< ನ್ಯಾಯಸ್ಥಾಪಕರು 19 >
1 ಇಸ್ರಾಯೇಲಿನಲ್ಲಿ ಆ ದಿವಸಗಳಲ್ಲಿ ಅರಸನಿರಲಿಲ್ಲ. ಎಫ್ರಾಯೀಮ್ ಬೆಟ್ಟದ ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ಲೇವಿಯನು ಪ್ರವಾಸಿಯಾಗಿದ್ದನು. ಅವನು ಯೆಹೂದದ ಬೇತ್ಲೆಹೇಮಿನವಳಾದಂಥ ಸ್ತ್ರೀಯನ್ನು ಉಪಪತ್ನಿಯಾಗಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದನು.
౧ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేని ఆ రోజుల్లో ఎఫ్రామీయుల కొండ ప్రాంతాల్లోని ఉత్తర భాగంలో ఒక లేవీయుడు పరదేశిగా నివసించేవాడు. అతడు యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉంపుడుగత్తెగా తెచ్చుకున్నాడు.
2 ಅವನ ಉಪಪತ್ನಿ ಅವನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಜಾರತ್ವ ಮಾಡಿ, ಅವನನ್ನು ಬಿಟ್ಟು, ಯೆಹೂದದ ಬೇತ್ಲೆಹೇಮಿನಲ್ಲಿರುವ ತನ್ನ ತಂದೆಯ ಮನೆಗೆ ಹೋಗಿ, ಅಲ್ಲಿ ನಾಲ್ಕು ತಿಂಗಳಿದ್ದಳು.
౨అయితే ఆమె అతణ్ణి విడిచి పెట్టి మరొకరితో వ్యభిచారం చేసింది. ఆమె యూదా ప్రాంతం బెత్లేహెం లోని తన తండ్రి ఇంటికి వెళ్లి అక్కడే నాలుగు నెలలు ఉండిపోయింది.
3 ಆಗ ಅವಳ ಗಂಡನು ಎದ್ದು, ಅವಳ ಸಂಗಡ ಪ್ರೀತಿಯಿಂದ ಮಾತನಾಡಿ, ಅವಳನ್ನು ತಿರುಗಿ ಕರೆತರುವುದಕ್ಕೆ ತನ್ನ ಸೇವಕನನ್ನೂ, ಎರಡು ಕತ್ತೆಗಳನ್ನೂ ತೆಗೆದುಕೊಂಡು ಅವಳ ಬಳಿಗೆ ಹೋದನು. ಅವಳು ಅವನನ್ನು ತನ್ನ ತಂದೆಯ ಮನೆಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋದಳು. ಆಕೆಯ ತಂದೆ ಅವನನ್ನು ಕಂಡಾಗ, ಸಂತೋಷದಿಂದ ಅವನನ್ನು ಸ್ವಾಗತಿಸಿದನು.
౩ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెని తిరిగి తెచ్చుకోడానికి ఆమె భర్త తన సేవకుణ్ణి, రెండు గాడిదలనూ తీసుకుని బయల్దేరాడు. ఆమె అతణ్ణి తన తండ్రి ఇంట్లోకి తీసుకు వెళ్ళింది. ఆ యువతి తండ్రి అతణ్ణి చూసి అతణ్ణి కలుసుకున్నందుకు సంతోషపడ్డాడు.
4 ಅವನ ಮಾವನು ಅಂದರೆ ಆ ಸ್ತ್ರೀಯ ತಂದೆಯು ಅವನನ್ನು ಅಲ್ಲಿರುವಂತೆ ಒತ್ತಾಯ ಮಾಡಿದನು. ಆದ್ದರಿಂದ ಅವನು ಅಲ್ಲಿ ಊಟಮಾಡುತ್ತಾ, ಕುಡಿಯುತ್ತಾ, ಮಲಗುತ್ತಾ ಮೂರು ದಿನಗಳನ್ನು ಕಳೆದನು.
