< Samuel 1 11 >

1 Le ɣeyiɣi sia me la, Nahas kplɔ Amonitɔwo ƒe aʋakɔ eye woho aʋa ɖe Israelviwo ƒe du Yabes Gilead ŋu. Yabestɔwo bia ŋutifafa heɖe kuku be, “Migawɔ aʋa kpli mí o; míelɔ̃ be míazu miaƒe subɔlawo boŋ.”
అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా సైన్యాన్ని మోహరించాడు. అప్పుడు యాబేషువారు “మేము నీకు సేవకులుగా ఉంటాం. మాతో ఒప్పందం చేసుకో” అని నాహాషును అడిగారు.
2 Nahas ɖo eŋu be, “Ekema mawɔ nu ɖeka; maho mia dometɔ ɖe sia ɖe ƒe ɖusimeŋku abe gbɔ̃ɖiɖi Israel dukɔ blibo la ene!”
“ఇశ్రాయేలు జాతి ప్రజలందరికీ అవమానం కలిగేలా మీ అందరి కుడి కళ్ళు పెరికివేస్తానని మీతో ఒప్పందం చేసుకుంటాను” అని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు పెద్దలతో చెప్పాడు.
3 Yabes ƒe ametsitsiwo ɖo eŋu be, “Na ŋkeke adre mí ne míadɔ ame aɖo ɖe Israelnyigba blibo la dzi. Ne mía nɔviwo mava kpe ɖe mía ŋu o la, ekama míalɔ̃ ɖe wò tameɖoɖo la dzi.”
అందుకు వారు “మేము ఇశ్రాయేలీయుల అన్ని సరిహద్దు ప్రాంతాలకు మా రాయబారులను పంపడానికి మాకు వారం రోజులు సమయం ఇవ్వు. ఈలోపుగా మమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరని తెలిస్తే మమ్మును మేమే నీకు అప్పగించుకుంటాం” అన్నారు.
4 Esi dɔla aɖe va Gibea, Saul ƒe du me eye wògblɔ Yabestɔwo ƒe xaxa la ŋu nya na wo la, ame sia ame de asi avifafa me.
ఆ రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి అక్కడి ప్రజలకు ఆ సమాచారం అందించినప్పుడు ఆ ప్రజలంతా గట్టిగా ఏడ్చారు.
5 Saul kplɔ eƒe nyiwo tso agble gbɔna va aƒe me eye wòbia be, “Nya kae dzɔ? Nu ka ta ame sia ame la avi fam?” Wogblɔ nya si wose tso Yabes la nɛ.
సౌలు పొలం నుండి పశువులను తోలుకుని వస్తూ “ప్రజలు అలా ఏడవడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. వారు యాబేషువారు తెచ్చిన సమాచారం అతనికి తెలియజేసారు.
6 Mawu ƒe Gbɔgbɔ ɖiɖi ɖe Saul dzi enumake eye wòdo dɔmedzoe vevie.
సౌలు ఆ మాటలు వినగానే దేవుని ఆత్మ అతన్ని తీవ్రంగా ఆవహించాడు. అతడు ఆగ్రహంతో
7 Ewu nyitsu eve, fli woƒe lã eye wòɖo lãkɔawo ɖe Israelnyigba ƒe akpa ɖe sia ɖe. Eɖe gbeƒã be, “Aleae woawɔ ame sia ame si madze Saul kple Samuel yome ayi aʋa o la ƒe nyitsue nye esi!” Yehowa na ameawo vɔ̃ Saul ƒe dɔmedzoe ale wo katã ƒo ƒu va Saul gbɔ.
ఒక కాడి ఎడ్లను ముక్కలుగా నరికి ఇశ్రాయేలీయుల దేశంలోని నాలుగు దిక్కులకు రాయబారుల చేత వాటిని పంపుతూ “సౌలు, సమూయేలులతో చేతులు కలపని వారందరి ఎడ్లను నేను ఈ విధంగా చేస్తాను” అని కబురు పంపాడు. అందువల్ల ప్రజల్లో యెహోవా భయం కలిగింది. కాబట్టి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ సౌలు దగ్గరకి వచ్చారు.
