< నిర్గమకాండము 11 >
1 ౧ యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ఫరో మీదికీ ఐగుప్తు మీదికీ మరొక తెగులు రప్పించబోతున్నాను. దాని తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. ఎవ్వరూ మిగలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు.
(А Господ беше казал на Моисея: Още една язва ще нанеса на Фараона и на Египет, подир което ще ви пусне от тука; когато ви пусне, съвсем ще ви изпъди от тука.
2 ౨ కాబట్టి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగువాళ్ళ దగ్గర నుండి వెండి, బంగారు నగలు అడిగి తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి.”
Кажи, прочее, в ушите на людете, и нека поиска всеки мъж от съседа си, и всяка жена от съседката си, сребърни и златни вещи.
3 ౩ యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తీయులకు కనికరం కలిగేలా చేశాడు. అంతేకాక ఐగుప్తు దేశవాసులు, ఫరో సేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు.
И Господ беше дал на людете да продибият благоволението на египтяните. При това, Моисей беше станал твърде велик човек в Египетската земя пред Фараоновите слуги и пред людете).
4 ౪ మోషే ఫరోతో ఇలా అన్నాడు “యెహోవా చెప్పింది ఏమిటంటే, అర్థరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వెళ్తాను.
Моисей каза на Фараона: Така казва Господ: Около средата на една нощ Аз ще мина през Египет;
5 ౫ ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు. సింహాసనంపై ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకుని తిరగలి విసిరే పనిమనిషి మొదట పుట్టిన సంతానం దాకా, పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి.
и всички първороден в Египетската земя ще умре, от първородните на Фараона, който седи на престола си, до първородния на слугинята, която е зад воденицата, и до всяко първородно от добитъка.
6 ౬ అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోటా గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి ఏడుపు ఇంతవరకూ ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు.
И по цялата Египетска земя ще се нададе голям писък, какъвто никога не е имало, нито ще има вече такъв.
7 ౭ యెహోవా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాడని మీరు తెలుసుకొనేలా ఇశ్రాయేలు ప్రజలపై గానీ జంతువులపై గానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరి మీదా కుక్క అయినా నాలుక ఆడించదు.
А против израилтяните, против човек или животно, нито куче няма да поклати езика си, за да познаете, че Господ прави разлика между египтяните и израилтяните.
8 ౮ అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు. నా ఎదుట సాష్టాంగపడి, ‘నువ్వు, నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి’ అని చెబుతారు. అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను” అని చెప్పి మోషే మండిపడుతూ ఫరో దగ్గరనుండి వెళ్ళిపోయాడు.
И всички тия твои слуги ще дойдат при мене и ще ми припаднат и рекат: Излез ти с всичките люде, които те следват. И подир това ще изляза. И Моисей излезе от Фараоновото присъствие с голям гняв.
9 ౯ అప్పుడు యెహోవా “ఐగుప్తు దేశంలో నేను చేసే అద్భుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు” అని మోషేతో చెప్పాడు.
(А Господ беше казал на Моисея: Фараон няма да ви послуша, за да се умножат Моите чудеса в Египетската земя.
10 ౧౦ మోషే అహరోనులు ఫరో సమక్షంలో ఈ అద్భుతాలు చేశారు. అయినప్పటికీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనియ్యలేదు.
И Моисей и Аарон бяха извършили всички тия чудеса пред Фараона, и той не беше пуснал израилтяните из земята си).