< Књига пророка Језекиља 42 >
1 И изведе ме у спољашњи трем према северу, и доведе ме ка клетима, које беху према одељеној страни и према грађевини на северу.
౧ఆ మనిషి ఉత్తరం వైపుకు నన్ను నడిపించి బయటి ఆవరణలోకి తోడుకుని వచ్చి ఖాళీ స్థలానికీ ఉత్తరాన ఉన్న కట్టడానికీ ఎదురుగా ఉన్న గదుల దగ్గర నిలబెట్టాడు.
2 С лица беше у дужину сто лаката код северних врата, а у ширину педесет лаката.
౨ఆ కట్టడం గుమ్మం ఉత్తరం వైపుకు తిరిగి 54 మీటర్ల పొడవు, 27 మీటర్ల వెడల్పు ఉంది.
3 Према унутрашњем трему од двадесет лаката и према поду спољашњег трема беху клети према клетима у три реда.
౩ఆ గదులు పరిశుద్ధ స్థలానికి 11 మీటర్లు దూరంలో ఉండి బయటి ఆవరణపు తాపడం చేసిన నేలకు ఎదురుగా మూడో అంతస్థులోని వసారాలు ఒకదాని కొకటి ఎదురుగా ఉన్నాయి.
4 И пред клетима беше ходник у ширину од десет лаката, унутра, пут к њима од једног лакта, и врата беху према северу.
౪ఆ గదులకు ఎదురుగా 5 మీటర్ల 40 సెంటి మీటర్ల వెడల్పు, 54 మీటర్ల పొడవు గల వసారా ఉంది. ఆ గదుల గుమ్మాలన్నీ ఉత్తరం వైపుకు చూస్తున్నాయి.
5 А најгорње клети беху тешње, јер клети доње и средње у згради излажаху већма него оне.
౫పైన గదులకు వసారాలుండడం వలన వాటి ఎత్తు తక్కువై మధ్యగదులు ఇరుకుగా ఉన్నాయి.
6 Јер беху на три пода, али немаху ступова као у трему, и зато се сужаваше изнад доњег и средњег од земље.
౬మూడో అంతస్థులో ఉన్న గదులకు ఆవరణకు ఉన్న స్తంభాలు లేవు కాబట్టి అవి కింద గదులకంటే, మధ్య గదులకంటే చిన్నవిగా కట్టి ఉన్నాయి.
7 А ограда која беше споља према клетима к трему спољашњем пред клетима имаше у дужину педесет лаката.
౭గదుల వరుసను బట్టి బయటి ఆవరణ వైపు గదులకు ఎదురుగా 27 మీటర్ల పొడవు ఉన్న ఒక గోడ ఉంది.
8 Јер дужина клетима, које беху у трему спољашњем, беше педесет лаката. И гле, пред црквом беше сто лаката.
౮బయటి ఆవరణలోని గదుల పొడవు 27 మీటర్లు ఉంది గాని మందిరం ముందటి ఆవరణ 54 మీటర్ల పొడవు ఉంది.
9 А под тим клетима беше улаз с истока, којим се улажаше у њих из спољашњег трема.
౯ఈ గదులు గోడకింద నుండి లేచినట్టుగా కనిపిస్తున్నాయి. బయటి ఆవరణలో నుండి వాటిలో ప్రవేశించడానికి తూర్పువైపున మార్గం ఉంది.
10 У ширини ограде тог трема к истоку пред одељеном страном и пред грађевином беху клети.
౧౦ఖాళీ స్థలానికి, కట్టడానికి ఎదురుగా ఆవరణపు గోడ వారున తూర్పువైపు కొన్ని గదులున్నాయి.
11 А пред њима беше пут као код северних клети; једнаке дужине и једнаке ширине беху, и излази им и врата беху једнака.
౧౧వాటి ఎదుట ఉన్న మార్గం ఉత్తరం వైపు ఉన్న గదుల మార్గం లాగా ఉంది. వాటి కొలతల ప్రకారమే ఇవి కూడా కట్టి ఉన్నాయి. వీటి ద్వారాలు కూడా వాటి లాగానే ఉన్నాయి.
12 И каква беху врата у клети које беху према југу, таква беху врата где се почињаше пут пред оградом право к истоку, кад се иде к њима.
౧౨దక్షిణం వైపు గదుల తలుపుల్లాగా వీటి తలుపులు కూడా ఉన్నాయి. ఆ మార్గం ఆవరణంలోకి పోయేవారికి తూర్పుగా ఉన్న గోడ ఎదురుగానే ఉంది.
13 И рече ми: Северне клети и јужне клети пред одељеном страном јесу свете клети, где свештеници који приступају ка Господу једу пресвете ствари, онде ће остављати пресвете ствари и дар и принос за грех и принос за кривицу, јер је свето место.
౧౩అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఖాళీ స్థలానికి ఎదురుగా ఉన్న ఉత్తరపు గదులు, దక్షిణపు గదులు పవిత్రమైన యాజకులవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధమైన ఆహారాన్ని తింటారు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను, అంటే నైవేద్యాన్ని, పాప పరిహారార్థ బలి పశుమాంసాన్ని, అపరాధ పరిహారార్థ బలి పశుమాంసాన్ని ఉంచుతారు. ఆ స్థలం అతి పరిశుద్ధం.
14 Кад свештеници уђу, неће излазити из светиње у спољашњи трем, него ће онде остављати хаљине своје у којима служе, јер су свете, и облачиће друге хаљине, па онда излазити к народу.
౧౪యాజకులు లోపల ప్రవేశించేటప్పుడు పరిశుద్ధ స్థలాన్ని విడిచి బయటి ఆవరణంలోకి పోకుండా అక్కడే తాము పరిచర్యకు ధరించే వస్త్రాలను ఉంచాలి. అవి ప్రతిష్ఠితాలు కాబట్టి ప్రజలకు చెందిన దేనినైనా వారు తాకాలంటే వారు వేరే బట్టలు ధరించుకోవాలి.”
15 И измеривши дом унутрашњи одведе ме на врата источна и измери свуда унаоколо.
౧౫అతడు లోపలి మందిరాన్ని కొలవడం ముగించి నన్ను బయటికి తీసుకొచ్చి తూర్పువైపు తిరిగి ఉన్న గుమ్మానికి వచ్చి చుట్టూ కొలిచాడు.
16 Измери источну страну трском мерачком, и беше пет стотина трсака, трском мерачком унаоколо.
౧౬తూర్పు వైపున కొలకర్రతో కొలిచినప్పుడు అది 270 మీటర్లు ఉంది.
17 Измери северну страну, и беше пет стотина трсака, трском мерачком унаоколо.
౧౭ఉత్తరం వైపు 270 మీటర్లు,
18 Измери јужну страну, и беше пет стотина трсака, трском мерачком.
౧౮దక్షిణం వైపు 270 మీటర్లు,
19 И окренувши се на западну страну, измери, и беше пет стотина трсака, трском мерачком.
౧౯పడమర వైపు 270 మీటర్లు ఉంది.
20 Измери са четири стране, и беше зид унаоколо пет стотина трсака дуг и пет стотина широк да раздваја свето место од светског.
౨౦ఆవిధంగా అతడు నాలుగు వైపులా కొలిచాడు. పవిత్రమైన, పవిత్రం కాని స్థలాలను వేరు చేయడానికి దానిచుట్టూ నాలుగు వైపులా 270 మీటర్లు ఉన్న నలుచదరపు గోడ కట్టి ఉంది.