< 4 Mosebok 22 >
1 Så brøt Israels barn op og leiret sig på Moabs ødemarker på hin side Jordan midt imot Jeriko.
౧తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరంలో ఉన్న మోయాబు మైదానాల్లో శిబిరం వేసుకున్నారు.
2 Da Balak, Sippors sønn, så alt det Israel hadde gjort mot amorittene,
౨సిప్పోరు కొడుకు బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయు పట్ల చేసిందంతా చూశాడు.
3 da blev Moab meget redd for folket, fordi det var så tallrikt, og de grudde for Israels barn.
౩ప్రజలు ఎక్కువగా ఉన్న కారణంగా మోయాబీయులు వారిని చూసి చాలా కంగారుపడ్డారు. మోయాబీయులు ఇశ్రాయేలీయులను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు.
4 Og Moab sa til de eldste i Midian: Nu vil denne store flokk ete op alt det som er her rundt omkring oss, likesom oksen eter op markens grønne urter. - På den tid var Balak, Sippors sønn, konge i Moab.
౪మోయాబీయులు మిద్యాను పెద్దలతో “ఒక ఎద్దు పొలంలో ఉన్న పచ్చిగడ్డి తినేసినట్టు ఈ జనసమూహహం ఇప్పుడు మన చుట్టూ ఉన్నదంతా తినేస్తారు” అన్నారు. ఆ కాలంలో సిప్పోరు కొడుకు బాలాకు మోయాబీయులకు రాజు.
5 Han sendte bud til Bileam, Beors sønn, i Petor, som ligger ved den store elv, til det land hvor han bodde blandt sitt folk, for å be ham komme og si til ham: Se, her er kommet et folk fra Egypten; det fyller hele landet, og det har leiret sig midt imot mig.
౫కాబట్టి అతడు బెయోరు కొడుకు బిలామును పిలవడానికి అతని ప్రజల దేశంలో ఉన్న నది దగ్గర ఉన్న పెతోరుకు ఇలా కబురంపారు. “చూడు, ఒక జాతి ఐగుప్తులోనుంచి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి, ఇప్పుడు నాకు ఎదురు గుండా శిబిరం వేసుకున్నారు.
6 Så kom nu og forbann dette folk for mig, for det er mig for mektig! Kanskje jeg da kunde slå det og drive det ut av landet; for jeg vet at den du velsigner, er velsignet, og den du forbanner, er forbannet.
౬కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా కోసం ఈ జనాన్ని శపించు. వారు నాకంటే చాలా బలవంతులు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో. ఎందుకంటే నువ్వు దీవించినవాడికి దీవెన, శపించిన వాడికి శాపం కలుగుతాయని నాకు తెలుసు” అని అన్నాడు.
7 Og Moabs eldste drog avsted sammen med Midians eldste og hadde spåmannslønn med sig; og de kom til Bileam og bar frem Balaks ord til ham.
౭కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు భవిష్యవాణి చెప్పడానికి ఇచ్చే చెల్లింపు తీసుకుని బిలాము దగ్గరికి వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పారు.
8 Da sa han til dem: Bli her inatt, så vil jeg gi eder svar efter som Herren taler til mig. Og Moabs høvdinger blev hos Bileam.
౮అతడు వారితో “ఈ రాత్రి ఇక్కడే ఉండండి. యెహోవా నాకు చెప్పిన మాటలు నేను మళ్ళీ వచ్చి మీతో చెప్తాను” అన్నాడు. అప్పుడు మోయాబు నాయకులు ఆ రాత్రి బిలాము దగ్గర ఉన్నారు.
9 Da kom Gud til Bileam og sa: Hvad er det for folk som er hos dig?
౯దేవుడు బిలాము దగ్గరికి వచ్చి “నీ దగ్గరున్న ఈ మనుషులు ఎవరు?” అన్నాడు.
