< దానియేలు 5 >
1 ౧ కొన్ని సంవత్సరాలు తరువాత ఒక రోజు రాజైన బెల్షస్సరు తన రాజ్యంలోని వెయ్యి మంది అధికారులకు గొప్ప విందు చేయించాడు. ఆ వెయ్యి మందితో కలిసి ద్రాక్షమద్యం తాగుతున్నాడు.
Belshazzar, the king, made a great feast for a thousand of his nobles, and each one of them drank according to his age.
2 ౨ బెల్షస్సరు ద్రాక్షమద్యం సేవిస్తూ తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేమును కొల్లగొట్టి దేవాలయంలో నుండి తెచ్చిన బంగారు, వెండి పాత్రలను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అతడు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు వాటిలో ద్రాక్ష మద్యం సేవించాలన్నది అతడి ఉద్దేశం.
And so, when they were drunk, he instructed that the vessels of gold and silver should be brought, which Nebuchadnezzar, his father, had carried away from the temple, which was in Jerusalem, so that the king, and his nobles, and his wives, and the concubines, might drink from them.
3 ౩ సేవకులు యెరూషలేములో ఉన్న దేవుని నివాసమైన ఆలయం నుండి దోచుకువచ్చిన బంగారు పాత్రలు తీసుకువచ్చారు. రాజు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్ష మద్యం పోసుకుని సేవించారు.
Then the gold and silver vessels were presented, which he had carried away from the temple and which had been in Jerusalem, and the king, and his nobles, wives, and concubines, drank from them.
4 ౪ అలా సేవిస్తూ బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేయబడిన తమ దేవుళ్ళను కీర్తించారు.
They drank wine, and they praised their gods of gold, and silver, brass, iron, and wood and stone.
5 ౫ ఆ సమయంలోనే రాజుకు మనిషి చేతి వేళ్ళు కనిపించాయి. దీపస్తంభం ఎదురుగా రాజ భవనం గోడ మీద ఏదో ఒక రాత రాస్తూ ఉన్నట్టు కనబడింది.
In the same hour, there appeared fingers, as of the hand of a man, writing on the surface of the wall, opposite the candlestick, in the king’s palace. And the king observed the part of the hand that wrote.
6 ౬ ఆ చెయ్యి గోడపై రాస్తూ ఉండడం చూసిన రాజు ముఖం పాలిపోయింది. అతడు హృదయంలో కలవరం చెందాడు. అతని మోకాళ్ళు వణుకుతూ గడగడ కొట్టుకున్నాయి. నడుము కీళ్లు పట్టు సడలాయి.
Then the king’s countenance was changed, and his thoughts disturbed him, and he lost his self-control, and his knees knocked against one other.
7 ౭ రాజు ఆత్రుతగా గారడీ విద్యలు చేసేవాళ్ళను, కల్దీయులను జ్యోతిష్యులను వెంటనే పిలిపించమని ఆజ్ఞ ఇచ్చాడు. బబులోనులోని జ్ఞానులు రాగానే వాళ్ళతో ఇలా అన్నాడు. “ఈ రాతను చదివి దీని భావం నాకు తెలియజేసిన వాడికి అతడు ఎవరైనా సరే, అతనికి ఊదా రంగు దుస్తులు ధరింపజేసి అతని మెడకు బంగారు గొలుసులు వేయిస్తాను. అతణ్ణి రాజ్యంలో మూడో అధిపతిగా నియమిస్తాను.”
And the king cried out loudly for them to bring in the astrologers, Chaldeans, and soothsayers. And the king proclaimed to the wise men of Babylon, saying, “Whoever will read this writing and make known to me its interpretation will be clothed with purple, and will have a golden chain on his neck, and will be third in my kingdom.”
8 ౮ రాజ్యానికి చెందిన జ్ఞానులందరూ చేరుకున్నారు. కానీ అక్కడ రాసింది చదవడానికీ దాని భావం చెప్పడానికీ ఎవ్వరికీ సాధ్యం కాలేదు.
Then, in came all the wise men of the king, but they could neither read the writing, nor reveal the interpretation to the king.
9 ౯ అందువల్ల బెల్షస్సరు రాజు మరింత భయపడ్డాడు. అధికారులంతా ఆశ్చర్యపడేలా అతని ముఖం వికారంగా మారిపోయింది.
Therefore, king Belshazzar was quite confused, and his face was altered, and even his nobles were disturbed.
10 ౧౦ రాజు, అతని అధిపతులు ఆందోళన చెందుతున్న విషయం రాణికి తెలిసింది. ఆమె విందు జరుగుతున్న గృహానికి చేరుకుని, రాజుతో ఇలా చెప్పింది. “రాజు చిరకాలం జీవిస్తాడు గాక. నీ ఆలోచనలతో కలవరపడవద్దు. నీ మనస్సును నిబ్బరంగా ఉంచుకో.
But the queen, because of what had happened to the king and his nobles, entered the banquet house. And she spoke out, saying, “O king, live forever. Do not let your thoughts confuse you, neither should your face be altered.
