< Ʋɔnudrɔ̃lawo 11 >

1 Yefta nye aʋawɔla sesẽ aɖe tso Gileadnyigba dzi. Dadaa nye gbolo eye fofoa ŋkɔe nye Gilead.
గిలాదువాడైన యెఫ్తా పరాక్రమం గల బలశాలి. అతడు ఒక వేశ్య కొడుకు. యెఫ్తా తండ్రి గిలాదు.
2 Vi bubuwo nɔ Gilead si siwo srɔ̃a ŋutɔ dzi nɛ. Esi Gilead ƒe vi bubu siawo tsi la, wonya Yefta le anyigba la dzi, gblɔ nɛ be, “Nyɔnu bubu ƒe vi nènye! Màkpɔ domenyinu aɖeke tso mía fofo gbɔ o.”
గిలాదు భార్య అతనికి కొడుకులను కన్నప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై యెఫ్తాతో “నువ్వు అన్యస్త్రీకి పుట్టావు కాబట్టి మన తండ్రి ఇంట్లో నీకు భాగం లేదు” అన్నారు.
3 Ale Yefta si tso fofoa ƒe aƒe me yi Tobnyigba dzi. Eƒo gbevu aɖewo nu ƒu ɖe eɖokui ŋu eye wokplɔnɛ ɖo ɣe sia ɣi.
యెఫ్తా తన సహోదరుల దగ్గర నుంచి పారిపోయి టోబు దేశంలో నివాసం ఉన్నప్పుడు అల్లరిమూకలు యెఫ్తా దగ్గరికి వచ్చి అతనితో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు.
4 Ɣeyiɣi sia mee Amonitɔwo ho aʋa ɖe Israelviwo ŋu.
కొంతకాలం తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు.
5 Gilead ƒe kplɔlawo ɖo du ɖe Yefta
అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు
6 kple kukuɖeɖe be wòava kplɔ yewoƒe aʋakɔ la le aʋawɔwɔ kple Amonitɔwo me.
గిలాదు పెద్దలు టోబు దేశం నుంచి యెఫ్తాను రప్పించడానికి వెళ్లి “నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు. అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేద్దాం” అని యెఫ్తాతో చెప్పారు.
7 Yefta bia wo be, “Nu ka ta mieva yɔm le esime mielé fum eye mienyam le fofonye ƒe aƒe me? Nu ka tae mieɖo du ɖem azɔ esi miele xaxa me?”
అందుకు యెఫ్తా “మీరు నా మీద పగపట్టి నా తండ్రి ఇంట్లోనుంచి నన్ను తోలేశారు కదా. ఇప్పుడు మీకు బాధ వచ్చినప్పుడు నేను కావలసి వచ్చానా?” అని గిలాదు పెద్దలతో అన్నాడు.
8 Woɖo eŋu be, “Míeɖo du ɖe wò elabena míehiã wò kpekpeɖeŋu. Ne ànye míaƒe aʋafia le míaƒe aʋawɔwɔ me kple Amonitɔwo la, ekema miatsɔ wò aɖo fiae le Gilead.”
అప్పుడు గిలాదు పెద్దలు “అందుకే మేము నీదగ్గరికి మళ్ళీ వచ్చాం. నువ్వు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేస్తే, గిలాదు నివాసులమైన మా అందరిమీద నువ్వు అధికారివి ఔతావు” అని యెఫ్తాతో అన్నారు
9 Yefta do ɣli be, “Nyateƒea? Ɖe miebu be maxɔ nya sia sea?”
అందుకు యెఫ్తా “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకు వెళ్లిన తరువాత యెహోవా వాళ్ళను నా చేతికి అప్పగిస్తే నేనే మీకు ప్రధానినౌతానా?” అని గిలాదు ఆ పెద్దలను అడగగా,
10 Woɖo eŋu be, “Míedo ŋugbe na wò eye míeka atam ɖe ŋugbedodo dzi.”
౧౦గిలాదు పెద్దలు “కచ్చితంగా మేము నీ మాట ప్రకారం చేస్తాం. యెహోవా మన ఇరువురి మధ్య సాక్షిగా ఉంటాడు గాక” అని యెఫ్తాతో అన్నారు.
