< ఎస్తేరు 3 >
1 ౧ ఈ విషయాలు జరిగాక అహష్వేరోషు రాజు హమ్మెదాతా కొడుకు, అగగు వంశం వాడు అయిన హామానుకు పదోన్నతి కలిగించి, అతని అధికార హోదాను తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎక్కువగా చేశాడు.
After these things King Achashyerosh promoted Haman the son of Hammedatha the Agagite, and advanced him, and set his seat above all the officials who were with him.
2 ౨ కాబట్టి రాజ భవన ద్వారం దగ్గర ఉండే రాజోద్యోగులంతా రాజాజ్ఞ ప్రకారం మోకాళ్లూని హామానుకు నమస్కరించారు. మొర్దెకై మాత్రం అలా వంగలేదు, సాష్టాంగ పడలేదు.
All the king's servants who were in the King's Gate bowed down, and paid homage to Haman; for the king had so commanded concerning him. But Mordecai did not bow down or pay him homage.
3 ౩ రాజు భవన ద్వారం దగ్గర ఉండేవారంతా అతనితో “నువ్వు రాజాజ్ఞ పాటించవేమిటి?” అని అడిగేవారు.
Then the king's servants, who were in the King's Gate, said to Mordecai, "Why do you disobey the king's commandment?"
4 ౪ వారు పదే పదే అలా అడిగినా అతడు వారి మాట చెవిని బెట్టలేదు. తాను యూదుడిననీ ఆ కారణంగా తాను ఆ పని చేయలేననీ అతడు వారితో చెప్పాడు. అందుకని అతడు ఆ మాటపై నిలిచి ఉంటాడో లేదో చూద్దాం అని వారు హామానుకు ఈ విషయం తెలియజేశారు.
Now it came to pass, when they spoke daily to him, and he did not listen to them, that they told Haman, to see whether Mordecai's reason would stand; for he had told them that he was a Jew.
5 ౫ మొర్దెకై తన ముందు మోకరించక పోవడం, వంగి నమస్కరించక పోవడం చూసి హామాను మండిపడ్డాడు.
When Haman saw that Mordecai did not bow down, nor pay him homage, Haman was full of wrath.
6 ౬ అతడు, మొర్దెకై జాతి ప్రజలు ఎవరో తెలుసుకుని “మొర్దెకైని మాత్రమే చంపితే అందులో గొప్పతనం ఏముంది?” అనుకున్నాడు. ఎందుకంటే అహష్వేరోషు రాజ్యమంతటా ఉన్న మొర్దెకై జాతి ప్రజలైన యూదులనందరినీ తుడిచి పెట్టేయాలని అతడు అనుకున్నాడు.
But he scorned the thought of laying hands on Mordecai alone, for they had made known to him Mordecai's people. Therefore Haman sought to destroy all the Jews who were throughout the whole kingdom of Achashyerosh, even Mordecai's people.
7 ౭ రాజైన అహష్వేరోషు పరిపాలన పన్నెండో సంవత్సరంలో నీసాను అనే మొదటి నెలలో వారు హామాను ఎదుట “పూరు” అంటే చీటిని రోజు రోజుకీ నెల నెలకీ వేశారు. చివరికి అదారు అనే పన్నెండో నెల ఎంపిక అయింది.
In the first month, which is the month Nisan, in the twelfth year of King Achashyerosh, they cast Pur (that is, the lot) before Haman from day to day, and from month to month, and chose the twelfth month, which is the month Adar.
8 ౮ అప్పుడు హామాను అహష్వేరోషుతో ఇలా చెప్పాడు. “మీ రాజ్య సంస్థానాలన్నింటిలో ఒక జాతి ప్రజలు అక్కడక్కడా నివసిస్తున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వ్యతిరేకం. వారు రాజాజ్ఞలు పాటించరు. కాబట్టి వారిని ఉండనివ్వడం రాజుకు శ్రేయస్కరం కాదు.
