< సమూయేలు~ మొదటి~ గ్రంథము 24 >
1 ౧ సౌలు ఫిలిష్తీయులను తరమడం మానుకుని తిరిగి వెళ్ళాక, దావీదు ఏన్గెదీ అరణ్య ప్రాంతంలో ఉన్నాడని అతనికి కబురు వచ్చింది.
и като се върна Саул от преследването на филистимците, известиха му, казвайки: Ето, Давид е в пустинята Ен-Гади.
2 ౨ అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి, కొండమేకలు ఉండే రాతి కొండల మీద దావీదును అతని అనుచరులను వెదకడానికి బయలుదేరాడు.
И тогава Саул взе три хиляди мъже избрани, измежду целия Израил, та отиде да търси Давида и мъжете му по скалите на дивите кози.
3 ౩ దారిలో గొర్రెల దొడ్లకు అతడు వస్తే అక్కడ ఒక గుహ కనిపించింది. సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు.
И дойде при кошарите на овците край пътя, гдето имаше пещера; там Саул влезе по нуждата си, а Давид и мъжете му седяха по-навътре в пещерата.
4 ౪ దావీదు అనుచరులు “నీ దృష్టికి ఏది మంచిదో అది చేసేందుకు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన రోజు వచ్చింది” అని అతనితో చెప్పారు. దావీదు లేచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు.
И мъжете на Давида му рекоха: Ето денят, за който Господ ти каза: Ето Аз ще предам неприятеля ти в ръката ти, и ще му сториш както ти се вижда за добро. Тогава Давид стана та отряза скришно полата на Сауловата мантия.
5 ౫ సౌలు పై వస్రాన్ని కోసినందుకు దావీదు మనస్సులో నొచ్చుకుని,
А по-после Давид се смути в сърцето си, за гдето отряза Сауловата пола.
6 ౬ “ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి యెహోవా చేత అభిషిక్తుడైన నా రాజు పట్ల నేను ఈ పని చేయను, యెహోవాను బట్టి నేను అతణ్ణి చంపను” అని తన వారితో చెప్పాడు.
И рече на мъжете си: Да ми не даде Господ да сторя това на господаря си, Господния помазаник, да дигна ръка против него; защото е Господният помазаник.
7 ౭ ఈ మాటలు చెప్పి దావీదు సౌలు మీదికి వెళ్ళకుండా తన వారిని అడ్డగించాడు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేరి తన దారిన వెళ్ళిపోయాడు.
С тия думи Давид спря мъжете си, и не ги остави да се подигнат против Саула. А Саул стана от пещерата и отиде по пътя си.
8 ౮ అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వచ్చి “నా యజమానీ, రాజా” అని వెనుక నుండి కేకవేస్తే, సౌలు వెనక్కి చూశాడు. దావీదు నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి
После стана Давид та излезе из пещерата и извика подир Саула казвайки: Господарю мой, царю! И когато Саул погледна отдире си, Давид се наведе с лице до земята, та се поклони.
9 ౯ సౌలుతో ఇలా అన్నాడు “దావీదు నీకు కీడుచేయాలని చూస్తున్నాడని కొందరు చెబుతున్న మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు?
И Давид каза на Саула: Защо слушаш думите на човеци, които казват: Ето, Давид иска злото ти?
10 ౧౦ ఆలోచించు. ఈ రోజున యెహోవా నిన్ను గుహలో నా చేతికి ఎలా అప్పగించాడో నీ కళ్ళారా చూశావు కదా. కొంతమంది నిన్ను చంపేయమని నాకు చెప్పినప్పటికీ నేనలా చెయ్యలేదు. ‘ఇతడు యెహోవా వలన అభిషేకం పొందిన వాడు కాబట్టి నా ఏలినవాడిపై చెయ్యి ఎత్తను’ అని చెప్పాను.
Ето, днес очите ти виждат как Господ те предаде в ръката ми тоя ден в пещерата: и едни рекоха да те убия; но аз те пожалих, защото рекох: Не ща да дигна ръка против господаря си, защото е Господният помазаник.
11 ౧౧ నా తండ్రీ, చూడు. నిన్ను చంపకుండా నీ బట్ట చెంగును మాత్రమే కోశాను. దీన్ని బట్టి నా వల్ల నీకు ఎలాంటి కీడూ రాదనీ నాలో ఎలాంటి తప్పూ లేదనీ నువ్వు తెలుసుకోవచ్చు. నీ విషయంలో నేను ఏ పాపమూ చేయకుండా ఉంటే నువ్వు నా ప్రాణం తీయాలని నన్ను తరుముతున్నావు.