11 ౧౧ నీ రాజ్యంలో పవిత్ర దేవుని ఆత్మ కలిగి ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. నీ తండ్రి జీవించి ఉన్న కాలంలో అతనికి దేవతల జ్ఞానం, బుద్ధి వివేకాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. అందువల్ల నీ తండ్రి నెబుకద్నెజరు అతణ్ణి దేశంలో శకునం చెప్పేవాళ్ళ మీద, గారడీవిద్య గలవారి మీద, కల్దీయుల, జ్యోతిష్యుల మీద అధికారిగా నియమించాడు.”
There is a man in your kingdom, who has the spirit of the holy gods within himself, and in the days of your father, knowledge and wisdom were found in him. For king Nebuchadnezzar, your father, appointed him leader of the astrologers, enchanters, Chaldeans, and soothsayers, even your father, I say to you, O king.
12 ౧౨ “ఈ దానియేలు బుద్ధికుశలత కలిగినవాడై కలల భావం చెప్పడానికి, మర్మం బయలుపరచడానికి, కఠినమైన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి జ్ఞానం, తెలివితేటలు కలిగినవాడు కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. ఈ దానియేలుకు కబురు పెట్టి రప్పించు. అతడు దీని భావం నీకు చెబుతాడు.”
For a greater spirit, and foresight, and understanding, and interpretation of dreams, and the revealing of secrets, and the solution to difficulties were found in him, that is, in Daniel, to whom the king gave the name Belteshazzar. Now, therefore, let Daniel be summoned, and he will explain the interpretation.”
13 ౧౩ అప్పుడు వాళ్ళు దానియేలును తీసుకువచ్చారు. అతడు వచ్చినప్పుడు రాజు ఇలా అన్నాడు. “రాజైన నా తండ్రి యూదయ దేశం నుండి చెరపట్టి తీసుకువచ్చిన బందీల్లో ఉన్న దానియేలువి నువ్వే కదా?
Then Daniel was brought in before the king. And the king spoke to him, saying, “Are you Daniel, of the sons of the captivity of Judah, whom my father the king led out of Judea?
14 ౧౪ దేవుళ్ళ ఆత్మ, బుద్ది వివేకాలు, అమితమైన జ్ఞాన సంపద నీలో ఉన్నాయని నిన్ను గూర్చి విన్నాను.
I have heard of you, that you have the spirit of the gods, and that greater knowledge, as well as understanding and wisdom, have been found in you.
15 ౧౫ గోడపై రాసి ఉన్న దీన్ని చదివి దాని భావం తెలియజేయడానికి జ్ఞానులను, గారడీ విద్యలు చేసేవాళ్ళను పిలిపించాను. వాళ్ళు దీని అర్థం చెప్పలేకపోయారు.”
And now the wise astrologers have entered into my presence, so as to read this writing and to reveal to me its interpretation. And they were not able to tell me the meaning of this writing.
16 ౧౬ “నిగూఢ మర్మాలను వెల్లడించడానికి, కఠినమైన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నీవు సమర్ధుడవని నిన్ను గూర్చి విన్నాను. కనుక ఈరాతను చదివి, దాని అర్థం వివరించిన పక్షంలో నీకు ఊదారంగు దుస్తులు ధరింపజేస్తాను. నిన్ను దేశంలో నా తరువాత మూడో స్థానంలో అధికారిగా చేస్తాను.”
Furthermore, I have heard about you that you can interpret obscure things and solve difficulties. So then, if you succeed in reading the writing, and in revealing its interpretation, you will be clothed with purple, and you will have a chain of gold around your neck, and you will be the third leader in my kingdom.”
17 ౧౭ బదులుగా దానియేలు ఇలా అన్నాడు. “రాజా, నీ బహుమతులు నీ దగ్గరే ఉంచుకో. వాటిని ఇంకా ఎవరికైనా ఇచ్చుకో. నేను ఇక్కడ రాసి ఉన్నదాన్ని చదివి, నీకు దాని అర్థం చెబుతాను.
To this Daniel responded by saying directly to the king, “Your rewards should be for yourself, and the gifts of your house you may give to another, but I will read to you the writing, O king, and I will reveal to you its interpretation.
18 ౧౮ రాజా విను. మహోన్నతుడైన దేవుడు ఉన్నత స్థితిని, రాజ్యాన్ని. బల ప్రభావాలను నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చి ఘనపరిచాడు.
O king, the Most High God gave to Nebuchadnezzar, your father, a kingdom and greatness, glory and honor.
19 ౧౯ దేవుడు అతనికి అలాంటి ఉన్నత స్థితిని అనుగ్రహించడంవల్ల అతడు ఎవరిని చంపాలనుకున్నాడో వాళ్ళను చంపాడు. ఎవరిని కాపాడాలనుకున్నాడో వాళ్ళను కాపాడాడు. ఎవరిని గొప్ప చేయాలనుకున్నాడో వాళ్ళను గొప్పచేశాడు. ఎవరిని అణచివేయాలనుకున్నాడో వాళ్ళను అణచివేశాడు. అందువల్ల సకల ప్రాంతాల ప్రజలు, వివిధ భాషలు మాట్లాడేవాళ్ళు అతనికి భయపడుతూ అతని ఎదుట వణకుతూ లోబడి ఉన్నారు.”
