< 1 Tarihi 19 >

1 Ana nan, sai Nahash sarkin Ammonawa ya mutu, sai ɗansa ya gāje shi a matsayin sarki.
ఇది జరిగిన తరువాత అమ్మోనీయుల రాజు నాహాషు చనిపోగా అతని కొడుకు అతని స్థానంలో రాజయ్యాడు.
2 Dawuda ya yi tunani, “Zan nuna jinƙai ga Hanun ɗan Nahash, domin mahaifinsa ya nuna alheri gare ni.” Saboda haka Dawuda ya aika da tawaga don yă yi wa Hanun ta’aziyya game da mahaifinsa. Sa’ad da mutanen Dawuda suka iso wurin Hanun a ƙasar Ammonawa don su ta’azantar da shi,
అప్పుడు దావీదు “హానూను తండ్రి నాహాషు నా పట్ల దయ చూపించాడు కాబట్టి నేను అతని కొడుకు పట్ల దయ చూపిస్తాను” అనుకుని, అతని తండ్రి నిమిత్తం అతన్ని పరామర్శించడానికి దూతలను పంపాడు. దావీదు సేవకులు హానూనును పరామర్శించడానికి అమ్మోను దేశానికి వచ్చినప్పుడు,
3 sai manyan Ammonawa suka ce wa Hanun, “Kana tsammani Dawuda yana girmama mahaifinka ne da ya aika mutanen nan wurinka su ta’azantar da kai? Ba mutanensa sun zo ne su bincika su kuma leƙi ƙasar su tumɓuke ta ba?”
అమ్మోనీయుల అధిపతులు హానూనుతో “నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరికి దావీదు దూతలను పంపడం నీ తండ్రిని ఘనపరచడానికే అనుకుంటున్నావా? దేశాన్ని జాగ్రత్తగా గమనించి, దాన్ని నాశనం చెయ్యడానికే అతని సేవకులు నీ దగ్గరికి వచ్చారు” అని చెప్పారు.
4 Saboda haka Hanun ya kama mutanen Dawuda, ya yi musu aski, ya yayyanka rigunansu a daidai ɗuwawunsu, sa’an nan ya sallame su.
హానూను దావీదు సేవకులను పట్టుకుని, వాళ్ళ జుట్టు గొరిగించి, వాళ్ళ బట్టలు మొల కంటే కిందకు దిగకుండా సగానికి కత్తిరించి వాళ్ళను పంపేశాడు.
5 Da wani ya zo ya faɗa wa Dawuda game da mutanen, sai ya aiki’yan aika su sadu da su, gama an ƙasƙantar da su ainun. Sarki ya ce, “Ku zauna a Yeriko har sai gemunku sun yi girma, sa’an nan ku dawo.”
ఆ మనుషులు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు కొందరు వచ్చి వాళ్ళను గూర్చిన వార్త దావీదుకు తెలియజేశారు. వాళ్ళు ఎంతో సిగ్గు పాలై ఉన్నారు గనుక రాజు వాళ్లకు ఎదురుగా మనుషులను పంపి “మీ గడ్డాలు పెరిగే వరకూ మీరు యెరికోలో ఉండి, తరువాత రండి” అని సందేశం పంపాడు.
6 Sa’ad da Ammonawa suka gane cewa sun zama abin wurin a kafan hancin Dawuda, Hanun da Ammonawa suka aika da talenti dubu na azurfa don su yi haya da kekunan yaƙi da mahayan kekunan yaƙi daga Aram-Naharayim, Aram Ma’aka da Zoba.
అమ్మోనీయులు తమ పట్ల దావీదుకు అసహ్యం కలిగేలా చేసుకున్నాం అని గ్రహించారు. హానూనూ, అమ్మోనీయులూ రెండు వేల మణుగుల వెండి ఇచ్చి అరామ్నహరయీము నుంచి, ఆరాము మయకా నుంచి, సోబా నుంచి, రథాలను, గుర్రపు రౌతులను కిరాయికి తెచ్చుకున్నారు.
7 Suka yi hayar kekunan yaƙi da mahayan kekunan yaƙi dubu talatin da biyu, da kuma sarkin Ma’aka tare da mayaƙansa, waɗanda suka zo suka kafa sansani kusa da Medeba, yayinda Ammonawa suka tattaru daga garuruwansu suka fita yaƙi.
కిరాయి చెల్లించి మయకా రాజును, అతని సైన్యాన్నీ ముప్ఫై రెండువేల రథాలను కుదుర్చుకున్నారు. వీళ్ళు వచ్చి మేదెబా ఎదుట దిగారు. అమ్మోనీయులు తమ పట్టణాల్లో నుంచి యుద్ధం చెయ్యడానికి వచ్చారు.
8 Da jin haka, Dawuda ya aiki Yowab tare da dukan mayaƙa masu yaƙi.
దావీదు ఈ సంగతి విని యోవాబునూ, సైన్యంలో ఉన్న పరాక్రమశాలులు అందరినీ పంపాడు.
9 Ammonawa suka fito suka ja dāgā a ƙofar birninsu, yayinda sarakunan da suka zo, su kansu suka ware suna a fili.
అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు ద్వారం దగ్గర యుద్ధపంక్తులు తీర్చారు. వచ్చిన రాజులు ప్రత్యేకంగా బయట ఉన్న భూమిలో యుద్ధానికి సిద్ధంగా నిలిచారు.
