< సమూయేలు~ మొదటి~ గ్రంథము 7 >
1 ౧ అప్పుడు కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకువెళ్ళి గిబియాలో కొండపై ఉన్న అబీనాదాబు ఇంటి దగ్గర ఉంచి దాన్ని కాపాడడం కోసం అతని కొడుకు ఎలియాజరును నియమించారు.
Enti Kiriat-Yearimfo begyee Awurade Apam Adaka no. Wɔde kɔɔ Abinadab fi a ɛda bepɔw nkyɛn baabi. Ɛhɔ na wodwiraa ne babarima Eleasar sɛ ɔnhwɛ so.
2 ౨ మందసాన్ని కిర్యత్యారీములో ఉంచి ఇరవై ఏళ్లు నిండాయి. ఇశ్రాయేలీయులంతా యెహోవాను అనుసరించాలని కోరుతూ చింతిస్తున్నారు.
Apam Adaka no kyɛe yiye wɔ Kiriat-Yearim. Edii mfirihyia aduonu wɔ hɔ. Saa bere no Israel nyinaa twaa agyaadwo, efisɛ na ayɛ sɛ Awurade agyaw wɔn.
3 ౩ సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు మనస్ఫూర్తిగా యెహోవా వైపుకు తిరిగి, ఇతర దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదల గలిగి యెహోవా వైపు మీ మనస్సులను మళ్ళించి ఆయనను ఆరాధించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మల్ని విడిపిస్తాడు.”
Na Samuel ka kyerɛɛ Israelfo nyinaa se, “Sɛ mode mo koma nyinaa resan akɔ Awurade nkyɛn de a, ɛno de, montwe mo ho mfi ananafo anyame ne Astoret ahoni ho. Munsi mo adwene pi sɛ mobɛyɛ osetie ama Awurade, na monsom ɔno nko, na obegye mo afi Filistifo nsam.”
4 ౪ ఆ తరువాత ఇశ్రాయేలీయులు బయలు దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను మాత్రమే సేవించడం మొదలుపెట్టారు.
Enti Israelfo no too Baalim ne Astoret gui, som Awurade nko.
5 ౫ అప్పుడు సమూయేలు “ఇశ్రాయేలీయులంతా మిస్పా ప్రదేశానికి చేరుకోండి. నేను మీ తరపున యెహోవాకు ప్రార్థన చేస్తాను” అని చెప్పినప్పుడు
Afei, Samuel ka kyerɛɛ Israelfo no nyinaa se, “Mo nyinaa mommra Mispa, na memmɔ Awurade mpae mma mo.”
6 ౬ వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి “యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు.
Enti wɔboaa wɔn ho ano wɔ hɔ. Na wɔn anyankamade mu no, wɔsaw nsu fi abura bi mu, na wohwie guu Awurade anim. Wodii abuada da no, na wɔkaa nokware sɛ wɔayɛ bɔne atia Awurade. Enti Mispa hɔ na Samuel bɛyɛɛ Israel so temmufo.
7 ౭ ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు ఫిలిష్తీయ దండు వారి మీద దాడికి సిద్ధమయ్యారు. ఈ విషయం ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారు ఫిలిష్తీయులకు భయపడి
Bere a Filistifo sodifo no tee sɛ Israel nyinaa aboa wɔn ho ano wɔ Mispa no, wɔboaboaa wɔn asraafo ano, tu teɛe. Na Israelfo no tee sɛ Filistifo no rebɛn wɔn no, wɔn koma tuu yiye.
8 ౮ “మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించేలా మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు” అని సమూయేలును వేడుకున్నారు.
Woguan toaa Samuel se, “Srɛ Awurade, yɛn Nyankopɔn, na onnye yɛn mfi Filistifo nsam.”
9 ౯ సమూయేలు ఇంకా పాలు తాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమం అర్పించి, ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించినపుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు.