11 Ale Yefta lɔ̃ eye wòzu aʋafia kple Gilead fia. Woɖo kpe nya sia dzi le Yehowa kple ameawo katã ŋkume le Mizpa.
౧౧కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కలిసి వెళ్లినప్పుడు ప్రజలు అతన్ని తమకు ప్రధానిగా, అధిపతిగా నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన వాగ్దానాల సంగతి అంతా వినిపించాడు.
12 Yefta ɖo du ɖe Amon fia be yedi be yeanya nu si ta wòle aʋa hom ɖe Israelviwo ŋu.
౧౨యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరికి వర్తమానికులను పంపి “నాకు నీకు మధ్య ఏమీ జరగ లేదు కదా. నువ్వు నా దేశం మీదికి యుద్ధానికి ఎందుకొచ్చావు?” అని అడిగాడు.
13 Amon fia ɖo eŋu be anyigba la nye Amɔnitɔwo tɔ eye Israelviwo va fii esime wotso Egipte va ɖo. Eyi edzi be anyigba blibo la tso Arnon tɔsisi la ŋu yi Yabok tɔsisi la ŋu heyi Yɔdan tɔsisi la ŋu, eye wònye ye tɔ, eya ta Israelviwo naɖe asi le yeƒe anyigba ŋuti na ye tomefafatɔe.
౧౩అమ్మోనీయుల రాజు “ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుంచి వచ్చినప్పుడు వాళ్ళు అర్నోను మొదలు యబ్బోకు వరకూ యొర్దాను వరకూ నా దేశం ఆక్రమించుకొన్నందుకే నేను వచ్చాను. కాబట్టి మనం శాంతియుతంగా ఉండేలా ఆ దేశాలను మళ్ళీ మాకప్పగించు” అని యెఫ్తా పంపిన వర్తమానికులతో సమాచారం పంపాడు.
14 Yefta gaɖo amewo ɖe Amonitɔwo ƒe fia
౧౪అప్పుడు యెఫ్తా మళ్ళీ అమ్మోనీయుల రాజు దగ్గరికి ఇలా కబురంపాడు.
15 be, “Nya si Yefta gblɔ lae nye esi, ‘Israel mexɔ Moabtɔwo alo Amonitɔwo ƒe anyigba o. Nyateƒe lae nye be,
౧౫“యెఫ్తా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులు మోయాబు దేశాన్నైనా అమ్మోనీయుల దేశాన్నైనా ఆక్రమించుకోలేదు.
16 esi Israelviwo tso Egipte, tso Ƒu Dzĩe la eye wova ɖo Kades la,
౧౬ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుంచి వస్తున్నప్పుడు వాళ్ళు ఎర్రసముద్రం వరకూ అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు.
17 woɖo du ɖe Edom fia nɔ mɔ biam be, yewoato eƒe anyigba dzi gake Edom fia meɖe mɔ na wo o. Wobia mɔ ma ke Moab fia hã eye eya hã gbe eya ta Israelviwo nɔ Kades.
౧౭అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరికి మనుషులను పంపి నీ దేశం గుండా దయచేసి తమను వెళ్ళనిమ్మని అడిగినప్పుడు, ఎదోము రాజు ఒప్పుకోలేదు. వాళ్ళు మోయాబు రాజు దగ్గరికి అలాంటి వర్తమానమే పంపారు గాని అతడు కూడా నేను వెళ్ళనివ్వనని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివాసం ఉన్నారు.
18 “‘Mlɔeba la, woƒo xlã Edom kple Moab to gbedadaƒo, woto woƒe ɣedzeƒeliƒowo dzi va se ɖe esime woɖo Moab ƒe liƒo la godo le Arnon tɔsisi la ŋu.
