< I Samuela 4 >
1 I stało się według mowy Samuelowej wszystkiemu Izraelowi. Bo gdy wyciągnął Izrael przeciw Filistynom na wojnę, a położył się obozem u Ebenezer, Filistynowie zaś położyli się obozem w Afeku;
౧ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఎబెనెజరులో సమావేశమయ్యారు. ఫిలిష్తీయులు ఆఫెకులో ఉన్నారు.
2 I gdy się uszykowali Filistynowie przeciwko Izraelowi, a stoczyła się bitwa: tedy porażony jest Izrael od Filistynów, a pobito ich w onej bitwie na polu około czterech tysięcy mężów.
౨ఫిలిష్తీయులు బారులు తీరి నిలబడి ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి యుద్ధభూమిలోనే దాదాపు నాలుగు వేలమంది మరణించారు.
3 I wrócił się lud do obozu. I rzekli starsi Izraelscy: Przeczże nas dziś poraził Pan przed Filistynami? weźmijmyż do siebie z Sylo skrzynię przymierza Pańskiego, a niech przyjdzie między nas, a wybawi nas z rąk nieprzyjaciół naszych.
౩ప్రజలు ఊరికి తిరిగి వచ్చాక ఇశ్రాయేలీయుల పెద్దలు “యెహోవా ఈ రోజు ఎందుకు మనలను ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయేలా చేశాడు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యనే ఉంచుకుందాము. అది మన మధ్య ఉంటే మనలను శత్రువుల చేతిలో నుండి కాపాడుతుంది” అన్నారు.
4 Przetoż posłał lud do Sylo, i wzięli stamtąd skrzynię przymierza Pana zastępów, siedzącego na Cherubinach; byli też tam dwaj synowie Heli z skrzynią przymierza Pańskiego, Ofni i Finees.
౪కాబట్టి పెద్దలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాలకు అధిపతి యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఏలీ ఇద్దరు కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు కూడా అక్కడే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు.
5 A gdy przyszła skrzynia przymierza Pańskiego do obozu, zakrzyknął wszystek Izrael głosem wielkim, tak iż ziemia zabrzmiała.
౫యెహోవా నిబంధన మందసాన్ని ప్రజల మధ్యకు తెచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా భూమి దద్దరిల్లి పోయేలా కేకలు వేశారు.
6 A usłyszawszy Filistynowie głos onego krzyku, rzekli: Cóż to za głos tak wielkiego wykrzykania w obozie Hebrejskim? I poznali, że skrzynia Pańska przyszła do obozu.
౬ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల గుంపులో ఈ గొప్ప కేకలు ఏమిటో అని ఆరా తీసి, యెహోవా నిబంధన మందసాన్ని శిబిరంలోకి తెచ్చారని తెలుసుకున్నారు.
7 Przetoż zlękli się Filistynowie, gdyż mówiono: Przyszedł Bóg do obozu ich, i rzekli: Biada nam! bo nie było nic takowego przedtem.
౭వారు భయపడి, దేవుడు శిబిరంలోకి వచ్చాడనుకుని “అయ్యో, ఇక మనకి మూడింది. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు,
8 Biadaż nam! któż nas wybawi z rąk tych Bogów mocnych? cić to bogowie, którzy porazili Egipt wszelką plagą na puszczy.
౮అయ్యో, మహాశూరుడైన ఈ దేవుడి చేతిలోనుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో రకరకాల తెగుళ్ళు రప్పించి ఐగుప్తు వారిని సంహరించిన దేవుడు ఈయనే గదా.
9 Zmacniajcież się, a bądźcie mężami, o Filistynowie! byście snać nie służyli Hebrejczykom, jako oni wam służyli. Bądźcież tedy mężami, a potykajcie się.
౯ఫిలిష్తీయులారా, వారు మన ముందు ఓడిపోయి దాసులు అయినట్టు మనం ఈ హెబ్రీయులకి దాసులు కాకూడదు. మనమంతా ధైర్యంగా నిలబడి బలం తెచ్చుకుని యుద్ధం చేద్దాం” అని చెప్పుకున్నారు.
10 Zwiedli tedy bitwę Filistynowie, i porażony jest Izrael, a uciekał każdy do namiotu swego; i stała się porażka bardzo wielka, tak iż poległo z Izraela trzydzieści tysięcy piechoty.
౧౦ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ పారిపోయి తమ డేరాలకు తిరిగి వచ్చారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయుల్లో 30 వేలమంది సైనికులు చనిపోయారు.
11 Tamże skrzynia Boża wzięta jest, i dwaj synowie Heli polegli, Ofni i Finees.
౧౧శత్రువులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏలీ కొడుకులు హొఫ్నీ, ఫీనెహాసు ఇద్దరినీ చంపేశారు.
12 I bieżał niektóry z synów Benjaminowych z bitwy, a przyszedł do Sylo tegoż dnia, mając szaty rozdarte, a proch na głowie swojej.