౪ఆ అమ్మాయి తండ్రి, అంటే అతని మామ తనతో మూడు రోజులుండమని అతణ్ణి బలవంతం చేశాడు. కాబట్టి అతడు మూడు రోజులూ, రాత్రులూ తింటూ తాగుతూ అక్కడే గడిపాడు.
5 ನಾಲ್ಕನೆಯ ದಿನ ಅವರು ಬೇಗನೆ ಎದ್ದು, ಹೊರಡಲಿಕ್ಕೆ ಸಿದ್ಧರಾದರು. ಆದರೆ ಆ ಸ್ತ್ರೀಯ ತಂದೆಯು ತನ್ನ ಅಳಿಯನಿಗೆ, “ಸ್ವಲ್ಪ ಊಟಮಾಡಿ ಚೇತರಿಸಿಕೋ, ಆಮೇಲೆ ನೀವು ಹೋಗಬಹುದು,” ಎಂದನು.
౫నాలుగవ రోజు వెళ్ళడానికి వాళ్ళు ఉదయాన్నే మేలుకున్నారు. ప్రయాణానికి సిద్ధపడ్డారు. కాని ఆ అమ్మాయి తండ్రి తన అల్లుడితో “కొంచెం రొట్టె తిని బలం తెచ్చుకో. ఆ తరువాత వెళ్ళవచ్చు” అన్నాడు.
6 ಆದ್ದರಿಂದ ಅವರಿಬ್ಬರು ಊಟ ಮಾಡಲು, ಕುಡಿಯಲು ಕುಳಿತುಕೊಂಡರು. ಅನಂತರದಲ್ಲಿ ಆ ಸ್ತ್ರೀಯ ತಂದೆಯು, “ಈ ರಾತ್ರಿ ಇಲ್ಲೇ ಇದ್ದುಕೊಂಡು ಸಂತೋಷಪಡು,” ಎಂದು ಹೇಳಿದನು.
౬దాంతో మళ్ళీ వారిద్దరూ కూర్చుని భోజనం చేశారు. భోజనమయ్యాక ఆ అమ్మాయి తండ్రి “దయచేసి ఈ రాత్రంతా మాతో గడుపు. సరదాగా, సంతోషంగా ఉండు” అన్నాడు.
7 ಆ ಮನುಷ್ಯನು ಎದ್ದು ಹೊರಡಲು ಸಿದ್ಧನಾದಾಗ, ಅವನ ಮಾವನು ಅವನನ್ನು ಆ ರಾತ್ರಿ ಅಲ್ಲಿಯೇ ಇರುವಂತೆ ಒಪ್ಪಿಸಿದನು.
౭అతడు త్వరగా ముగించి బయల్దేరడానికి లేచాడు. కాని అతని మామ మళ్ళీ ఆ రాత్రి ఉండిపొమ్మని బలవంతం చేశాడు. కాబట్టి ఆ రాత్రి కూడా అతడు అక్కడే ఉండిపోయాడు.
8 ಐದನೆಯ ದಿನದ ಮುಂಜಾನೆ ಅವನು ಹೊರಡಲು ಎದ್ದೇಳುವಾಗ, ಆ ಸ್ತ್ರೀಯ ತಂದೆಯು, “ವಿಶ್ರಮಿಸಿಕೋ, ಮಧ್ಯಾಹ್ನದವರೆಗೆ ಇರು,” ಎಂದನು. ಅದರಂತೆ ಅವರಿಬ್ಬರು ಒಟ್ಟಾಗಿ ಊಟಮಾಡಿದರು.
౮అయిదో రోజు అతడు ఉదయాన్నే ప్రయాణానికి లేచినప్పుడు ఆ అమ్మాయి తండ్రి “మధ్యాహ్నం వరకూ ఉండి భోజనం చేసి కొంచెం బలపడు” అంటూ నిలిపివేశాడు. సాయంత్రం అయ్యేవరకూ తాత్సారం చేస్తూ వారు భోజనం చేసారు.