౧౮తరువాత వాళ్ళు అరణ్య ప్రయాణం చేస్తూ ఎదోమీయుల దేశం, మోయాబీయుల దేశం చుట్టూ తిరిగి, మోయాబుకు తూర్పు దిక్కులో కనాను దేశంలో ప్రవేశించి అర్నోను అవతలివైపున మకాం వేశారు. వాళ్ళు మోయాబు సరిహద్దు లోపలికి వెళ్ళలేదు. అర్నోను మోయాబుకు సరిహద్దు గదా.
19 Israel ɖo du ɖe Fia Sixɔn, Amoritɔwo ƒe fia, le Hesbon eye wòbia be wòaɖe mɔ yewoato eƒe anyigba dzi ayi afi si yewoyina.
౧౯ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజు సీహోను అనే హెష్బోను రాజు దగ్గరికి దూతలను పంపి, మీ దేశం గుండా మా స్థలానికి మమ్మల్ని దయచేసి వెళ్ళనిమ్మని అతని దగ్గర మనవి చేసినప్పుడు
20 Fia Sixɔn mexɔ Israelviwo dzi se o eya ta wòna eƒe aʋakɔ wɔ aʋa kple Israelviwo le Yaza.
౨౦సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశంలోనుంచి వెళ్లనివ్వక, తన ప్రజలందర్నీ సమకూర్చుకుని యాహసులో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.
21 Yehowa, míaƒe Mawu la kpe ɖe Israelviwo ŋu woɖu Fia Sixɔn dzi. Ale Israelviwo xɔ anyigba si dzi Amoritɔwo nɔ la katã.
౨౧అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త ప్రజలను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు ఆ ప్రజలను హతం చేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశం అంతా స్వాధీనం చేసుకుని
22 Israelviwo nɔ anyigba la katã dzi tso Arnon tɔsisi la ŋu le anyigbeme yi Yabok tɔsisi la ŋu le dzigbeme kple tso gbegbe la ŋu le ɣedzeƒe yi Yɔdan tɔsisi la ŋu le ɣetoɖoƒe.
౨౨అర్నోను నది మొదలు యబ్బోకు వరకూ, అరణ్యం మొదలు యొర్దాను వరకూ, అమోరీయుల ప్రాంతాలన్నిటిని స్వాధీనం చేసుకున్నారు.
23 “‘Ale Yehowa, Israel ƒe Mawu lae xɔ anyigba la le Amoritɔwo si na Israelviwo. Ekema nu ka ta míagbugbɔe na wò?
౨౩కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన ప్రజలముందు నిలువకుండా తోలివేసిన తరువాత నువ్వు దాన్ని స్వాధీనం చేసుకుంటావా?
24 Na nu sia nu si wò mawu Kemos na wò la nanye tɔwò eye nu sia nu si Yehowa, míaƒe Mawu la na míawo hã la, nanye mía tɔ!
౨౪స్వాధీనం చేసుకోడానికి కెమోషు అనే నీ దేవుత నీకిచ్చిన దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా? మా దేవుడైన యెహోవా మా ఎదుట నుంచి ఎవరిని తోలివేస్తాడో వాళ్ళ స్వాస్థ్యం మేము స్వాధీనం చేసుకుంటాము.
25 Ke wò ɖe, ame ka gɔ̃e nèbu be yenye? Ɖe nènyo wu Fia Balak, Moab fia? Ɖe wòdi be yeagbugbɔ yeƒe anyigba axɔ le Israelviwo si, esime Israel ɖu edzia? Kpao!
౨౫మోయాబు రాజైన సిప్పోరు కొడుకు బాలాకు కంటే నువ్వు గొప్పవాడివా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనా కలహమాడే సాహసం చేశాడా? ఎప్పుడైనా వాళ్ళతో యుద్ధం చేశాడా?
