< అపొస్తలుల కార్యములు 26 >
1 ౧ అగ్రిప్ప పౌలుతో, “నీ వాదన వినిపించడానికి నీకు అనుమతి నిచ్చాను” అన్నాడు. అప్పుడు పౌలు తాను మాట్లాడబోతున్నట్టు సూచిస్తూ చెయ్యి చాచి ఈ విధంగా జవాబు చెప్పాడు.
Agrippa vyzval Pavla: „Pověz, co můžeš uvést na svou obhajobu!“Pavel pozvedl ruku po způsobu řečníků a začal:
2 ౨ “అగ్రిప్ప రాజా, మీరు యూదుల ఆచారాలనూ వివాదాలనూ బాగా ఎరిగిన వారు.
„Jsem rád, králi Agrippo, že se mohu hájit proti obžalobám židů právě před tebou.
3 ౩ యూదులు నామీద ఆరోపించిన నేరాలను గూర్చి ఈ రోజు మీ ముందు జవాబు చెప్పుకోవడం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. దయచేసి ఓపికతో నా మనవి వినండి.
Vím, že znáš dobře židovské zvyky i sporné otázky. Chci ti vše vyložit od začátku, a tak tě prosím o trpělivost.
4 ౪ మొదట నా ప్రజల మధ్య తరువాత యెరూషలేములో బాల్యం నుండి నేను గడిపిన జీవితం ఎలాటిదో యూదులందరికీ తెలుసు.
Už v mládí jsem přišel do Jeruzaléma a všichni se tam na mne pamatují. Musejí připustit, že jsem patřil k nejhorlivější skupině našeho náboženství, k farizejům.
5 ౫ వారు మొదటినుండీ నన్ను ఎరిగినవారు కాబట్టి వారు నా గురించి చెప్పాలంటే నేను మన మతంలోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడిగా జీవించినట్టు చెప్పగలరు.
6 ౬ అయితే ఇప్పుడు దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దాన సంబంధమైన నిరీక్షణను బట్టి నన్నిక్కడ విమర్శకు గురి చేస్తూ నిలబెట్టారు.
A vlastně i dnes stojím před soudem proto, že pevně držím to nejlepší, co vyznávají farizejové: že totiž Bůh splní sliby, které dal našim otcům, když mu budeme všichni vytrvale sloužit.
7 ౭ మన పన్నెండు గోత్రాల ప్రజలు రాత్రింబగళ్ళు దేవుణ్ణి సేవిస్తూ ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నాపై నేరం మోపారు.
8 ౮ దేవుడు మృతులను లేపుతాడన్న సంగతి నమ్మశక్యం కానిదని మీరెందుకు భావిస్తున్నారు?
Možná, že vám to připadá absurdní, ale opravdu věřím, že Bůh vzkřísí mrtvé.
9 ౯ నజరేయుడైన యేసు అనే పేరుకి విరోధంగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకొన్నాను.
Tehdy jsem se ovšem i já domníval, že musím všemi prostředky bojovat proti učení Ježíše z Nazaretu,
10 ౧౦ యెరూషలేములో నేనలాగే చేశాను. ప్రధాన యాజకుల వలన అధికారం పొంది, అనేకమంది పవిత్రులను చెరసాలల్లో వేశాను. వారిని చంపినప్పుడు సమ్మతించాను.
a byl jsem při tom v Jeruzalémě nejhorlivější. Velekněží mne zplnomocnili, abych Ježíšovy následovníky vyhledával, zatýkal a dával uvěznit. Vždy jsem byl pro to, aby byli odsouzeni k smrti.
11 ౧౧ చాలాసార్లు సమాజ మందిరాల్లో వారిని దండించి వారు దేవదూషణ చేసేలా బలవంతపెట్టాను. అంతేగాక వారిమీద తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలకు సైతం వెళ్ళి వారిని హింసించాను.
Dával jsem ty lidi bičovat v synagogách a nutil je, aby veřejně tupili svou víru. Byl jsem jako posedlý a začal jsem je pronásledovat i v jiných městech.
12 ౧౨ “అందుకోసం నేను ప్రధాన యాజకుల చేత అధికారాన్నీ ఆజ్ఞలనూ పొంది దమస్కు పట్టణానికి వెళుతున్నపుడు
Tak jsem se také vypravil s plnou mocí od velekněží do Damašku.
13 ౧౩ రాజా, మధ్యాహ్నం నా చుట్టూ, నాతో కూడ వచ్చినవారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సుకంటే ఎక్కువ దేదీప్యమానమైన ఒక వెలుగు ప్రకాశించడం చూశాను.
A tu na cestě, ačkoliv to bylo v pravé poledne, nás zalilo světlo, proti kterému se polední slunce zdálo stínem.
14 ౧౪ మేమందరమూ నేల మీద పడినప్పుడు, ‘సౌలూ, సౌలూ, నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకడం విన్నాను.
V úleku jsme se vrhli na zem a ke mně promluvil hlas v hebrejštině: ‚Saule, Saule, proč mne pronásleduješ? Proč biješ hlavou proti zdi?‘
15 ౧౫ అప్పుడు నేను ‘ప్రభూ, నీవు ఎవరివి?’ అని అడిగినపుడు ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసుని.
Zeptal jsem se: ‚Kdo jsi, pane?‘a on mi odpověděl: ‚Já jsem Ježíš, proti kterému se stavíš.
16 ౧౬ నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు,
Ale teď vstaň a poslouchej: Jak jsi mne horlivě pronásledoval, tak horlivě mne budeš vyznávat. Budeš svědkem toho, žes mne potkal, a všeho, co ti ještě ukáži.