9 ಅವನೂ, ಅವನ ಉಪಪತ್ನಿಯೂ ಅವನ ಸೇವಕನೂ ಹೋಗುವುದಕ್ಕೆ ಎದ್ದಾಗ, ಅವನ ಮಾವನು ಅವನಿಗೆ, “ಇಗೋ, ಹೊತ್ತು ಹೋಗಿ ಸಂಜೆ ಆಯಿತು. ಈ ರಾತ್ರಿ ನೀನು ದಯಮಾಡಿ ಇಲ್ಲೇ ಇರು; ಹೊತ್ತು ಮುಣುಗುತ್ತಾ ಬಂತು. ನೀನು ಈ ರಾತ್ರಿ ಇಲ್ಲಿದ್ದು, ನಿನ್ನ ಗುಡಾರಕ್ಕೆ ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು, ನಿಮ್ಮ ಮಾರ್ಗ ಹಿಡಿದು ಹೋಗಬಹುದು,” ಎಂದನು.
౯ఆ లేవీయుడూ, అతని ఉంపుడుకత్తే, అతని సేవకుడూ ప్రయాణానికి లేచారు. అతని మామ అతనితో “చూడు, సాయంత్రం అయింది. చీకటి పడబోతోంది. నువ్వు మరో రాత్రి ఇక్కడే ఉండి సరదాగా గడుపు. రేపు ఉదయాన్నే లేచి నీ ఇంటికి వెళ్ళవచ్చు.” అని బలవంతం చేశాడు.
10 ಆದರೆ ಆ ಮನುಷ್ಯನು ಆ ರಾತ್ರಿ ಅಲ್ಲಿರುವುದಕ್ಕೆ ಮನಸ್ಸಿಲ್ಲದೆ, ಎದ್ದು ತಡಿಕಟ್ಟಿದ ಎರಡು ಕತ್ತೆಗಳ ಮತ್ತು ತನ್ನ ಉಪಪತ್ನಿಯ ಸಂಗಡ ಹೊರಟುಹೋಗಿ, ಯೆರೂಸಲೇಮು ಎಂಬ ಯೆಬೂಸಿಗೆ ಸರಿಯಾಗಿ ಬಂದನು.
౧౦కానీ అతడు ఆ రాత్రి అక్కడ గడపడానికి ఇష్టపడలేదు. అతడు లేచి ప్రయాణమయ్యాడు. ప్రయాణం సాగించి యెబూసు (అంటే యెరూషలేము) దగ్గరికి వచ్చాడు. అతని ఉంపుడుగత్తెతో పాటు అతనితో కూడా జీను కట్టిన రెండు గాడిదలూ ఉన్నాయి.
11 ಅವರು ಯೆಬೂಸಿಗೆ ಸಮೀಪಿಸಿದಾಗ, ಹೊತ್ತು ಬಹಳ ಹೋಗಿತ್ತು. ಆಗ ಸೇವಕನು ತನ್ನ ಯಜಮಾನನಿಗೆ, “ನೀನು ದಯಮಾಡಿ ಬಾ; ಈ ಯೆಬೂಸಿಯರ ಪಟ್ಟಣಕ್ಕೆ ತಿರುಗಿಕೊಂಡು, ಅಲ್ಲಿ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಇಳಿದುಕೊಳ್ಳೋಣ,” ಎಂದನು.
౧౧వారు యెబూసును సమీపించినప్పుడు పూర్తిగా సాయంత్రం అయింది. అతని సేవకుడు అతనితో “మనం ఈ యెబూసీయుల ఊర్లోకి వెళ్దాం. దీనిలో ఈ రాత్రి గడుపుదాం” అన్నాడు.
12 ಆದರೆ ಅವನ ಯಜಮಾನನು ಅವನಿಗೆ, “ನಾವು ಇಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರಲ್ಲದವರ ಪಟ್ಟಣದಲ್ಲಿ ತಂಗಬಾರದು; ಗಿಬೆಯ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗೋಣ,” ಎಂದನು.
౧౨కానీ అతని యజమానుడు “ఇశ్రాయేలీయుల పట్టణాల్లోనే మనం బస చేద్దాం. ఇతరుల పట్టణాల్లో మనం ప్రవేశించం. మనం గిబియా వరకూ వెళ్దాం” అన్నాడు.
