొందారు” అన్నాడు.
UMozisi wasesithi: Lizehlukanisele iNkosi lamuhla, ngoba ngulowo lalowo ubemelene lendodana yakhe amelane lomfowabo, ukuze aphe isibusiso phezu kwenu lamuhla.
30 ౩౦ మరుసటి రోజు మోషే ప్రజలతో “మీరు గొప్ప పాపం చేశారు. నేను యెహోవా దగ్గరికి కొండ ఎక్కి వెళ్తాను. ఒకవేళ మీరు చేసిన పాపం కోసం ఏదైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో” అన్నాడు.
Kwasekusithi kusisa uMozisi wathi ebantwini: Lina lenze isono esikhulu; khathesi sengizakwenyukela eNkosini; mhlawumbe ngingenza inhlawulo yokuthula ngesono senu.
31 ౩౧ మోషే యెహోవా కొండకు మళ్ళీ వెళ్ళాడు. “అయ్యో, ఈ ప్రజలు ఎంతో పాపం చేశారు. వాళ్ళు తమ కోసం బంగారు దేవుణ్ణి చేసుకున్నారు.
UMozisi wasebuyela eNkosini wathi: Maye! Lababantu bonile isono esikhulu, bazenzele onkulunkulu begolide.
32 ౩౨ అయ్యో, వాళ్ళు చేసిన పాపాన్ని పరిహరించు, లేని పక్షంలో నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు” అని బతిమాలుకున్నాడు.
Khathesi-ke, uba uthethelela isono sabo - kodwa uba kungenjalo, ake ungesule egwalweni lwakho olubhalileyo.
33 ౩౩ అందుకు యెహోవా “నాకు విరోధంగా ఎవరు పాపం చేస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తొలగిస్తాను.
INkosi yasisithi kuMozisi: Owonileyo kimi ngizamesula egwalweni lwami.
34 ౩౪ నువ్వు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నేను శిక్షించే రోజున వాళ్ళ పాపం విషయంలో వాళ్ళకు శిక్ష రప్పిస్తాను” అని మోషేతో చెప్పాడు.
Kodwa hamba-ke, ukhokhele abantu baye lapho engikhulume lawe ngakho; khangela, ingilosi yami izahamba phambi kwakho. Kanti mhla ngiphindisela ngizaphindisela isono sabo phezu kwabo.
35 ౩౫ ప్రజలు అహరోను చేత చేయించిన దూడను బట్టి యెహోవా వాళ్ళను బాధలకు గురి చేశాడు.
INkosi yasibatshaya abantu ngoba babenze ithole, uAroni ayelenzile.