< అపొస్తలుల కార్యములు 19 >
1 ౧ అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని, “మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?” అని అడిగాడు.
Men det skete, medens Apollos var i Korinth, at Paulus efter at være dragen igennem de højereliggende Landsdele kom ned til Efesus
2 ౨ వారు, “అసలు పరిశుద్ధాత్మను గురించి మేము వినలేదు” అని చెప్పారు.
og fandt nogle Disciple, og han sagde til dem: „Fik I den Helligaand, da I bleve troende?‟ Men de sagde til ham: „Vi have ikke engang hørt, at der er en Helligaand.‟
3 ౩ అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఎలాంటి బాప్తిసం పొందారు?” అని అడగ్గా, వారు, “యోహాను బాప్తిసం” అని చెప్పారు.
Og han sagde: „Hvortil bleve I da døbte?‟ Men de sagde: „Til Johannes's Daab.‟
4 ౪ అందుకు పౌలు, “యోహాను తన వెనక వచ్చే వాడిలో, అంటే యేసులో విశ్వాసముంచాలని ప్రజలతో చెబుతూ, పశ్చాత్తాపం విషయమైన బాప్తిసమిచ్చాడు” అని చెప్పాడు.
Da sagde Paulus: „Johannes døbte med Omvendelses-Daab, idet han sagde til Folket, at de skulde tro paa den, som kom efter ham, det er paa Jesus.‟
5 ౫ వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు.
Men da de hørte dette, lode de sig døbe til den Herres Jesu Navn.
6 ౬ తరువాత పౌలు వారి మీద చేతులుంచినపుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాటలాడటం, ప్రవచించడం మొదలుపెట్టారు.
Og da Paulus lagde Hænderne paa dem, kom den Helligaand over dem, og de talte i Tunger og profeterede.
7 ౭ వారందరూ సుమారు పన్నెండు మంది పురుషులు.
Men de vare i det hele omtrent tolv Mænd.
8 ౮ తరువాత పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు.
Og han gik ind i Synagogen og vidnede frimodigt i tre Maaneder, idet han holdt Samtaler og overbeviste om det, som hører til Guds Rige.
9 ౯ అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారి నుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.
Men da nogle forhærdede sig og strede imod og over for Mængden talte ilde om Vejen, forlod han dem og skilte Disciplene fra dem og holdt daglig Samtaler i Tyrannus's Skole.
10 ౧౦ రెండు సంవత్సరాల పాటు ఈ విధంగా జరిగింది. కాబట్టి యూదులు, గ్రీకులు, ఆసియలో నివసించే వారంతా ప్రభువు వాక్కు విన్నారు.
Men dette varede i to Aar, saa at alle, som boede i Asien, baade Jøder og Grækere, hørte Herrens Ord.
11 ౧౧ అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు.
Og Gud gjorde usædvanlige kraftige Gerninger ved Paulus's Hænder,
12 ౧౨ అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దురాత్మలు కూడా వదలిపోయాయి.
saa at man endog bragte Tørklæder og Bælter fra hans Legeme til de syge, og Sygdommene vege fra dem, og de onde Aander fore ud.
13 ౧౩ అప్పుడు దేశసంచారం చేసే యూదు మాంత్రికులు కొందరు తమ స్వలాభం కోసం యేసు నామం ఉపయోగిస్తూ, “పౌలు ప్రకటించే యేసు తోడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను” అని చెప్పి, దురాత్మలు పట్టినవారిపై ప్రభువైన యేసు పేరు ఉచ్ఛరించడానికి పూనుకున్నారు.
Men ogsaa nogle af de omløbende jødiske Besværgere forsøgte at nævne den Herres Jesu Navn over dem, som havde de onde Aander, idet de sagde: „Jeg besværger eder ved den Jesus, som Paulus prædiker.‟
14 ౧౪ స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు.
Men de, som gjorde dette, vare syv Sønner af Skeuas, en jødisk Ypperstepræst.
15 ౧౫ అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది.
Men den onde Aand svarede og sagde til dem: „Jesus kender jeg, og om Paulus ved jeg; men I, hvem ere I?‟
16 ౧౬ ఆ దురాత్మ పట్టినవాడు ఎగిరి మీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత ఆ మంత్రగాళ్ళు గాయాలతో బట్టల్లేకుండా పారిపోయారు.
Og det Menneske, i hvem den onde Aand var, sprang ind paa dem og overmandede dem begge og fik saadan Magt over dem, at de flygtede nøgne og saarede ud af Huset.
17 ౧౭ ఈ సంగతి ఎఫెసులో నివసించే యూదులకు, గ్రీకువారికి తెలిసినప్పుడు వారందరికీ భయం వేసింది కాబట్టి ప్రభువైన యేసు నామానికి ఘనత కలిగింది.