10 Yowab ya ga cewa akwai dāgā a gabansa da bayansa; sai ya zaɓi waɗansu mayaƙa mafi kyau a Isra’ila ya sa su a kan Arameyawa.
౧౦తాను రెండు సైన్యాల మధ్యలో చిక్కి ఉండడం చూసి, యోవాబు ఇశ్రాయేలీయుల్లో ఉన్న శ్రేష్ఠుల్లో పరాక్రమశాలులను సిద్ధం చేసుకుని, అరామీయులకు ఎదురుగా వాళ్ళను బారులు తీర్చి,
11 Ya sa sauran mutanen a ƙarƙashin kulawar Abishai ɗan’uwansa, aka sa a kan Ammonawa.
౧౧మిగిలిన సైన్యాన్ని తన సోదరుడు అబీషైకి అప్పగించి, అమ్మోనీయులకు ఎదురుగా మొహరింప జేశాడు.
12 Yowab ya ce, “In Arameyawa suka fi ni ƙarfi, sai ka kawo mini ɗauke da ni; amma in Ammonawa sun fi ka ƙarfi, sai in kawo maka ɗauke.
౧౨“అరామీయుల బలగాలను ఎదిరించి నేను నిలబడలేకపోతే, నువ్వు నాకు సాయం చెయ్యాలి. అమ్మోనీయుల బలానికి నువ్వు నిలబడలేకపోతే, నేను నీకు సాయం చేస్తాను.
13 Ka yi ƙarfin hali bari mu yi yaƙi da jaruntaka saboda mutanenmu da biranen Allahnmu. Ubangiji zai yi abin da ya ga ya yi masa kyau.”
౧౩ధైర్యంగా ఉండు. మనం మన ప్రజల నిమిత్తమూ మన దేవుని పట్టణాల నిమిత్తమూ శౌర్యం చూపుదాం. యెహోవా తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక” అన్నాడు.
14 Sai Yowab da ƙungiyoyin mayaƙan da suke tare da shi suka matso don su yi yaƙi da Arameyawa, Arameyawan kuwa suka gudu a gabansa.
౧౪ఆ విధంగా యోవాబు అతనితో కూడ ఉన్న సైన్యమూ, అరామీయులతో యుద్ధం చేయడానికి కదిలినప్పుడు, వాళ్ళు అతని ముందు నిలవలేక వెనక్కి తిరిగి పారిపోయారు.
15 Sa’ad da Ammonawa suka ga Arameyawa suna gudu, sai su ma suka guda a gaban ɗan’uwansa Abishai suka shiga cikin birni. Sai Yowab ya koma Urushalima.
౧౫అరామీయులు పారిపోవడం అమ్మోనీయులు చూసినప్పుడు వాళ్ళు కూడా యోవాబు సోదరుడు అబీషై ఎదుట నిలవలేక వెనక్కి తిరిగి పట్టణంలోకి పారిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
16 Bayan Arameyawa suka ga cewa Isra’ila sun ci su da yaƙi, sai suka aiki’yan aika suka sa aka kawo Arameyawan da suke hayen Kogi waɗanda Shobak shugaban mayaƙan Hadadezer yake shugabanta.
౧౬తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని అరామీయులు గ్రహించి దూతలను పంపి, నది అవతల ఉన్న అరామీయులను పిలిపించుకున్నారు. హదరెజెరు సైన్యాధిపతి షోపకు వాళ్లకు నాయకుడయ్యాడు.
17 Sa’ad da aka faɗa wa Dawuda wannan, sai tattara dukan Isra’ila ya haye Urdun; ya tafi wurinsu ya kuwa ja dāgā ɗaura da su. Dawuda ya ja dāgārsa don yă sadu da Arameyawa a yaƙi, su kuwa suka yi yaƙi da shi.
౧౭దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యొర్దాను దాటి, వాళ్లకు ఎదురుగా సైన్యాలను సిద్ధం చేశాడు. దావీదు అరామీయులకు ఎదురుగా సైన్యాలను బారులు తీర్చి యుద్ధం చేశాడు.
18 Amma Arameyawa suka gudu a gaban Isra’ila, mutanen Dawuda kuwa suka kashe masu hawan keken yaƙinsu dubu bakwai da sojojin ƙasa dubu arba’in. Ya kuma kashe Shobak shugaban mayaƙansu.
౧౮అరామీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలవలేక, వెనుదిరిగి పారిపోయారు. దావీదు అరామీయుల్లో ఏడువేల రథికులనూ, నలభై వేల మంది సైనికులనూ హతం చేసి వారి సేనాని షోపకును చంపాడు.
19 Da abokan tarayyar Hadadezer suka ga Isra’ila sun ci su da yaƙi, sai suka nemi salama da Dawuda suka kuma zama bayinsa. Saboda haka Arameyawa ba su ƙara yarda su taimaki Ammonawa ba.
౧౯తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని హదరెజెరు సేవకులు గ్రహించి దావీదుతో సంధి చేసుకుని అతనికి దాసోహమయ్యారు. అప్పటినుంచి అరామీయులు అమ్మోనీయులకు సాయం చెయ్యడానికి అంగీకరించ లేదు.

< 1 Tarihi 19 >