10 Bileam svarte Gud: Balak, Sippors sønn, kongen i Moab, har sendt dette bud til mig:
౧౦బిలాము దేవునితో “సిప్పోరు కొడుకు బాలాకు అనే మోయాబు రాజు వార్త పంపించి,
11 Se, her er kommet et folk fra Egypten som fyller hele landet; kom nu og forbann det for mig! Kanskje jeg da blir i stand til å stride mot det og drive det ut.
౧౧‘చూడు, ఒక జాతి ఐగుప్తునుంచి బయలుదేరి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి ఉన్నారు. నువ్వు వెంటనే వచ్చి నా కోసం వారిని శపించు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో’ అని వీళ్ళతో నాకు వార్త పంపించాడు” అన్నాడు.
12 Da sa Gud til Bileam: Du skal ikke gå med dem; du skal ikke forbanne folket, for det er velsignet.
౧౨దేవుడు బిలాముకు జవాబిస్తూ “నువ్వు వారితో వెళ్లకూడదు. ఆ ప్రజలను శపించకూడదు. వారు ఆశీర్వాదం పొందిన వారు” అన్నాడు.
13 Om morgenen, da Bileam var stått op, sa han til Balaks høvdinger: Dra hjem til eders land! For Herren vil ikke gi mig lov til å følge med eder.
౧౩కాబట్టి బిలాము ఉదయాన లేచి, బాలాకు నాయకులతో “మీరు మీ స్వదేశానికి వెళ్ళి పొండి. మీతో వెళ్ళడానికి యెహోవా నాకు అనుమతి ఇవ్వలేదు” అన్నాడు.
14 Da tok Moabs høvdinger avsted, og da de kom tilbake til Balak, sa de: Bileam vilde ikke følge med oss.
౧౪కాబట్టి మోయాబు నాయకులు లేచి బాలాకు దగ్గరికి వెళ్లి “బిలాము మాతో రావడానికి నిరాకరించాడు” అని చెప్పారు.
15 Da sendte Balak andre høvdinger, flere og gjævere enn de første.
౧౫బాలాకు వారికంటే ఘనత కలిగిన ఇంకా ఎక్కువ మంది నాయకులను మళ్ళీ పంపించాడు.
16 Og de kom til Bileam og sa til ham: Så sier Balak, Sippors sønn: Kjære, la dig ikke hindre fra å komme til mig!
౧౬వారు బిలాము దగ్గరికి వచ్చి అతనితో “సిప్పోరు కొడుకు బాలాకు, ‘నువ్వు నా దగ్గరికి రావడానికి దయచేసి ఏదీ నిన్ను ఆపనివ్వకు,
17 Jeg vil vise dig stor ære, og alt det du sier til mig, vil jeg gjøre; så kom da og forbann dette folk for mig!
౧౭ఎందుకంటే, నేను నిన్ను చాలా గొప్పవాణ్ణి చేస్తాను. నువ్వు నాతో ఏం చెప్పినా చేస్తాను. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి, నా కోసం ఈ జనాన్ని శపించు’ అని చెప్పమన్నాడు” అన్నారు.
18 Da svarte Bileam og sa til Balaks tjenere: Om Balak gav mig hele sitt hus fullt av sølv og gull, kunde jeg ikke overtrede Herrens, min Guds ord, hverken i smått eller stort.
౧౮బిలాము జవాబిస్తూ “బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా, నేను చెయ్యాల్సిన పని చిన్నదైనా పెద్దదైనా, నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను.
19 Men bli nu også I her inatt, forat jeg kan få vite hvad mere Herren har å si mig.
౧౯కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి కూడా ఇక్కడ ఉండండి. యెహోవా నాతో ఇంకేం చెప్తాడో నేను తెలుసుకుంటాను” అన్నాడు.
20 Og Gud kom til Bileam om natten og sa til ham: Dersom disse menn er kommet for å hente dig, så gjør dig ferdig og dra med dem! Men gjør ikke annet enn hvad jeg sier til dig!
౨౦ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చి “ఆ మనుషులు నిన్ను పిలిపించారు గనక నువ్వు లేచి వారితో వెళ్ళు. కాని కేవలం నేను నీతో చెప్పినట్టే నువ్వు చెయ్యాలి” అని చెప్పాడు.