Haman said to King Achashyerosh, "There is a certain people scattered abroad and dispersed among the peoples in all the provinces of your kingdom, and their laws are different than other people's. They do not keep the king's laws. Therefore it is not for the king's profit to allow them to remain.
9 ౯ రాజుకు అంగీకారమైతే వారిని వధించడానికి ఆజ్ఞ ఇవ్వండి. నేను ఈ రాచకార్యాన్ని జరిగించే వారికి ఇరవై వేల మణుగుల వెండిని తూచి రాజు గారి ఖజానాలో ఉంచుతాను.”
If it pleases the king, let it be written that they be destroyed; and I will pay ten thousand talents of silver into the hands of those who are in charge of the king's business, to bring it into the king's treasuries."
10 ౧౦ రాజు తన రాజముద్రిక తీసి దాన్ని హమ్మెదాతా కొడుకు, అగగు వంశీకుడు అయిన హామానుకు ఇచ్చాడు. ఇతడు యూదులకు శత్రువు.
The king took his ring from his hand, and gave it to Haman the son of Hammedatha the Agagite, the Jews' enemy.
11 ౧౧ “ఆ వెండి నీకు, నీ వారికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. దానితో నువ్వు ఏది అనుకుంటే అది చెయ్యి” అన్నాడు.
The king said to Haman, "The silver is given to you, the people also, to do with them as it seems good to you."
12 ౧౨ మొదటి నెల పదమూడో రోజున రాజుగారి లేఖికులను పిలిపించారు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం, రాజు నియమించిన సంస్థానాల అధికారులకు, వివిధ సంస్థానాల పాలకులకు, వివిధ ప్రజల అధికారులకు, ప్రజలందరిపై ఉన్న కార్యనిర్వాహక అధిపతులకు వారి వారి లిపి ప్రకారం, వివిధ ప్రజల భాషల్లో రాసి పంపాలని ఆజ్ఞ అయింది. రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులు తాకీదులు రాశారు. వాటిపై రాజముద్ర వేశారు.
Then the king's scribes were called in on the first month, on the thirteenth day of the month; and all that Haman commanded was written to the king's satraps, and to the governors who were over every province, and to the officials of every people, to every province according its writing, and to every people in their language. It was written in the name of King Achashyerosh, and it was sealed with the king's ring.
13 ౧౩ అదారు అనే పన్నెండో నెల పదమూడో రోజున యువత మొదలుకుని వృద్ధుల వరకూ, పిల్లలు, స్త్రీలు అనే తేడా లేకుండా యూదులందరినీ ఒక్క రోజే చంపి సమూల నాశనం చేసి వారి సొమ్ము కొల్లగొట్టాలని ఆజ్ఞ రాసి ఉన్న రాజపత్రాలను అంచెల వారీగా వార్తాహరులు రాజ్య సంస్థానాలన్నిటికీ తీసుకు పోయారు.
Letters were sent by couriers into all the king's provinces, to destroy, to kill, and to cause to perish, all Jews, both young and old, little children and women, in one day, even on the thirteenth day of the twelfth month, which is the month Adar, and to plunder their possessions.
14 ౧౪ ఆ రోజు కోసం అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపే ఆ ఆజ్ఞ తాలూకు ప్రతులు అన్ని సంస్థానాల ప్రజలందరికీ అందజేశారు.
A copy of the letter, that the decree should be given out in every province, was published to all the peoples, that they should be ready against that day.
15 ౧౫ వార్తాహరులు రాజాజ్ఞను చేరవేయడానికి చురుకుగా బయలుదేరి వెళ్లారు. ఈ ఆజ్ఞ షూషను కోటలో కూడా ప్రకటించారు. రాజు, హామాను విందుకు కూర్చున్నారు. షూషను పట్టణం అంతా గందరగోళంగా ఉంది.
The couriers went forth in haste by the king's commandment, and the decree was given out in the citadel of Shushan. The king and Haman sat down to drink; but the city of Shushan was perplexed.