< Псалми 52 >
1 Што се хвалиш неваљалством, силни? Милост је Божија сваки дан са мном.
౧ప్రధాన సంగీతకారుడి కోసం. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంట్లో ఉన్నాడు, అని చెప్పినప్పుడు దావీదు రాసిన దైవధ్యానం. బలశాలీ, సమస్యను సృష్టించి ఎందుకు గర్విస్తున్నావు? దేవుని నిబంధన కృప నిత్యమూ ఉంటుంది.
2 Неправду измишља језик твој; он је у тебе као бритва наоштрена, лукави!
౨నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది. అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది.
3 Волиш зло него добро, волиш лагати него истину говорити.
౩నువ్వు మంచి కంటే దుర్మార్గాన్ని ఎక్కువ ప్రేమిస్తావు. న్యాయం మాట్లాడటం కంటే అబద్దం మాట్లాడటం నీకిష్టం.
4 Љубиш свакојаке речи од погибли, и језик лукав.
౪కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు.
5 Тога ради Бог ће те поразити сасвим, избациће те и ишчупаће те из стана, и корен твој из земље живих.
౫కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. సజీవులుండే ప్రాంతం నుండి నిన్ను పెల్లగిస్తాడు.
6 Видеће праведници и побојаће се, и подсмеваће му се:
౬న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. వారు నవ్వుతూ ఇలా అంటారు.
7 Гле човека који не држаше у Богу крепости своје, него се уздаше у величину богатства свог и утврђиваше се злоћом својом.
౭చూడండి, ఇతడు దేవుణ్ణి తన బలంగా చేసుకోకుండా తనకున్న అధిక ఐశ్వర్యంపై నమ్మకముంచాడు. నాశనకరమైన తన మార్గంలోనే స్థిరంగా నిలిచాడు.
8 А ја, као маслина зелена у дому Господњем, уздам се у милост Божију без престанка и довека.
౮కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. దేవుని నిబంధన కృపలో నేను ఎన్నటికీ నమ్మకముంచుతాను.
9 Довека ћу хвалити Тебе, јер добро чиниш, и уздаћу се у име Твоје; јер си добар к свецима својим.
౯దేవా, నువ్వు చేసిన వాటిని బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నీ భక్తుల సమక్షంలో నీ నామాన్ని బట్టి ఆశతో ఎదురుచూస్తాను.