13 ಅವನು ಸೇವಕನಿಗೆ, “ಗಿಬೆಯದಲ್ಲಾದರೂ, ರಾಮಾದಲ್ಲಾದರೂ ಇಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಒಂದಕ್ಕೆ ಸೇರೋಣ ಬಾ,” ಎಂದನು.
౧౩తరువాత ఆ లేవీయుడు తన సేవకుడితో “నువ్వు రా, మనం రామాకు గానీ గిబియాకి గానీ వెళ్లి రాత్రికి అక్కడే గడుపుదాం.” అన్నాడు.
14 ಹಾಗೆಯೇ ಅವರು ದಾಟಿಹೋದರು. ಅವರು ಬೆನ್ಯಾಮೀನನಿಗೆ ಸೇರಿದ ಗಿಬೆಯ ಊರಿನ ಸಮೀಪಕ್ಕೆ ಬಂದಾಗ ಸೂರ್ಯ ಮುಳುಗಿತ್ತು.
౧౪అలా వాళ్ళు ముందుకు ప్రయాణమయ్యారు. చివరకూ బెన్యామీను గోత్రానికి చెందిన గిబియాకు వచ్చారు. అప్పటికి చీకటి పడింది.
15 ಆದ್ದರಿಂದ ಅವರು ಗಿಬೆಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಕಳೆಯಲು ಉಳಿದರು. ಅವರು ಹೋಗಿ ಪಟ್ಟಣದ ಮಧ್ಯದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡರು. ಮನೆಯಲ್ಲಿ ಇಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಅವರನ್ನು ಯಾರೂ ಸೇರಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ.
౧౫కాబట్టి గిబియాలో ఆ రాత్రి గడపడానికి ఆ ఊరిలో ప్రవేశించారు. వారిని ఎవరూ తమ ఇంటికి ఆహ్వానించలేదు. కాబట్టి వారు ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక స్థలం లో కూర్చున్నారు.
16 ಆಗ ಒಬ್ಬ ಮುದುಕನು ಹೊಲದಲ್ಲಿ ತನ್ನ ಕೆಲಸಮಾಡಿ ಬರುತ್ತಿದ್ದನು. ಆ ಮನುಷ್ಯನು ಎಫ್ರಾಯೀಮ್ ಬೆಟ್ಟದ ಪ್ರದೇಶಕ್ಕೆ ಸೇರಿದವನೂ ಬೆನ್ಯಾಮೀನರ ಊರಾದ ಗಿಬೆಯದಲ್ಲಿ ಪ್ರವಾಸಿಯಾಗಿಯೂ ಇದ್ದನು.
౧౬అక్కడి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంత్రం ఒక వృద్ధుడు పొలంలో తన పని ముగించుకుని వచ్చాడు. అతడు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం నుండి వచ్చి గిబియాలో నివసిస్తున్నాడు.
17 ಆ ಮುದುಕನು ತನ್ನ ಕಣ್ಣೆತ್ತಿ ಆ ಪಟ್ಟಣದ ಬೀದಿಯಲ್ಲಿ ಕುಳಿತಿದ್ದ ಯಾತ್ರಿಕನನ್ನು ಕಂಡು, “ನೀನು ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೀ? ಎಲ್ಲಿಂದ ಬಂದೆ?” ಎಂದನು.
౧౭ఆ వృద్ధుడు తల ఎత్తి ఆ ఊరి మధ్యలో ప్రయాణమవుతూ కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూశాడు. “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడినుండి వస్తున్నావు?” అని అడిగాడు.
18 ಅವನು ಇವನಿಗೆ, “ನಾವು ಯೆಹೂದದ ಬೇತ್ಲೆಹೇಮಿನಿಂದ ಎಫ್ರಾಯೀಮ್ ಬೆಟ್ಟದ ಕಡೆಯಲ್ಲಿ ಹಾದು ಹೋಗುತ್ತೇವೆ. ನಾನು ಅಲ್ಲಿಯವನು. ಯೆಹೂದದ ಬೇತ್ಲೆಹೇಮಿಗೆ ಹೋಗಿದ್ದೆನು. ಈಗ ಯೆಹೋವ ದೇವರ ಮನೆಗೆ ಹೋಗುತ್ತೇನೆ. ಆದರೆ ನಮ್ಮನ್ನು ಯಾರೂ ಮನೆಗೆ ಸೇರಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ.