26 Ke wò ya nèle didim be yeaho nya sia ɖe dzi azɔ le ƒe alafa etɔ̃ megbe! Israel nɔ anyigba sia dzi ɣeyiɣi sia katã tso Hesbon va yi Aroer, yi ɖatɔ keke Arnon tɔsisi la. Nu ka ta mèdze agbagba aɖeke kpɔ do ŋgɔ na fifia be yeagbugbɔ anyigba la axɔ o?
౨౬ఇశ్రాయేలీయులు హెష్బోనులో దాని ఊళ్లలో అరోయేరులో దాని ఊళ్లలో అర్నోను తీరాల పట్టాణాలన్నిటిలో మూడు వందల సంవత్సరాలనుంచి నివాసం ఉంటున్నప్పుడు ఆ సమయంలో నువ్వెందుకు వాటిని పట్టుకోలేదు?
27 Kpɔ ɖa, nyemewɔ nu vɔ̃ aɖeke ɖe ŋuwò o: wò boŋue wɔ nu vɔ̃ ɖe ŋunye be nèho aʋa ɖe ŋunye. Ke eteƒe madidi o, Yehowa, Ʋɔnudrɔ̃la la, adrɔ̃ ʋɔnu le mí Israelviwo kple mi Amonitɔwo dome.’”
౨౭నేను నీ పట్ల తప్పూ చెయ్యలేదు, నువ్వే నా మీదికి యుద్ధానికి రావడం వల్ల నా పట్ల తప్పు చేస్తున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా ఈ రోజు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు న్యాయం తీర్చుగాక.”
28 Amon fia meɖo to Yefta ƒe nya la o.
౨౮అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకోలేదు.
29 Le ɣeyiɣi ma me la, Yehowa ƒe Gbɔgbɔ va Yefta dzi eye wòkplɔ eƒe aʋakɔ to Gileadnyigba kple Manase ƒe anyigba dzi, dze le Mizpa le Gilead ŋu eye wòkpe aʋa kple Amonitɔwo ƒe aʋakɔ.
౨౯యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చినప్పుడు అతడు గిలాదులో, మనష్షేలో సంచారం చేస్తూ, గిలాదు మిస్పాల నుంచి అమ్మోనీయుల దగ్గరికి సాగి వెళ్ళాడు.
30 Yefta ɖe adzɔgbe na Yehowa be, “Ne ètsɔ Amonitɔwo de asi nam la,
౩౦అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మొక్కు కున్నాడు “నువ్వు నాకు అమ్మోనీయుల మీద జయం కచ్చితంగా ఇస్తే,
31 nu sia nu si ado to nye aƒe ƒe agbo me ava kpem ne meɖu Amonitɔwo dzi hetrɔ gbɔ la, anye Yehowa tɔ eye matsɔe asa numevɔe nɛ.”
౩౧నేను అమ్మోనీయుల దగ్గర నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నప్పుడు, నన్ను ఎదుర్కోడానికి నా ఇంటి ద్వారం నుంచి బయలుదేరి ఏది వచ్చినా అది యెహోవాకు ప్రతిష్ట చేస్తాను. ఇంకా దహన బలిగా దాన్ని అర్పిస్తాను” అన్నాడు.
32 Yefta kplɔ eƒe aʋakɔ wowɔ aʋa kple Amonitɔwo. Yehowa na Israel ɖu dzi
౩౨అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళగా యెహోవా అతనికి జయం ఇచ్చాడు గనుక అతడు వాళ్ళని,
33 eye wowu Amonitɔwo tso keke Aroer va se ɖe Minit. Woxɔ du blaeve va keke Abel Keramin. Ale Israel ɖu Amonitɔwo dzi.