17 ౧౭ నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను.
Budu tě chránit před lidmi, židy i pohany, mezi kterými ti dávám nesnadný úkol:
18 ౧౮ వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.
Budeš jim otevírat oči oslepené hříchem, aby přestali tápat ve tmě, kde vládne satan a aby vešli do Božího světla. Všem, kdo ve mne uvěří, odpustím hříchy a dám jim místo mezi svým lidem, který usiluje o nový způsob života podle mé vůle.‘
19 ౧౯ “కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను లోబడి
Jistě uznáš, Agrippo, že jsem nemohl odmítnout tak zřetelný pokyn z nebe.
20 ౨౦ మొదట దమస్కులో, యెరూషలేములో, యూదయ దేశమంతటా, ఆ తరువాత యూదేతరులకూ, వారు మారుమనస్సు పొంది దేవుని వైపు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాను.
A tak jsem začal hned v Damašku, potom v Jeruzalémě, v celém Judsku a konečně i mezi pohany volat lidi, aby se dali na pokání, obrátili se k Bohu a dotvrdili to novým životem.
21 ౨౧ ఈ కారణంగానే యూదులు నన్ను దేవాలయంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు.
To je můj ‚zločin‘, pro který mne chtěli židé v chrámu ubít.
22 ౨౨ అయినప్పటికీ నేను దేవుని సహాయం వలన ఈ రోజు వరకూ నిలిచి ఉన్నాను. క్రీస్తు హింసలు పొంది మృతుల పునరుత్థానం పొందేవారిలో మొదటివాడు కావడంచేత, యూదులకూ యూదేతరులకూ వెలుగు ప్రసరిస్తుందని ప్రవక్తలు, మోషే, ముందుగా చెప్పిన దానికి మరేమీ కలపకుండా, అల్పులకూ ఘనులకూ సాక్ష్యమిస్తున్నాను.”
Bůh mne však z jejich rukou vytrhl, a tak tu stojím a mohu vydávat své svědectví prostým i vznešeným. To, co hlásám, je totéž, co předpovídali proroci i Mojžíš:
že Mesiáš bude trpět, že však vstane jako první z mrtvých a tak přinese naději na věčný život židům i pohanům.“
24 ౨౪ అతడు ఈ విధంగా సమాధానం చెబుతుండగా ఫేస్తు, “పౌలూ, నీవు వెర్రివాడివి, మితిమీరిన విద్య వలన నీకు పిచ్చి పట్టింది” అని గట్టిగా అరిచాడు.
To už bylo pro Festa příliš, a proto se ozval: „Pavle, ty ses zbláznil. Znáš toho tolik, že tě to připravilo o rozum!“
25 ౨౫ అందుకు పౌలు ఇలా అన్నాడు, “మహా ఘనులైన ఫేస్తూ, నేను వెర్రివాణ్ణి కాదు. సత్యం, వివేకం గల మాటలే చెబుతున్నాను.
Pavel se však bránil: „Můj rozum je v pořádku, vážený Feste. Mluvím jen pravdu a jsem plně při smyslech.
26 ౨౬ రాజుకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వారి ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ప్రతి ఒక్క విషయమూ వారికి తెలుసు అని రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఒక మూలన జరిగిన విషయం కాదు.
Král je v pojmech židovské víry doma, a proto mohu mluvit tak otevřeně. Myslím, že i o nás křesťanech dobře ví; vždyť nejsme žádná tajná sekta.
27 ౨౭ అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారని నాకు తెలుసు.” అన్నాడు.
Jde vlastně o to, králi Agrippo, zda skutečně věříš tomu, co předpověděli židovští proroci. A já vím, že věříš.“
28 ౨౮ అందుకు అగ్రిప్ప, “ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా మార్చాలని చూస్తున్నావే” అని పౌలుతో అన్నాడు.
Agrippa mu řekl: „Mluvíš tak, že bys mne málem přesvědčil, abych se stal křesťanem.“
29 ౨౯ అందుకు పౌలు, “తేలికగానో కష్టంగానో, మీరు మాత్రమే కాదు, ఈ రోజు నా మాట వింటున్న వారంతా ఈ సంకెళ్ళు తప్ప నాలాగానే ఉండేలా దేవుడు అనుగ్రహిస్తాడు గాక” అన్నాడు.
Pavel nato odpověděl: „Kéž by Bůh dal, abys nejen ty, ale vy všichni byli to, co jsem já, až na ty řetězy.“
30 ౩౦ అప్పుడు రాజు, ఫేస్తూ, బెర్నీకే, వారితో కూడ కూర్చున్నవారు లేచి అవతలకు పోయి
Král, místodržitel, Bereniké a pak i ostatní se zvedli a odcházeli.
31 ౩౧ “ఈ వ్యక్తి మరణానికి గాని, బంధకాలకు గాని తగిన నేరమేమీ చేయలేదు” అని తమలో తాము మాట్లాడుకున్నారు.
Jejich shodný úsudek byl, že Pavel nespáchal nic, zač by si zasloužil smrt nebo vězení.
32 ౩౨ అప్పుడు అగ్రిప్ప, “ఈ మనిషి సీజరు ముందు చెప్పుకొంటానని అనకపోయి ఉంటే ఇతణ్ణి విడుదల చేసేవాళ్ళమే” అని ఫేస్తుతో చెప్పాడు.
Agrippa řekl Festovi: „Nebýt toho odvolání k císaři, mohl bys ho klidně propustit.“