౧౮అందుకతడు “మేము యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం అవతల ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం. మా సొంత ఊరు అదే. యూదా ప్రాంతం లోని బేత్లెహేముకు వెళ్ళి వస్తున్నాము. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. అయితే ఇక్కడ మాకెవరూ ఆతిథ్యం ఇవ్వలేదు
19 ಆದರೂ ನಮ್ಮ ಕತ್ತೆಗಳಿಗೆ ಮೇವೂ, ನಿನ್ನ ಸೇವಕನಾದ ನನಗೂ, ನಿನ್ನ ಸೇವಕಿಗೂ, ನಿನ್ನ ಸೇವಕನ ಸಂಗಡ ಇರುವ ಪ್ರಾಯಸ್ಥನಿಗೂ ಸಾಕಾಗುವಷ್ಟು ರೊಟ್ಟಿ ಮತ್ತು ದ್ರಾಕ್ಷಾರಸವು ಉಂಟು. ಏನೂ ಕೊರತೆ ಇಲ್ಲ,” ಎಂದನು.
౧౯మా గాడిదలకు గడ్డీ, దాణా ఉన్నాయి. నాకూ, మీ సేవకురాలైన ఈమెకూ, మీ సేవకులతో సమానుడైన ఈ యువకుడికీ ఆహారం, ద్రాక్షారసం ఉన్నాయి. ఆ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు.” అన్నాడు.
20 ಆಗ ಆ ಮುದುಕನು, “ನಿನಗೆ ಶುಭವಾಗಲಿ, ನಿನ್ನ ಕೊರತೆಯೆಲ್ಲಾ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ, ಹೇಗಾದರೂ ಬೀದಿಯೊಳಗೆ ಇಳಿದುಕೊಳ್ಳಬೇಡ,” ಎಂದು ಹೇಳಿ
౨౦ఆ వృద్ధుడు “మీకు అంతా క్షేమం కలుగుతుంది. మీకు ఏదైనా తక్కువ అయితే వాటి సంగతి నేను చూసుకుంటాను
21 ಅವನನ್ನು ತನ್ನ ಮನೆಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ, ಕತ್ತೆಗಳಿಗೆ ಮೇವು ಹಾಕಿದನು. ಅವರು ತಮ್ಮ ಕೈಕಾಲುಗಳನ್ನು ತೊಳೆದು ತಿಂದು ಕುಡಿದರು.
౨౧అయితే రాత్రి ఇలా వీధిలో గడపకూడదు” అన్నాడు. అలా చెప్పి అతణ్ణి తన ఇంటికి ఆహ్వానించి తీసుకు వెళ్ళాడు. అతని గాడిదల కోసం మేత సిద్ధం చేశాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కుని భోజనం చేశారు.
22 ಅವರು ಸಂತೋಷಿಸುತ್ತಿರುವ ವೇಳೆಯಲ್ಲಿ ಆ ಪಟ್ಟಣದ ದುಷ್ಟ ಮನುಷ್ಯರಲ್ಲಿ ಕೆಲವರು ಆ ಮನೆಯನ್ನು ಸುತ್ತಿಕೊಂಡು, ಕದವನ್ನು ಬಡಿದು, ಆ ಮನೆಯ ಯಜಮಾನನಾದ ಮುದುಕನಿಗೆ, “ನಿನ್ನ ಮನೆಗೆ ಬಂದ ಆ ಮನುಷ್ಯನೊಡನೆ ನಮಗೆ ಸಂಗಮವಾಗಬೇಕು, ಹೊರಗೆ ಬಾ,” ಎಂದು ಹೇಳಿದರು.
౨౨వాళ్ళు ఆ విధంగా ఆనందిస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఆ ఇంటిని చుట్టుముట్టి తలుపు కొట్టారు. ఆ ఇంటి యజమాని అయిన ఆ వృద్దునితో మాట్లాడారు. “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకు రా. అతణ్ణి మేము తెల్సుకోవాలి” అన్నారు.