Enti Samuel faa oguan ba a onnyinii de ne mua no bɔɔ ɔhyew afɔre maa Awurade. Ɔsrɛɛ Awurade maa Israelfo, na Awurade tiei.
10 ౧౦ సమూయేలు దహనబలి అర్పిస్తున్న సమయంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల పైకి వచ్చారు. అయితే యెహోవా ఆ రోజు ఫిలిష్తీయుల మీదికి విపరీతంగా ఉరుములు ఉరిమేలా చేసి వారిని కల్లోలపరచడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు.
Bere a Samuel gu so rebɔ ɔhyew afɔre no, Filistifo no baa sɛ wɔrebɛko. Nanso Onyankopɔn de aprannaa nne a emu yɛ duru yiye kasa fi soro, maa basabasayɛ sii Filistifo no mu, maa Israelfo no dii wɔn so nkonim.
11 ౧౧ ఇశ్రాయేలీయులు మిస్పా నుండి మొదలుపెట్టి బేత్కారు వరకూ ఫిలిష్తీయుల వెంటబడి చంపివేశారు.
Israel mmarima pam wɔn fi Mispa, kosii Bet-Kar, kunkum wɔn guu ɔkwan so.
12 ౧౨ అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకుని మిస్పాకు, షేనుకు మధ్య దాన్ని నిలబెట్టి “ఇప్పటి వరకూ యెహోవా మనకు సహాయం చేశాడు” అని చెప్పి ఆ రాయికి “ఎబెనెజరు” అని పేరు పెట్టాడు.
Ɛnna Samuel faa ɔbo kɛse bi de sii Mispa ne Sen ntam. Na ɔtoo no din Ebeneser a ase ne “Ɔboa bo” na ɔkae se, “Ɛha na Awurade aboa yɛn abesi!”
13 ౧౩ ఈ విధంగా ఫిలిష్తీయులు అణగారిపోయి ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి మళ్ళీ రాలేకపోయారు. సమూయేలు జీవించిన కాలమంతటిలో యెహోవా హస్తం ఫిలిష్తీయులకి విరోధంగా ఉంది.
Enti wodii Filistifo no so, na wɔantumi ammegye Israelfo nsase amfa wɔ bere tenten bi mu. Na Samuel nkwa nna mu nyinaa, Awurade nsa a ɛyɛ den no tiaa Filistifo.
14 ౧౪ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల నుండి ఆక్రమించుకొన్న పట్టణాలన్నీ వారికి తిరిగి వచ్చాయి. ఎక్రోను నుండి గాతు వరకూ ఉన్న గ్రామాలనూ వాటిలోని పొలాలనూ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించుకున్నారు. ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి ఏర్పడింది.
Na Israel nkurow a ɛbɛn Ekron ne Gat no a na Filistifo no agyigye no. Wɔde asase a aka a Filistifo no agyigye no kaa ho. Ɛmaa asomdwoe baa Israel ne Amorifo ntam saa bere no.
15 ౧౫ సమూయేలు జీవించిన కాలమంతా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
Samuel kɔɔ so yɛɛ Israel so temmufo ne nkwa nna a aka nyinaa.
16 ౧౬ ప్రతి సంవత్సరమూ అతడు బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుతూ, వివిధ ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం జరిగిస్తూ వచ్చాడు.
Afe biara, na otu kwan kyinkyin bu atɛn wɔ nʼasennii. Ofi ase wɔ Bet-El de kɔ Gilgal na wawie wɔ Mispa. Obuu Israelfo atɛn wɔ saa nkurow yi biara so.
17 ౧౭ అతని నివాసం రమాలో ఉన్నందువల్ల అక్కడికి తిరిగి వచ్చి అక్కడ కూడా న్యాయం జరిగిస్తూ వచ్చాడు. అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.
Afei, na ɔsan ba ne kurom Rama bedi nsɛm wɔ hɔ nso. Na Samuel sii afɔremuka wɔ Rama de maa Awurade.