< Filipian 3 >
1 W końcu, moi bracia, radujcie się w Panu. Pisać do was o tym samym mnie nie męczy, a dla was [jest] bezpieczne.
౧చివరిగా, నా సోదరులారా, ప్రభువులో ఆనందించండి. ఈ విషయాలనే మీకు మరలా రాయడం నాకేమీ సమస్య కాదు. మీకది క్షేమకరం.
2 Strzeżcie się psów, strzeżcie się złych pracowników, strzeżcie się obrzezywaczy.
౨కుక్కల విషయం జాగ్రత్త. చెడు పనులు చేసే వారి విషయం జాగ్రత్త. ఛేదించే ఆచారం పాటించే వారి విషయం జాగ్రత్త.
3 My bowiem jesteśmy obrzezaniem, którzy w duchu służymy Bogu i chlubimy się w Chrystusie Jezusie, a nie pokładamy ufności w ciele.
౩ఎందుకంటే, మనం దేవుని ఆత్మతో ఆరాధిస్తూ శరీరం మీద నమ్మకం పెట్టుకోకుండా క్రీస్తు యేసులో అతిశయిస్తున్నాము. మనమే అసలైన సున్నతి పొందిన వాళ్ళం.
4 Chociaż i ja mógłbym pokładać ufność w ciele. Jeśli ktoś inny uważa, że może pokładać ufność w ciele, bardziej ja:
౪చెప్పాలంటే, వాస్తవంగా నేనే శరీరాన్ని ఆధారం చేసుకోగలను. ఎవరైనా శరీరాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటే నేను మరి ఎక్కువగా చేసుకోగలను.
5 Obrzezany ósmego dnia, z rodu Izraela, z pokolenia Beniamina, Hebrajczyk z Hebrajczyków, co do prawa – faryzeusz;
౫ఎనిమిదవ రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. హెబ్రీయుల్లో హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుణ్ణి.
6 Co do gorliwości – prześladowca kościoła, co do sprawiedliwości opartej na prawie – nienaganny.
౬క్రైస్తవ సంఘాన్ని తీవ్రంగా హింసించాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో నిందారహితుడిని.
7 Lecz to, co było dla mnie zyskiem, ze względu na Chrystusa uznałem za stratę.
౭అయినా ఏవేవి నాకు లాభంగా ఉండేవో వాటిని క్రీస్తు కోసం పనికిరానివిగా ఎంచాను.
8 Owszem, wszystko uznaję za stratę dla znakomitości poznania Chrystusa Jezusa, mojego Pana, dla którego wszystko utraciłem i uznaję to za gnój, aby zyskać Chrystusa;
౮వాస్తవంగా ఇప్పుడు మిగతా వాటన్నిటినీ నష్టంగా ఎంచుతున్నాను ఎందుకంటే నా ప్రభువైన యేసు క్రీస్తును ఎరగడమే ఎంతో శ్రేష్ఠమైన విషయం. ఆయనను బట్టి మిగతా వాటన్నిటినీ ఇష్టపూర్వకంగా తిరస్కరించాను. క్రీస్తును సంపాదించటానికి వాటిని చెత్తతో సమానంగా ఎంచాను.
9 I znaleźć się w nim, nie mając własnej sprawiedliwości, tej, która jest z prawa, ale tę, która jest przez wiarę Chrystusa, [to jest] sprawiedliwość z Boga przez wiarę;
౯ధర్మశాస్త్రమూలమైన నా స్వనీతిగాక, క్రీస్తులోని విశ్వాసమూలమైన నీతికి బదులుగా, అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతిగలవాడనై ఆయనలో కనపడేలా అలా చేశాను.
10 Żeby poznać jego i moc jego zmartwychwstania oraz [swój] udział w jego cierpieniach, upodabniając się do jego śmierci;
౧౦ఆయనను ఎరగడం అనే నీతిన్యాయాలు, ఆయన పునరుత్థాన శక్తి, ఆయన పొందిన హింసల్లో సహానుభవం, క్రీస్తు మూలంగా ఆయన మరణం పోలికలోకి మార్పు చెందడం కోసం, ఏ విధంగానైనా చనిపోయిన వారిలో నుండి నాకు పునరుత్థానం కలగాలని, కోరుతున్నాను.
11 Abym jakimkolwiek sposobem dostąpił powstania z martwych.
౧౧
12 Nie żebym [to] już osiągnął albo już był doskonały, ale dążę, aby pochwycić to, do czego też zostałem pochwycony przez Chrystusa Jezusa.
౧౨వీటన్నిటినీ ఇంకా నేను పొందలేదు కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు. క్రీస్తు నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో దాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.
13 Bracia, ja o sobie nie myślę, że już pochwyciłem. Lecz jedno [czynię]: zapominając o tym, co za mną, a zdążając do tego, co przede mną;
౧౩సోదరులారా, దాన్ని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దాన్ని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను.
14 Biegnę do mety, do nagrody powołania Bożego, które jest z góry w Chrystusie Jezusie.
౧౪క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరకే పరుగెత్తుతూ ఉన్నాను.
15 Ilu więc [nas] jest doskonałych, tak myślmy. A jeśli o czymś inaczej myślicie, i to wam Bóg objawi.
౧౫కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం, అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మరి ఏ విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.
16 Jednak [w tym], do czego doszliśmy, postępujmy według jednej miary i to samo myślmy.
౧౬ఏమైనా సరే, మనం ఇప్పటికే పొందిన అదే సత్యానికి అనుగుణంగా మనమంతా నడుచుకొందాము.
17 Bądźcie, bracia, [wszyscy] razem moimi naśladowcami i przypatrujcie się tym, którzy postępują według wzoru, jaki w nas macie.
౧౭సోదరులారా, మీరు నన్ను పోలి ప్రవర్తించండి. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నడుచుకునే వారిని జాగ్రత్తగా గమనించండి.
18 Wielu bowiem, o których wam często mówiłem, postępuje [inaczej], a teraz nawet z płaczem mówię, że są wrogami krzyża Chrystusa.
౧౮చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దుఃఖంతో చెబుతున్నాను.
19 Ich końcem [jest] zatracenie, ich Bogiem jest brzuch, a ich chwała jest w hańbie; myślą oni o tym, co ziemskie.
౧౯నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే వారు మనసు ఉంచుతారు.
20 Nasza zaś ojczyzna jest w niebie, skąd też oczekujemy Zbawiciela, Pana Jezusa Chrystusa.
౨౦ఎందుకంటే మనం అయితే పరలోక పౌరులం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు అక్కడ నుండే భూమి మీదికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం.
21 On przemieni nasze podłe ciało, aby było podobne do jego chwalebnego ciała, zgodnie ze skuteczną mocą, którą też może poddać sobie wszystko.
౨౧సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో మన బలహీనమైన దేహాలను తన మహిమగల దేహంలాగా మార్చి వేస్తాడు.