23 ಆಗ ಮನೆಯ ಯಜಮಾನನಾದ ಆ ಮನುಷ್ಯನು ಅವರ ಬಳಿಗೆ ಹೊರಟುಹೋಗಿ, ಅವರಿಗೆ, “ಹಾಗೆ ಮಾಡಬೇಡಿರಿ. ನನ್ನ ಸಹೋದರರೇ, ದಯಮಾಡಿ ಕೆಟ್ಟತನ ಮಾಡಬೇಡಿರಿ. ಆ ಮನುಷ್ಯನು ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಿದ್ದರಿಂದ ನೀವು ಅಂಥ ಬುದ್ಧಿಹೀನತೆಯನ್ನು ಮಾಡಬೇಡಿರಿ.
౨౩ఆ వృద్ధుడు బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు “సోదరులారా, వద్దు. దయచేసి అలాంటి దుర్మార్గపు పని చేయకండి. ఈ వ్యక్తి నా ఇంట్లో అతిథిగా ఉన్నాడు. ఈ నీచమైన పని చేయకండి.
24 ಕನ್ನಿಕೆಯಾದ ನನ್ನ ಮಗಳೂ, ಅವನ ಉಪಪತ್ನಿಯನ್ನೂ ಹೊರಗೆ ತರುವೆನು. ನೀವು ಅವರನ್ನು ಕುಂದಿಸಿ ನಿಮಗೆ ಸರಿಯಾಗಿ ತೋರುವ ಹಾಗೆ ಅವರಿಗೆ ಮಾಡಿರಿ, ಆ ಮನುಷ್ಯನಿಗೆ ಮಾತ್ರ ಅಂಥ ದುಷ್ಕೃತ್ಯವನ್ನು ಮಾಡಬೇಡಿರಿ,” ಎಂದನು.
౨౪చూడండి, నా కూతురు కన్య. ఆమే, ఆ వ్యక్తి ఉంపుడుగత్తే ఉన్నారు. వాళ్ళను నేను బయటకు తీసుకుని వస్తాను. వాళ్ళను మీ ఇష్టం వచ్చినట్లు చెరుపుకోండి. కాని ఈ వ్యక్తి విషయంలో అలాంటి దుర్మార్గపు పని చేయకండి” అన్నాడు.
25 ಆದರೆ ಆ ಮನುಷ್ಯರು ಅವನ ಮಾತನ್ನು ಕೇಳಲೊಲ್ಲದೆ ಹೋದರು. ಆದ್ದರಿಂದ ಆ ಮನುಷ್ಯನು ತನ್ನ ಉಪಪತ್ನಿಯನ್ನು ಹಿಡಿದು ಹೊರಗೆ ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ತಂದು ಬಿಟ್ಟನು. ಅವರು ಅವಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಉದಯಕಾಲದ ಪರ್ಯಂತರ ರಾತ್ರಿಯೆಲ್ಲಾ ಕೆಡಿಸಿ, ಉದಯವಾಗುವಾಗ ಅವಳನ್ನು ಬಿಟ್ಟುಬಿಟ್ಟರು.
౨౫కాని వాళ్ళు అతని మాట వినలేదు. దాంతో ఆ వ్యక్తి తన ఉంపుడుగత్తెను బయట ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాళ్ళు ఆమెను పట్టుకుని రాత్రంతా మానభంగం చేస్తూ, లైంగికంగా హింసిస్తూ ఉన్నారు. తెల్లవారుతుండగా ఆమెను విడిచి వెళ్ళారు.
26 ಆ ಸ್ತ್ರೀ ಉದಯಕಾಲಕ್ಕೆ ಮುಂಚೆ ಬಂದು ಬೆಳಗಾಗುವ ಮಟ್ಟಿಗೂ ಅಲ್ಲಿ ತನ್ನ ಯಜಮಾನನು ಇರುವ ಮನೆಯ ಬಾಗಿಲ ಬಳಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದಳು.
