< Otra Laiku 3 >

1 Un Salamans sāka celt Tā Kunga namu Jeruzālemē Morijas kalnā, kas viņa tēvam Dāvidam bija rādīts, tai vietā, ko Dāvids bija sataisījis, uz Jebusieša Arnana klona.
తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అతడు మోరీయా పర్వతంపై సిద్ధం చేసిన స్థలం లో ఒర్నాను అనే యెబూసీయుడికి చెందిన కళ్ళంలో యెహోవా మందిరం కట్టించడం మొదలుపెట్టాడు.
2 Un viņš sāka celt otrā mēnesī otrā dienā, savas valdīšanas ceturtā gadā.
అతడు తన పాలనలో నాలుగో సంవత్సరం, రెండో నెల, రెండో రోజున దాన్ని ప్రారంభించాడు.
3 Un Salamans lika pamatu ceļamam Dieva namam; pēc tā pirmā mēra tas bija sešdesmit olekšu garumā un divdesmit olekšu platumā.
దేవుని మందిరానికి పునాదులు వేయించాడు. గతంలో ఉన్న కొలతల ప్రకారం దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు.
4 Un priekšnams priekšgalā bija tik garš, cik tas nams plats, divdesmit olektis, un simts divdesmit olekšu tas bija augstumā, un viņš to iekšpusē pārvilka ar tīru zeltu.
మందిరం ముఖమంటపం వెడల్పు, పొడవు, ఎత్తు ఇరవై మూరలు. మూరలు. దాని లోపలి భాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు.
5 Un tam lielam namam viņš grīdu lika no priedes kokiem, pārvilka to ar labu zeltu un uztaisīja palmu kokus un ķēdītes klāt.
మందిరం లోపలి పెద్ద గది పై కప్పును దేవదారు పలకలతో కప్పి వాటి పైన మేలిమి బంగారం పొదిగించి పై భాగంలో ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటి నగిషీ చెక్కించాడు.
6 Viņš arī tam namam aplika dārgus akmeņus par glītumu, un tas zelts bija no Parvaīma.
ఆ మందిరాన్ని ప్రశస్తమైన రత్నాలతో అలంకరించాడు. దానికి వాడిన బంగారం పర్వాయీము నుండి వచ్చింది.
7 Un viņš to namu, baļķus, stabus un viņa sienas un viņa durvis apzeltīja un izgrieza ķerubus pie sienām.
మందిరం దూలాలనూ స్తంభాలనూ గోడలనూ తలుపులనూ బంగారంతో పొదిగించి గోడల మీద కెరూబు ఆకారాలు చెక్కించాడు.
8 Un viņš taisīja tās visu svētākās vietas namu; tas bija divdesmit olektis garš un divdesmit olektis plats, un viņš to pārvilka ar labu zeltu pie sešsimt talentiem.
దానిలో సొలొమోను అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి ఇరవై మూరలు. దాని వెడల్పు ఇరవై మూరలు. ఇరవై వేల కిలోల మేలిమి బంగారంతో అతడు దాన్ని పొదిగించాడు.
9 Un tas naglu svars bija pie piecdesmit sēķeļiem zelta, un viņš pārvilka arī tās augšistabas ar zeltu.
ఒక్కొక్క మేకు బరువు ఏభై తులాల బంగారం. గది పై భాగాలను అతడు బంగారంతో పొదిగించాడు.
10 Un viņš taisīja tai visu svētākās vietas namā divus ķerubus, tēlotāja darbu, un tos pārvilka ar zeltu.
౧౦అతి పరిశుద్ధ స్థలం లో చెక్కడం పనితో రెండు కెరూబులు చేయించి వాటిని బంగారంతో పొదిగించాడు.
11 Un tie ķerubu spārni bija divdesmit olekšu garumā, viens spārns bija piecu olekšu un sniedzās līdz nama sienai, un otrs spārns bija arī piecu olekšu un sniedzās līdz otra ķeruba spārnam.
౧౧ఆ కెరూబుల రెక్కల మొత్తం పొడుగు 20 మూరలు. కెరూబు ఒక రెక్క పొడుగు ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది.
12 Tāpat bija arī tā otra ķeruba spārns piecu olekšu un sniedzās līdz nama sienai, un otrs spārns bija arī piecu olekšu un sniedzās līdz tā otra ķeruba spārnam.
౧౨రెండో కెరూబు రెక్క పొడుగు కూడా ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది
13 Šo ķerubu spārni izplētās divdesmit olektis, un tie stāvēja uz savām kājām, un viņu vaigi bija griezti uz iekšpusi.
౧౩ఈ విధంగా ఈ కెరూబులు చాచిన రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. ఆ కెరూబులు తమ పాదాల మీద నిలబెట్టి ఉన్నాయి. వారి ముఖాలు మందిరం ప్రధాన గది వైపుకు తిరిగి ఉన్నాయి.
14 Un viņš taisīja priekšvelkamo no ziluma, no purpura un dārga sarkanuma un smalkām dzijām un ieauda tam ķerubus
౧౪అతడు నీలి, ఊదా, ఎరుపు, సన్నని నార నూలుతో ఒక తెర చేయించి దాని మీద కెరూబు ఆకారాలను కుట్టించాడు.
15 Bet tā nama priekšā viņš lika divus stabus trīsdesmit un piecu olekšu augstumā, un tas kronis ikkatram virsū bija piecu olekšu.
౧౫అంతే గాక ముందు 35 మూరల పొడవున్న రెండు స్తంభాలూ, వాటి మీదకి ఐదు మూరల పొడవున్న పీటలూ చేయించాడు.
16 Un viņš taisīja ķēdītes pie stīpas un lika tās uz tiem stabu kroņiem un taisīja simts granātābolus un lika tos starp tām ķēdītēm.
౧౬గర్భాలయంలో చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభాల పైభాగంలో దాన్ని ఉంచి, నూరు దానిమ్మ కాయలు చేయించి ఆ గొలుసు పనికి తగిలించాడు.
17 Un viņš uzcēla tos stabus Dieva nama priekšā, vienu pa labo roku un otru pa kreiso, un viņš to pa labo roku nosauca Jaķinu un to pa kreiso Boasu.
౧౭ఆ రెండు స్తంభాలనూ దేవాలయం ముందు కుడి వైపున ఒకటీ ఎడమ వైపున ఒకటీ నిలబెట్టి, కుడి వైపు దానికి “యాకీను” అనీ, ఎడమ వైపు దానికి “బోయజు” అనీ పేర్లు పెట్టాడు.

< Otra Laiku 3 >