And because of the greatness that he gave to him, all peoples, tribes, and languages trembled and were afraid of him. Whomever he wished, he put to death; and whomever he wished, he destroyed; and whomever he wished, he exalted; and whomever he wished, he lowered.
20 ౨౦ “అయితే అతని హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది. అతని హృదయం కఠినం చేసుకుని చెడ్డ పనులు జరిగించినప్పుడు దేవుడు అతని నుండి రాజ్యాన్ని తీసివేసి అతని ఘనతనంతా పోగొట్టాడు.
But when his heart was lifted up and his spirit was hardened in arrogance, he was deposed from the throne of his kingdom and his glory was taken away.
21 ౨౧ అతణ్ణి మనుషుల మధ్య నుండి తరిమివేశాడు. అతడి మనసు పశువుల మనసులా మారిపోయింది. అతడు అడవి గాడిదలాగా గడ్డి మేస్తూ ఆకాశం నుంచి పడే మంచుకు తడిసిపోయాడు. మహోన్నతుడైన దేవుడే మనుషుల మీదా, రాజ్యాల మీదా సర్వాధికారి అనీ, ఆయన ఎవరిని వాటిపై నియమించాలనుకున్నాడో వాళ్ళను నియమిస్తాడనీ గ్రహించే వరకూ అదే స్థితిలో ఉండిపోయాడు.”
And he was expelled from the sons of men, and so his heart was placed with the beasts, and his dwelling was with the wild donkeys, and he ate hay like an ox, and his body was drenched with the dew of heaven, until he realized that the Most High holds power over the kingdom of men, and that whoever he wishes, he will set over it.
22 ౨౨ “బెల్షస్సరూ, అతని కొడుకువైన నీకు ఈ విషయాలన్నీ తెలుసు. అవన్నీ తెలిసి కూడా నువ్వు నీ మనస్సును అదుపులో ఉంచుకోకుండా పరలోకంలో ఉండే ప్రభువుకంటే అధికంగా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు.
Likewise, you, his son Belshazzar, have not humbled your heart, though you knew all these things.
23 ౨౩ ఎలాగంటే నువ్వూ, నీ అధికారులు, రాణులు, ఉపపత్నులు దేవుని ఆలయం నుండి తెచ్చిన పాత్రల్లో ద్రాక్షామద్యం పోసుకుని సేవించారు. బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేసిన, చూడలేని, వినలేని, గ్రహించలేని దేవుళ్ళను కీర్తించారు. నీ ప్రాణం, నీ సకల సంపదలు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ దేవుణ్ణి నువ్వు ఘనపరచలేదు.
But you have lifted yourself up against the Lord of heaven. And the vessels of his house have been presented before you. And you, and your nobles, and your wives, and your concubines, have drunk wine from them. Likewise, you have praised the gods of silver, and gold, and brass, iron, and wood and stone, who neither see, nor hear, nor feel, yet you have not glorified the God who holds your breath and all your ways in his hand.
24 ౨౪ అందువల్ల ఆ దేవుని సన్నిధి నుండి ఈ చెయ్యి వచ్చి ఈ విధంగా రాసింది. రాసిన విషయం ఏమిటంటే, ‘మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్.’
Therefore, he has sent the part of the hand which has written this, which has been inscribed.
25 ౨౫ ఈ రాతకి అర్థం ఏమిటంటే, ‘మెనే’ అంటే, దేవుడు నీ రాజ్య పాలన విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు.
But this is the writing that has been decreed: MANE, THECEL, PHARES.
26 ౨౬ ‘టెకేల్’ అంటే, ఆయన నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువవాడిగా కనిపించావు.
And this is the interpretation of the words. MANE: God has numbered your kingdom and has finished it.
27 ౨౭ ‘ఫెరేన్’ అంటే, నీ రాజ్యం నీ దగ్గర నుండి తీసివేసి మాదీయ జాతికివారికి, పారసీకులకు ఇవ్వడం జరుగుతుంది.”
THECEL: you have been weighed on the scales and found lacking.
28 ౨౮ బెల్షస్సరు ఆజ్ఞ ప్రకారం దానియేలుకు ఊదారంగు దుస్తులు తొడిగించారు.
PHARES: your kingdom has been divided and has been given to the Medes and the Persians.
29 ౨౯ అతని మెడలో స్వర్ణ హారం వేసి, ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణలో అతణ్ణి మూడవ అధికారిగా నియమించి చాటింపు వేయించారు.
Then, by the king’s command, Daniel was dressed with purple, and a chain of gold was placed around his neck, and it was proclaimed of him that he held power as the third in the kingdom.
30 ౩౦ అదే రాత్రి బెల్షస్సరు అనే ఆ కల్దీయుల రాజును చంపేశారు.
That same night, king Belshazzar the Chaldean was killed.
31 ౩౧ అరవై రెండు సంవత్సరాల వయసున్న మాదీయ రాజు దర్యావేషు సింహాసనం అధిష్టించాడు.
And Darius the Mede succeeded to the kingdom, at the age of sixty-two years.