< Salmos 13 >
1 ¿Hasta cuándo, Jehová, me olvidarás, para siempre? ¿Hasta cuándo esconderás tu rostro de mí?
౧ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతూ ఉంటావు? ఎంతకాలం ముఖం దాచుకుంటావు?
2 ¿Hasta cuándo pondré consejos en mi alma? ¿ansia en mi corazón cada día? ¿Hasta cuándo será enaltecido mi enemigo sobre mí?
౨ఎంతకాలం నా మనస్సులో నేను ఆందోళన చెందాలి? ఎంతకాలం నా హృదయంలో పగలంతా నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువుకు నా మీద పైచెయ్యి అవుతుంది?
3 Mira, óyeme, Jehová, Dios mío: alumbra mis ojos, porque no duerma de muerte.
౩యెహోవా నా దేవా, నాపై చూపు నిలిపి నాకు జవాబివ్వు. నా కళ్ళు వెలిగించు, లేకపోతే నేను నిద్రలోనే చనిపోతాను.
4 Porque no diga mi enemigo: Vencíle: mis enemigos se alegrarán, si yo resbalare.
౪నేను అతన్ని ఓడించాను, అని చెప్పే అవకాశం నా శత్రువుకు ఇవ్వకు. నా ప్రత్యర్ధి మీద నేను జయం పొందాను, అని నా శత్రువు అనకూడదు. అలా జరగకపోతే, నేను పడిపోయినప్పుడు నా శత్రువులు ఆనందిస్తారు.
5 Mas yo en tu misericordia he confiado: alegrarse ha mi corazón en tu salud.
౫నేనైతే నీ నిబంధన నమ్మకత్వాన్ని ఆధారం చేసుకున్నాను. నీ రక్షణలో నా హృదయం ఆనందిస్తూ ఉంది.
6 Cantaré a Jehová; porque me ha hecho bien.
౬యెహోవా నన్ను మేళ్ళతో నింపాడు గనక నేను ఆయనకు కీర్తన పాడతాను.