Men dette blev vitterligt for alle dem, som boede i Efesus, baade Jøder og Grækere; og der faldt en Frygt over dem alle, og den Herres Jesu Navn blev ophøjet,
18 ౧౮ విశ్వసించినవారు చాలా మంది వచ్చి, తమ దుర్మార్గ క్రియలను ఒప్పుకున్నారు.
og mange af dem, som vare blevne troende, kom og bekendte og fortalte om deres Gerninger.
19 ౧౯ అంతేగాక మాంత్రిక విద్య అభ్యసించినవారు చాలా మంది తమ పుస్తకాలను తెచ్చి, అందరూ చూస్తుండగా వాటిని కాల్చివేశారు. లెక్క చూసినప్పుడు వాటి విలువ యాభై వేల వెండి నాణాలు అయింది.
Men mange af dem, som havde drevet Trolddom, bare deres Bøger sammen og opbrændte dem for alles Øjne; og man beregnede deres Værdi og fandt dem halvtredsindstyve Tusinde Sølvpenge værd.
20 ౨౦ అంత ప్రభావ సహితంగా ప్రభువు వాక్కు వ్యాపించింది.
Saa kraftigt voksede Herrens Ord og fik Magt.
21 ౨౧ పౌలు ఎఫెసులో పరిచర్య ముగించిన తరువాత మాసిదోనియ, అకయ దేశాల మార్గంలో యెరూషలేము వెళ్ళాలని ఆత్మలో ఉద్దేశించి ‘నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమ్ నగరాన్ని కూడా చూడాలి’ అని నిర్ణయించుకున్నాడు.
Men da dette var fuldbragt, satte Paulus sig for i Aanden, at han vilde rejse igennem Makedonien og Akaja og saa drage til Jerusalem, og han sagde: „Efter at jeg har været der, bør jeg ogsaa se Rom.‟
22 ౨౨ అప్పుడు తన పరిచారకుల్లో తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదోనియ పంపించి తాను మాత్రం ఆసియలో కొంతకాలం నిలిచిపోయాడు.
Og han sendte to af dem, som gik ham til Haande, Timotheus og Erastus, til Makedonien; men selv blev han nogen Tid i Asien.
23 ౨౩ ఆ రోజుల్లో క్రీస్తు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది.
Men paa den Tid opstod der et ikke lidet Oprør i Anledning af Vejen.
24 ౨౪ ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి డయానా దేవతకు వెండి విగ్రహాలను చేయిస్తూ అక్కడి పనివారికి మంచి ఆదాయం కల్పించేవాడు.
Thi en Sølvsmed ved Navn Demetrius gjorde Artemistempler af Sølv og skaffede Kunstnerne ikke ringe Fortjeneste.
25 ౨౫ అతడు వారిని, ఆ వృత్తిలో ఉన్న ఇతరులను పోగుచేసి వారితో, “ఈ పని ద్వారా మనకి మంచి ఆదాయం వస్తూ మన జీవనోపాధి బాగా జరుగుతూ ఉందని మీకు తెలుసు.
Disse samlede han tillige med de med saadanne Ting sysselsatte Arbejdere og sagde: „I Mænd! I vide, at vi have vort Udkomme af dette Arbejde.
26 ౨౬ అయితే ఈ పౌలు, చేతులతో చేసిన విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కారని బోధించి, ఎఫెసులో మాత్రమే కాక మొత్తం ఆసియా అంతట చాలామంది ప్రజలను పెడదారి పట్టించాడని మీరు విన్నారు, చూశారు కూడా.
Og I se og høre, at ikke alene i Efesus, men næsten i hele Asien har denne Paulus ved sin Overtalelse vildledt en stor Mængde, idet han siger, at de ikke ere Guder, de, som gøres med Hænder.
27 ౨౭ పైగా మన వృత్తి మీద శ్రద్ధ తగ్గిపోవడమే కాక, డయానా దేవస్థానం కూడ నిర్లక్షానికి గురై, ఆసియా అంతటా, ఇంకా భూలోకమంతటా పూజలందుకుంటున్న ఈమె ప్రభావం తగ్గిపోతుందేమో అని నాకు భయం వేస్తున్నది” అని వారితో చెప్పాడు.
Men der er ikke alene Fare for, at denne vor Haandtering skal komme i Foragt, men ogsaa for, at den store Gudinde Artemis's Helligdom skal blive agtet for intet, og at den Gudindes Majestæt, hvem hele Asien og Jorderige dyrker, skal blive krænket.‟
28 ౨౮ వారు అది విని ఉగ్రులైపోయి, “ఎఫెసీయుల డయానా మహాదేవి” అని కేకలు వేశారు.
Men da de hørte dette, bleve de fulde af Vrede og raabte og sagde: „Stor er Efesiernes Artemis!‟
29 ౨౯ దానితో పట్టణం బహు గందరగోళంగా తయారైంది. వెంటనే వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియాకు చెందిన గాయి, అరిస్తార్కులను పట్టుకుని దొమ్మీగా అక్కడి నాటక ప్రదర్శనశాలలోకి ఈడ్చుకు పోయారు.
