< Psaltaren 5 >

1 En Psalm Davids, till att föresjunga för arfvet. Herre, hör min ord; gif akt uppå mitt tal.
ప్రధాన సంగీతకారుని కోసం, వేణువులతో పాడవలసినది. దావీదు కీర్తన. యెహోవా, నా మొర విను. నా మూలుగుల గురించి ఆలోచించు.
2 Gif akt uppå, mitt rop, min Konung, och min Gud; ty jag vill bedja inför dig.
నా రాజా, నా దేవా, నా ఆర్తనాదం ఆలకించు, ఎందుకంటే నేను ప్రార్థన చేసేది నీకే.
3 Herre, bittida hör mina röst; bittida vill jag skicka mig till dig, och taga der vara, uppå.
యెహోవా, ఉదయాన నా ఆర్తనాదం నువ్వు వింటావు. తెల్లవారే నా విన్నపం నీ దగ్గరికి తెచ్చి ఆశతో కనిపెట్టుకుని ఉంటాను.
4 Ty du äst icke den Gud, hvilkom ett ogudaktigt väsende behagar; den der ond är, han blifver icke för dig.
నువ్వు దుష్టత్వాన్ని సమర్ధించే దేవుడివి కాదు. చెడుతనం చేసే వాళ్ళు నీ అతిథులుగా ఉండరు.
5 De storordige bestå intet för din ögon; alla ogerningsmän hatar du.
దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.
6 Du förgör de lögnaktiga; Herren hafver en styggelse vid de blodgiruga och falska.
అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించేవాళ్ళను, మోసగాళ్ళను యెహోవా ద్వేషిస్తాడు.
7 Men jag vill gå in i ditt hus på, dina stora barmhertighet, och tillbedja emot ditt helga tempel i dine fruktan.
నేనైతే నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. భయభక్తులు కలిగి నీ పవిత్రాలయం వైపు వంగి నమస్కరిస్తాను.
8 Herre, led mig i dine rättfärdighet, för mina fiendars skull; gör din väg rättan för mig.
యెహోవా, నా శత్రువులను బట్టి నీ నీతి మార్గంలో నన్ను నడిపించు. నా ఎదుట నీ మార్గం తిన్నగా చెయ్యి.
9 Ty uti deras mun är intet visst: deras innersta är vedermöda; deras strupe är en öppen graf; med deras tungor skrymta de.
వాళ్ళ నోట సత్యం లేదు. వాళ్ళ అంతరంగం దుర్మార్గం. వాళ్ళ కంఠం తెరిచిన సమాధి. వాళ్ళు తమ నాలుకతో ఇచ్చకాలు పలుకుతారు.
10 Döm dem, Gud, att de måga falla af sitt uppsåt; drif dem ut för deras stora öfverträdelses skull; ty de äre dig gensträfvige.
౧౦దేవా, వాళ్ళను అపరాధులుగా ప్రకటించు. వాళ్ళ పథకాలే వాళ్ళ పతనానికి కారణం అగు గాక! అసంఖ్యాకమైన వారి అతిక్రమాలనుబట్టి వాళ్ళను తరిమి కొట్టు. ఎందుకంటే వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేశారు.
11 Låt glädja sig alla dem som trösta uppå dig, evinnerliga låt dem fröjda sig; ty du beskärmar dem; låt dem i dig glade vara, som ditt Namn kärt hafva.
౧౧నీలో ఆశ్రయం కోరిన వాళ్ళు అందరూ సంతోషిస్తారు గాక. నువ్వు వారిని సంరక్షిస్తావు గనక వారు ఉప్పొంగిపోతారు గాక. నీ నామాన్ని ప్రేమించే వాళ్ళు నీలో ఆనందిస్తారు గాక.
12 Ty du, Herre, välsignar de rättfärdiga; du kröner dem med nåde, såsom med en sköld.
౧౨ఎందుకంటే యెహోవా, నువ్వు న్యాయవంతులను ఆశీర్వదిస్తావు. నీ డాలుతో కప్పినట్టు నువ్వు వాళ్ళను దయతో ఆవరిస్తావు.

< Psaltaren 5 >