8 Saul xlẽ wo le Bezek eye Israelviwo le ame akpe alafa etɔ̃ kpe ɖe ame akpe blaetɔ̃ siwo tso Yuda la ŋu.
అతడు బెజెకులో సమావేశమైన వారిని లెక్కపెట్టినప్పుడు ఇశ్రాయేలు వారు మూడు లక్షల మంది, యూదావారు 30 వేల మంది ఉన్నారు.
9 Saul ɖo du ɖe Yabes Gileadtɔwo be, “Míaɖe mi tso miaƒe futɔwo si me hafi etsɔ ɣetrɔ naɖo!” Dua me tɔwo tso aseye esi wose nya sia.
అప్పుడు సౌలు “రేపు మధ్యాహ్నం లోపుగా మీకు రక్షణ కలుగుతుందని యాబేష్గిలాదు వారితో చెప్పండి” అని ఆ రాయబారులకు ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళి యాబేషువారికి ఆ వార్త తెలిపినప్పుడు వారు చాలా సంతోషించారు.
10 Ale Yabestɔwo gblɔ na woƒe futɔwo be, “Míava mia gbɔ etsɔ eye miawɔ nu sia nu si dze mia ŋu la mí.”
౧౦అప్పుడు యాబేషువారు నాహాషు పంపిన మనుషులతో ఇలా చెప్పారు. “రేపు మేము బయలుదేరి మమ్మల్ని మేము నీకు అప్పగించుకొంటాం. అప్పుడు నీకు ఏది అనుకూలమో దాన్ని మాకు చేయవచ్చు.”
11 Saul va do ŋdi kanya kple eƒe aʋakɔ si wòma ɖe aʋalɔgo etɔ̃ me. Edze Amonitɔwo dzi kpata eye wòwu wo tso ŋdi ma va se ɖe ŋdɔ. Ame siwo tsi agbe la kaka ale gbegbe be wo dometɔ eve aɖeke menɔ teƒe ɖeka o.
౧౧తరువాతి రోజు సౌలు ప్రజలను మూడు గుంపులుగా చేసిన తరువాత వారు తెల్లవారేలోగా శిబిరం మధ్యకు చేరుకుని మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను సంహరించారు. మిగిలిన వారిలో ఏ ఇద్దరూ కలసి తప్పించుకోలేకుండా చెదరిపోయారు.
12 Ameawo bia Samuel kple ɣli be, “Afi ka ame siwo be Saul manyo na mí o la le? Mikplɔ wo va afi sia ne míawu wo!”
౧౨తరువాత ప్రజలు “సౌలు మనలను ఏలుతాడా? అని అడిగిన వారెక్కడ ఉన్నారు? మేము వారిని చంపడానికి వారిని తెప్పించు” అని సమూయేలుతో అన్నారు.
13 Ke Saul gblɔ be, “Womawu ame aɖeke egbe o elabena Yehowa ɖe Israel egbe!”
౧౩అందుకు సౌలు “ఈ రోజు యెహోవా మనకు రక్షణ కలిగించాడు కాబట్టి మీరు ఎవరినీ చంపవద్దు” అన్నాడు.
14 Samuel gblɔ na ameawo be, “Mina mí katã míayi Gilgal eye míada asi ɖe Saul dzi abe míaƒe fia ene.”
౧౪“మనం గిల్గాలుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతులను తిరిగి స్థిరపరచుకుందాం, రండి” అని సమూయేలు ప్రజలందరినీ పిలిచాడు.
15 Ale woyi Gilgal eye woɖo Saul fiae le Yehowa ŋkume. Wosa akpedavɔ na Yehowa eye Saul kple Israelviwo katã kpɔ dzidzɔ ŋutɔŋutɔ.
౧౫ప్రజలంతా గిల్గాలుకు వచ్చి అక్కడ యెహోవా సన్నిధానంలో శాంతి బలులు అర్పించి, యెహోవా సన్నిధి తోడుగా సౌలుకు పట్టాభిషేకం జరిగించారు. సౌలు, అక్కడ చేరిన ప్రజలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.

< Samuel 1 11 >