౨౬ఉదయాన్నే ఆమె తన భర్త ఉన్న ఆ వృద్దుడి ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె పూర్తిగా వెలుతురు వచ్చేవరకూ అలానే ఉంది.
27 ಅವಳ ಯಜಮಾನನು ಉದಯದಲ್ಲಿ ಎದ್ದು, ಮನೆಯ ಬಾಗಿಲನ್ನು ತೆರೆದು, ತನ್ನ ಮಾರ್ಗವಾಗಿ ಹೊರಡುವಾಗ, ತನ್ನ ಉಪಪತ್ನಿ ಮನೆಯ ಬಾಗಿಲ ಮುಂದೆ ತನ್ನ ಕೈಗಳನ್ನು ಹೊಸ್ತಿಲ ಮೇಲೆ ಇಟ್ಟವಳಾಗಿ ಬಿದ್ದಿದ್ದಳು.
౨౭ఉదయం ఆమె భర్త ప్రయాణమై వెళ్ళడానికి తలుపులు తీశాడు. అతని ఉంపుడుగత్తె ఆ ఇంటి గుమ్మం దగ్గర గడప మీద చేతులు చాపి పడి ఉంది.
28 ಆಗ ಅವನು ಅವಳಿಗೆ, “ಏಳು, ಹೋಗೋಣ,” ಎಂದನು. ಆದರೆ ಅವಳಿಂದ ಪ್ರತ್ಯುತ್ತರ ಬರಲಿಲ್ಲ. ಆಗ ಆ ಮನುಷ್ಯನು ಅವಳ ಶವವನ್ನು ಕತ್ತೆಯ ಮೇಲೆ ಹಾಕಿಕೊಂಡು, ತನ್ನ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದನು.
౨౮ఆ లేవీయుడు “లే వెళ్దాం” అన్నాడు. కానీ ఆమె జవాబివ్వలేదు. ఆమెను గాడిదపై వేసుకుని ఆ వ్యక్తి తన ఇంటికి ప్రయాణం సాగించాడు.
29 ಅವನು ತನ್ನ ಮನೆಗೆ ಹೋದಾಗ, ಒಂದು ಖಡ್ಗವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ತನ್ನ ಉಪಪತ್ನಿಯನ್ನು ಹಿಡಿದು ಎಲುಬುಗಳ ಸಂಗಡ ಹನ್ನೆರಡು ತುಂಡುಗಳಾಗಿ ಕಡಿದು, ಅವುಗಳನ್ನು ಇಸ್ರಾಯೇಲಿನ ಮೇರೆಗಳಿಗೆಲ್ಲಾ ಕಳುಹಿಸಿದನು.
౨౯అతడు తన యింటికి వచ్చాక ఒక కత్తి తీసుకుని తన ఉంపుడుగత్తె శరీరంలో ఏ భాగానికి ఆ భాగం మొత్తం పన్నెండు ముక్కలుగా కోశాడు. ఆ పన్నెండు ముక్కలను ఇశ్రాయేలీయులు నివసించే ప్రాంతాలన్నిటికీ పంపాడు.
30 ಆಗ ಅದನ್ನು ಕಂಡವರೆಲ್ಲಾ, “ಇಸ್ರಾಯೇಲರು ಈಜಿಪ್ಟಿನಿಂದ ಬಂದ ದಿವಸ ಮೊದಲ್ಗೊಂಡು ಈ ಪರ್ಯಂತರ ಇಂಥ ಕಾರ್ಯವು ಆದದ್ದೂ ಇಲ್ಲ, ಕಂಡದ್ದೂ ಇಲ್ಲ. ನೀವು ಇದರ ವಿಷಯ ಆಲೋಚಿಸಿ ಯೋಚಿಸಿರಿ. ನಾವೇನು ಮಾಡಬೇಕು ಹೇಳಿರಿ?” ಎಂದರು.
౩౦దాన్ని చూసిన వారంతా “ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకూ ఇలాంటిది జరగడం మనం చూడలేదు, వినలేదు. దీని గురించి ఆలోచించండి! ఏం చేయాలో చెప్పండి” అంటూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.