Виж още, отче мой, виж и полата на мантията ти в ръката ми; и от това, че отрязах полата на мантията ти, но не те убих, познай и виж, че няма ни злоба, ни престъпление в ръката ми, и че не съм съгрешил против тебе, при все че ти гониш живота ми, за да го отнемеш.
12 ౧౨ నీకూ నాకూ మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. యెహోవా నా విషయంలో పగ సాధిస్తాడు. నేను మాత్రం నిన్ను చంపను.
Господ нека съди между мене и тебе, и Господ нека ми въздаде за тебе: обаче моята ръка не ще се дигне против тебе.
13 ౧౩ పితరులు సామెత చెప్పినట్టు దుర్మార్గుల నుండి దుర్మార్గత పుడుతుంది. అయితే నేను నిన్ను చంపను.
Както казва поговорката на древните: От беззаконните произхожда беззаконие, но моята ръка не ще се дигне против тебе.
14 ౧౪ ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకోవాలని బయలుదేరి వచ్చాడు? ఏ పాటి వాణ్ణి తరుముతున్నాడు? చచ్చిన కుక్కనా? పురుగునా?
Подир кого е излязъл Израилевият цар? Кого преследваш ти? Подир умряло куче, подир една бълха.
15 ౧౫ యెహోవా నీకూ, నాకూ మధ్య న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తాడుగాక. ఆయనే అసలు విషయం విచారణ జరిపి నా తరపున వాదులాడి నిన్ను కాక నన్ను నిర్దోషిగా తీరుస్తాడు గాక.”
Господ, нека, бъде съдия и нека съди между мене и тебе, нека види, нека се застъпи за делото ми, и нека ме избави от ръката ти.
16 ౧౬ దావీదు సౌలుతో ఈ మాటలు మాట్లాడి ముగించినప్పుడు, సౌలు “దావీదూ, నాయనా, ఈ మాటలు అన్నది నువ్వేనా?” అని బిగ్గరగా ఏడ్చి
И като изговори Давид тия думи на Саула, рече Саул: Това твоят глас ли е, чадо мое Давиде? И Саул плака с висок глас.
17 ౧౭ దావీదుతో ఇలా అన్నాడు. “యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నన్ను చంపకుండా విడిచిపెట్టినందుకు
И рече на Давида: Ти си по-праведен от мене, защото ти ми въздаде добро, а аз ти въздадох зло.
18 ౧౮ ఈ రోజున నువ్వు అపకారానికి ఉపకారం చేసి, నా పట్ల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేశావు. నువ్వు నాకంటే నీతిమంతుడివి.
И ти показа днес, че си ми сторил добро, защото, когато Господ бе ме предал в ръцете ти, ти не ме уби.
19 ౧౯ ఒకరికి తన శత్రువు దొరికినప్పుడు మేలు చేసి పంపివేస్తాడా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేస్తాడు గాక.
Понеже кой, като намери неприятеля си, би го оставил да си отиде по пътя невредим? Господ, прочее, да ти въздаде добро за това, което ти ми направи днес.
20 ౨౦ కచ్చితంగా నువ్వు రాజువవుతావు. ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్థిరం అయిందని నాకు తెలుసు.
И сега, ето, познавам че наистина ти ще станеш цар, и че Израилевото царство ще се утвърди в твоята ръка.
21 ౨౧ కాబట్టి నా తరువాత నా సంతతిని నీవు నిర్మూలం చేయకుండా ఉండేలా, నా తండ్రి ఇంట్లోనుండి నా పేరు కొట్టివేయకుండేలా, యెహోవా నామం పేరిట నాకు శపథం చెయ్యి.” అప్పుడు దావీదు సౌలుకు శపథం చేశాడు.
Сега, прочее, закълни ми се в Господа, че няма да изтребиш потомството ми след мене, и че няма да погребеш името ми от бащиния ми дом.
22 ౨౨ తరువాత సౌలు ఇంటికి తిరిగివచ్చాడు. దావీదు, అతని అనుచరులు తాము దాక్కొన్న స్థలాలకు వెళ్ళిపోయారు.
И Давид се закле на Саула. Тогава Саул си отиде у дома си, а Давид и мъжете му се изкачиха на твърдото място.