21 Om morgenen stod Bileam op og salte sin aseninne og drog med Moabs høvdinger.
౨౧ఉదయాన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు నాయకులతోపాటు వెళ్ళాడు.
22 Men Guds vrede optendtes fordi han reiste, og Herrens engel stilte sig på veien for å stå ham imot da han kom ridende på sin aseninne og hadde sine to tjenere med sig.
౨౨అతడు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధంగా దారిలో అడ్డంగా నిలిచి ఉన్నాడు. అతడు తన గాడిద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు, అతని పనివారు ఇద్దరు అతనితోపాటు ఉన్నారు.
23 Og aseninnen så Herrens engel, som stod på veien med et draget sverd i sin hånd; da tok den av veien og ut på marken; men Bileam slo aseninnen for å vike den inn på veien igjen.
౨౩యెహోవా దూత కత్తి దూసి, దారిలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది గనక అది దారి మళ్ళి పొలంలోకి వెళ్ళింది. బిలాము గాడిదను దారిలోకి మళ్ళించాలని దాన్ని కొట్టాడు.
24 Siden stilte Herrens engel sig på en smal vei mellem vingårdene, hvor det var stengjerde på begge sider.
౨౪యెహోవా దూత అటూ ఇటూ గోడలున్న ద్రాక్షతోటల సందులో నిలిచాడు.
25 Og da aseninnen så Herrens engel, trykte den sig inn til muren og klemte Bileams fot mot muren; da slo han den igjen.
౨౫గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది గనక అతడు మళ్ళీ దాన్ని కొట్టాడు.
26 Så gikk Herrens engel lenger frem og stilte sig på et trangt sted, hvor det ingen råd var til å bøie av, hverken til høire eller til venstre.
౨౬యెహోవా దూత ముందుకు వెళ్లి, కుడికైనా ఎడమకైనా తిరగడానికి దారిలేని ఇరుకు ప్రాంతంలో నిలిచినప్పుడు,
27 Og da aseninnen så Herrens engel, la den sig ned under Bileam; da optendtes Bileams vrede, og han slo aseninnen med sin kjepp.
౨౭ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతోబాటు కింద పడిపోయింది గనక బిలాము మండిపడ్డాడు. తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు.
28 Men Herren oplot aseninnens munn, og den sa til Bileam: Hvad har jeg gjort dig, siden du nu har slått mig tre ganger?
౨౮అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచాడు. అది “నువ్వు నన్ను మూడుసార్లు కొట్టావు. నేను ఏమి చేశాను?” అని బిలాముతో అంది.
29 Bileam svarte aseninnen: Du har hatt mig til narr. Hadde jeg bare et sverd i min hånd, så vilde jeg nu slå dig ihjel.
౨౯బిలాము “నువ్వు నన్ను ఒక వెర్రివాణ్ణి చేశావు. నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేసే వాణ్ణి” అన్నాడు.
30 Da sa aseninnen til Bileam: Er ikke jeg din aseninne, som du har ridd på all din tid like til denne dag? Har jeg nogensinne hatt for vis å gjøre således mot dig? Han sa: Nei!
౩౦ఆ గాడిద “ఈ రోజు వరకూ నీ జీవితమంతా నువ్వు స్వారీ చేసిన నేను నీదాన్ని కాదా? నేనెప్పుడైనా నీ పట్ల ఈవిధంగా చేశానా?” అని బిలాముతో అంది. బిలాము “లేదు” అన్నాడు.
31 Og Herren oplot Bileams øine, så han så Herrens engel, som stod på veien med et draget sverd i sin hånd; da bøide han sig og falt ned på sitt ansikt.
౩౧అప్పుడు యెహోవా బిలాము కళ్ళు తెరిచాడు గనక దూసిన కత్తి చేత్తో పట్టుకుని దారిలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు.
32 Og Herrens engel sa til ham: Hvorfor har du nu tre ganger slått din aseninne? Se, jeg er gått ut for å stå dig imot; for jeg ser at denne vei fører til fordervelse.