౧౨ఆ రోజు బెన్యామీను గోత్రానికి చెందిన ఒకడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకొంటూ, చినిగిన బట్టలతో, తలంతా దుమ్ము కొట్టుకుపోయి షిలోహుకు వచ్చాడు.
13 A gdy przyszedł, oto, Heli siedział na stołku przy drodze wyglądając, bo się serce jego lękało o skrzynię Bożą; a przyszedłszy on mąż, opowiedzał miastu, i krzyczało wszysytko miasto.
౧౩అతడు వచ్చినప్పుడు ఏలీ దారి పక్కన కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతనికి గుండె బద్దలౌతూ ఉంది. ఆ వ్యక్తి నగరంలోకి సమాచారం తెచ్చినప్పుడు అంతా కేకలు వేశారు.
14 A usłyszawszy Heli głos krzyku onego, rzekł: Cóż to za głos rozruchu tego? lecz on mąż spiesząc się, przyszedł, aby to oznajmił Heliemu.
౧౪ఏలీ ఆ కేకలు విని “ఈ కేకల శబ్దం ఏమిటి?” అని అడిగాడు. ఆ వ్యక్తి తొందరగా వచ్చి ఏలీతో జరిగిన సంగతి చెప్పాడు.
15 A Heli już miał dziewiędziesiąt i ośm lat, a oczy jego już się były zaćmiły, że nie mógł dojrzeć.
౧౫అప్పుడు ఏలీ వయసు తొంభై ఎనిమిదేళ్లు. అతనికి చూపు మందగించి కళ్ళు కనిపించడం లేదు.
16 Tedy rzekł on mąż do Heliego: Ja idę z bitwy, jam zaiste z bitwy dziś uciekł. Do którego on rzekł: Cóż się tam stało, synu mój?
౧౬ఆ వ్యక్తి “యుద్ధంలో నుండి వచ్చినవాణ్ణి నేనే, ఈ రోజు యుద్ధంలో నుండి పారిపోయి వచ్చాను” అని ఏలీతో చెప్పాడు. ఏలీ “నాయనా, అక్కడ ఏమి జరిగింది?” అని అడిగాడు.
17 I odpowiedzał on poseł, i rzekł: Uciekł Izrael przed Filistynami i stała się wielka porażka ludu; tamże i dwaj synowie twoi legli, Ofni i Finees, i skrzynia Boża wzięta jest.
౧౭అందుకు అతడు “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. జనంలో చాలామంది చనిపోయారు. హొఫ్నీ, ఫీనెహాసు అనే నీ ఇద్దరు కొడుకులూ చనిపోయారు. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకున్నారు” అని చెప్పాడు.
18 A gdy wspomniał skrzynię Bożą, spadł Heli z stołka na wznak u bramy, a złamawszy sobie szyję umarł; albowiem był człowiek stary i ociężały. A on sądził Izraela przez czterdzieści lat.
౧౮దేవుని మందసం విషయం అతడు చెప్పగానే ఏలీ గుమ్మం దగ్గర ఉన్న ఆసనం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, స్థూల కాయుడు. అతడు నలభై ఏళ్లు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధికారిగా ఉన్నాడు.
19 Synowa też jego, żona Fineesowa, będąc brzemienną i bliską porodzenia, gdy usłyszała oną nowinę, iż wzięta jest skrzynia Boża, i że umarł świekier jej, i mąż jej, tedy się nachyliła, i porodziła; bo przypadły na nię bole jej.
౧౯నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఏలీ కోడలు ఫీనెహాసు భార్య శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకున్నారనీ, తన మామ, భర్త చనిపోయారనీ విని, నొప్పులు ఎక్కువై మోకాళ్ల మీద కూలబడి అక్కడే ప్రసవించింది.
20 A gdy umierała, rzekły niewiasty, które były przy niej: Nie bój się, albowiemeś syna porodziła; ale ona nic nie odpowiedziała, ani tego przypuściła do serca swego.
౨౦ఆమె చనిపోతుండగా అక్కడ నిలబడిన స్త్రీలు ఆమెతో “భయపడకు, నీకు కొడుకు పుట్టాడు” అని చెప్పారు. ఆమె ఎలాంటి మాటా చెప్పలేదు. ఏమీ పట్టించుకోలేదు.
21 I nazwała dzieciątko Ichabod, mówiąc: Przeprowadziła się sława od Izraela, iż wzięto skrzynię Bożą, a iż umarł świekier jej, i mąż jej.
౨౧ఆమె దేవుని మందసాన్ని పట్టుకున్నారనే విషయం, తన మామ, భర్త చనిపోయారన్న విషయం తెలుసుకుని “ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది” అని చెప్పి, తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టింది.
22 Prztoż rzekła: Przeprowadziła się sława od Izraela; bo wzięto skrzynię Bożą.
౨౨“శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకోవడం వలన ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది” అని ఆమె అంది.