౩౩అంటే, అరోయేరు మొదలు మిన్నీతుకు వరకూ ఆబేల్కెరామీము వరకూ ఇరవై పట్టణాల వాళ్ళను ఎవరూ మిగలకుండా హతం చేశాడు. ఆ విధంగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలువలేక వారికి లొంగిపోయారు.
34 Esi Yefta trɔ va eƒe aƒe me le Mizpa la, ame aɖeke medo va kpee o, negbe via nyɔnu si nɔ ɣe ɖum ɖe asiʋui ŋu! Eya koe nye vi ɖeka si nɔ esi. Viŋutsu loo alo vinyɔnu aɖeke meganɔ esi wu eya o.
౩౪యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కూతురు తంబురలతో నాట్యంతో బయలుదేరి అతనికి ఎదురొచ్చింది. ఆమె తప్ప అతనికి మగ సంతానమేగాని ఆడసంతానమేగాని లేదు.
35 Esi wòkpɔe la, edze eƒe awuwo henɔ ɣli dom be, “O, vinyenyɔnu! Ètsɔm do nublanuitɔ kple ame ɖigbɔ̃e elabena meɖe adzɔgbe na Yehowa esi dzi nyemate ŋu ada le o.”
౩౫కాబట్టి అతడు ఆమెను చూసి, తన బట్టలు చింపుకుని “అయ్యో నా కూతురా, నువ్వు నన్ను ఎంతో క్రుంగదీశావు, నన్ను తల్లడిల్లజేశావు. నేను యెహోవాకు మాట ఇచ్చాను గనుక వెనుక తీయలేను” అన్నాడు.
36 Eɖo eŋu nɛ be “Fofonye, èɖe adzɔgbe na Yehowa; wɔm abe ale si nèdo ŋugbee ene elabena Yehowa bia hlɔ̃ wò futɔ siwo nye Amonitɔwo.
౩౬ఆమె “నాన్నా, యెహోవాకు మాట ఇచ్చావా? నీ నోటినుంచి వచ్చిన మాట ప్రకారం నాకు చెయ్యి. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగతీర్చుకున్నాడు” అని అతనితో అంది.
37 Gake wɔ nye didi sia ko dzi nam. Na ɣleti evem matsa le togbɛawo dzi afa konyi kple xɔ̃nyewo elabena nyemaɖe srɔ̃ akpɔakpɔ o.”
౩౭ఇంకా ఆమె “నా కోసం చేయవలసింది ఏదంటే, రెండు నెలల వరకూ నన్ను వదిలిపెట్టు. నేను, నా చెలికత్తెలు వెళ్లి కొండలమీద ఉండి, నా కన్యస్థితిని గూర్చి ప్రలాపిస్తాము” అని తన తండ్రితో చెప్పింది.
38 Yefta ɖe mɔ nɛ eye wòyi toawo dzi; eya kple xɔlɔ̃awo nɔ afi ma kple konyifafa ɣleti eve.
౩౮అతడు వెళ్ళమని చెప్పి రెండు నెలలు ఆమెను వెళ్ళనిచ్చాడు. ఆమె తన చెలికత్తెలతో కలిసి వెళ్లి కొండల మీద తన కన్యస్థితిని గూర్చి ప్రలాపించింది.
39 Le esia megbe la, etrɔ va aƒe eye Yefta wɔ eƒe adzɔgbeɖeɖe dzi, ale ɖetugbi la meɖe srɔ̃ o. Tso gbe ma gbe dzi la, ezu kɔnu le Israelviwo dome
౩౯ఆ రెండు నెలల తరువాత ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతడు తాను మొక్కు కొన్న మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు.
40 be ɖetugbiwo nayi aɖanɔ toawo dzi ŋkeke ene ƒe sia ƒe afa konyi le Yefta, Gileadtɔ la ƒe vinyɔnuvi ta.
౪౦ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయుల ఆడపడుచులు నాలుగు రోజులపాటు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తె కథ జ్ఞాపకం చేసుకుంటారు.

< Ʋɔnudrɔ̃lawo 11 >