౩౨యెహోవా దూత “నీ గాడిదను మూడుసార్లు ఎందుకు కొట్టావు? చూడు, నా దృష్టిలో నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు గనక నేను నీకు విరోధిగా వచ్చాను.
33 Aseninnen så mig og har nu tre ganger bøid av veien for mig; hvis den ikke hadde bøid av veien for mig, så hadde jeg nu slått dig ihjel, men latt den leve.
౩౩ఆ గాడిద నన్ను చూసి ఈ మూడుసార్లు నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళింది. అది నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళకపోతే కచ్చితంగా అప్పుడే నేను నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఉండేవాణ్ణి” అని అతనితో అన్నాడు.
34 Da sa Bileam til Herrens engel: Jeg har syndet, fordi jeg ikke skjønte at du stod imot mig på veien; men hvis det er dig imot, så vil jeg vende tilbake.
౩౪అందుకు బిలాము “నేను పాపం చేశాను. నువ్వు నాకు ఎదురుగా దారిలో నిలుచుని ఉన్నావని నాకు తెలియలేదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను ఎక్కడనుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు.
35 Herrens engel sa til Bileam: Følg med mennene! Men tal ikke annet enn hvad jeg sier til dig! Så fulgte Bileam med Balaks høvdinger.
౩౫యెహోవా దూత “నువ్వు ఆ మనుషులతోపాటు వెళ్ళు. కాని, నేను నీతో చెప్పే మాటలేగాని, ఇంకేమీ పలకొద్దు” అని బిలాముతో చెప్పాడు. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో పాటు వెళ్ళాడు.
36 Da Balak hørte at Bileam kom, drog han ham i møte til den by i Moab som ligger på grensen ved Arnon, ved den ytterste grense.
౩౬బిలాము వచ్చాడని బాలాకు విని, ఆ సరిహద్దు చివర ఉన్న అర్నోను తీరంలో అతన్ని కలుసుకోడానికి మోయాబు పట్టణం వరకూ వెళ్ళినప్పుడు,
37 Og Balak sa til Bileam: Sendte jeg ikke bud til dig og bad dig komme hit? Hvorfor kom du ikke til mig? Mener du jeg ikke skulde kunne vise dig ære nok?
౩౭బాలాకు బిలాముతో “నిన్ను పిలవడానికి నేను నీ దగ్గరికి రాయబారులను పంపాను గదా! నువ్వెందుకు నా దగ్గరికి రాలేదు? నిన్ను గొప్పవాణ్ణి చేసే సామర్థ్యం నాకు లేదా?” అన్నాడు.
38 Bileam svarte: Nu ser du jeg er kommet til dig; men står det vel i min makt å tale noget? Det ord Gud legger i min munn, det må jeg tale.
౩౮అప్పుడు బిలాము “చూడు, నేను నీ దగ్గరికి వచ్చాను. నాకిష్టమొచ్చింది చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు నా నోట పలికించే మాటే పలకగలను గదా” అని బాలాకుతో చెప్పాడు.
39 Så drog Bileam med Balak, og de kom til Kirjat-Husot.
౩౯అప్పుడు బిలాము బాలాకుతో పాటు వెళ్ళాడు. వారు కిర్యత్ హుజోతుకు వచ్చినప్పుడు
40 Og Balak ofret storfe og småfe og sendte til Bileam og de høvdinger som var med ham.
౪౦బాలాకు ఎడ్లు, గొర్రెలు బలిగా అర్పించి, కొంతభాగం బిలాముకు, అతని దగ్గరున్న నాయకులకు పంపించాడు.
41 Morgenen efter tok Balak Bileam med sig og førte ham op på Bamot Ba'al; derfra så han den ytterste del av folket.
౪౧బాలాకు ఆ తరువాత రోజు బిలామును బయలుకు చెందిన ఎత్తైన స్థలాల దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అక్కడనుంచి బిలాము ఇశ్రాయేలీయుల శిబిరంలో కొంత భాగమే చూడగలిగాడు.