Og Byen kom i fuldt Oprør, og de stormede endrægtigt til Teatret og reve Makedonierne Kajus og Aristarkus, Paulus's Rejsefæller, med sig.
30 ౩౦ పౌలు ఆ జనసమూహం పోగైన సభ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు గాని, శిష్యులు అతనిని వెళ్ళనియ్యలేదు.
Men da Paulus vilde gaa ind iblandt Folkemængden, tilstedte Disciplene ham det ikke.
31 ౩౧ అంతేగాక ఆసియా దేశాధికారుల్లో అతని స్నేహితులు కొందరు అతనికి కబురు పంపి, “నీవు నాటక ప్రదర్శనశాలలోకి వెళ్ళవద్దు” అని నచ్చజెప్పారు.
Men ogsaa nogle af Asiarkerne, som vare hans Venner, sendte Bud til ham og formanede ham til ikke at vove sig hen til Teatret.
32 ౩౨ ఆ సభ గందరగోళంగా ఉంది. కొందరు ఒక రకంగా, మరికొందరు మరో రకంగా కేకలు వేస్తున్నారు. అసలు తామెందుకు అక్కడ గుమిగూడామో చాలా మందికి తెలియనే లేదు.
Da skrege nogle eet, andre et andet; thi Forsamlingen var i Forvirring, og de fleste vidste ikke, af hvad Aarsag de vare komne sammen.
33 ౩౩ అప్పుడు యూదులు అలెగ్జాండరును ముందుకు తోసి అతనిని జనం ఎదుటికి తెచ్చారు. అలెగ్జాండర్ చేతితో సైగ చేసి ఆ ప్రజలకు వివరణ ఇవ్వాలని చూశాడు.
Men de trak Aleksander, hvem Jøderne skøde frem, ud af Skaren; men Aleksander slog til Lyd med Haanden og vilde holde en Forsvarstale til Folket.
34 ౩౪ అయితే అతడు యూదుడని వారికి తెలిసి అందరూ మూకుమ్మడిగా రెండు గంటల సేపు ‘ఎఫెసీయుల డయానా మహాదేవి’ అని నినాదాలు చేశారు.
Men da de fik at vide, at han var en Jøde, raabte de alle med een Røst i omtrent to Timer: „Stor er Efesiernes Artemis!‟
35 ౩౫ అప్పుడు ఊరి కరణం సమూహాన్ని సముదాయించి, “ఎఫెసు వాసులారా, ఎఫెసు పట్టణం డయానా మహాదేవికీ ఆకాశం నుండి పడిన పవిత్ర శిలకూ ధర్మకర్త అని తెలియని వారెవరు?
Men Byskriveren fik Skaren beroliget og sagde: „I Mænd i Efesus! hvilket Menneske er der vel, som ikke ved, at Efesiernes By er Tempelværge for den store Artemis og det himmelfaldne Billede?
36 ౩౬ ఈ సంగతులు తిరుగులేనివి కాబట్టి మీరు శాంతం వహించి ఏ విషయంలోనూ తొందరపడకపోతే మంచిది.
Naar altsaa dette er uimodsigeligt, bør I være rolige og ikke foretage eder noget fremfusende.
37 ౩౭ మీరు ఈ వ్యక్తులను తీసికొచ్చారు గదా, వీరు గుడిని దోచుకున్న వారా? మన దేవతను దూషించారా?
Thi I have ført disse Mænd hid, som hverken ere Tempelranere eller bespotte eders Gudinde.
38 ౩౮ దేమేత్రికీ అతనితో ఉన్న కంసాలులకూ వీరి మీద ఆరోపణలు ఏవైనా ఉంటే న్యాయసభలు జరుగుతున్నాయి, అధికారులు ఉన్నారు కాబట్టి వారు ఒకరిపై ఒకరు వ్యాజ్యం వేయవచ్చు.
Dersom nu Demetrius og hans Kunstnere have Klage imod nogen, da holdes der Tingdage, og der er Statholdere; lad dem kalde hinanden for Retten!
39 ౩౯ అయితే మీరు ఇతర సంగతులను గురించి విచారణ చేయాలనుకుంటే అవి క్రమమైన సభలోనే పరిష్కారమవుతాయి.
Men have I noget Forlangende om andre Sager, saa vil det blive afgjort i den lovlige Forsamling.
40 ౪౦ మనం ఈ గందరగోళం గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేదు గనక, ఈ రోజు జరిగిన అల్లరిని గురించి అధికారులు మనపై విచారణ జరుపుతారేమో అని భయంగా ఉంది. ఈ విధంగా గుంపు కూడడానికి తగిన కారణం ఏం చెబుతాం?” అని వారితో అన్నాడు.
Vi staa jo endog i Fare for at anklages for Oprør for, hvad der i Dag er sket, da der ingen Aarsag er dertil; herfor, for dette Opløb, ville vi ikke kunne gøre Regnskab.‟
41 ౪౧ అతడలా చెప్పి సభను ముగించేశాడు.
Og da han havde sagt dette, lod han Forsamlingen fare.