< Josuo 9 >
1 Kaj kiam aŭdis ĉiuj reĝoj, kiuj loĝis trans Jordan, sur la monto kaj en la valo, kaj sur la tuta bordo de la Granda Maro kontraŭ Lebanon, la Ĥetidoj, kaj la Amoridoj, la Kanaanidoj, la Perizidoj, la Ĥividoj, kaj la Jebusidoj,
౧యొర్దాను అవతల ఉన్న కొండ ప్రాంతంలో, లోయ ప్రాంతాల్లో, లెబానోను ముందు ఉన్న మహా సముద్ర తీర ప్రాంతమంతా ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ మొదలైన రాజులంతా జరిగిన దాన్ని విన్నప్పుడు
2 ili kolektiĝis kune, por militi unuanime kontraŭ Josuo kaj kontraŭ Izrael.
౨వారు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు.
3 Kaj la loĝantoj de Gibeon aŭdis, kion faris Josuo al Jeriĥo kaj al Aj,
౩యెహోషువ యెరికోకి, హాయికీ చేసినదాన్ని గిబియోను ప్రజలు విన్నప్పుడు
4 kaj ili ankaŭ faris ruzaĵon: ili iris kaj provizis sin per manĝaĵoj, kaj metis malnovajn sakojn sur siajn azenojn kaj malnovajn disŝiritajn kaj flikitajn vinsakojn;
౪వారు కుయుక్తితో, రాయబారుల్లాగా వేషం వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెసంచులు కట్టి, పాతగిలి మాసికలు వేసిన ద్రాక్షారసం తిత్తులు తీసుకుని,
5 kaj ŝuoj malnovaj kaj flikitaj estis sur iliaj piedoj, kaj vestoj malnovaj estis sur ili, kaj ilia tuta pano estis malfreŝa kaj ŝimiĝinta.
౫పాతబడి పిగిలిపోయిన చెప్పులు తొడుక్కుని, పాతబట్టలు కట్టుకుని వచ్చారు. వారు ఆహారంగా తెచ్చుకొన్న రొట్టెలన్నీ ఎండిన ముక్కల్లాగా ఉన్నాయి.
6 Kaj ili iris al Josuo en la tendaron ĉe Gilgal, kaj diris al li kaj al la tuta Izrael: El lando malproksima ni venis; faru do kun ni interligon.
౬వారు గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి “మేము దూర దేశం నుండి వచ్చాం, మాతో ఒక ఒప్పందం చేయండి” అని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ అన్నారు.
7 Kaj la Izraelidoj diris al la Ĥividoj: Eble vi loĝas apude de ni; kiel do ni povas fari kun vi interligon?
౭అప్పుడు ఇశ్రాయేలీయులు “మీరు మా మధ్య నివసిస్తున్న వారేనేమో, మేము మీతో ఎలా ఒప్పందం చేస్తాం?” అని ఆ హివ్వీయులతో అన్నారు.
8 Kaj ili diris al Josuo: Ni estas viaj sklavoj. Kaj Josuo diris al ili: Kiuj vi estas? kaj el kie vi venas?
౮వారు “మేము నీ దాసులం” అని యెహోషువతో చెప్పారు. యెహోషువ “మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చారు?” అని వారిని అడిగాడు.
9 Kaj ili diris al li: El lando tre malproksima venis viaj sklavoj pro la nomo de la Eternulo, via Dio; ĉar ni aŭdis Lian gloron, kaj ĉion, kion Li faris en Egiptujo,
౯వారు “నీ దేవుడైన యెహోవా నామాన్నిబట్టి నీ దాసులమైన మేము బహు దూరం నుండి వచ్చాం. దానికి కారణం ఆయన కీర్తినీ, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తాన్నీ,
10 kaj ĉion, kion Li faris al la du reĝoj de la Amoridoj transe de Jordan, al Siĥon, reĝo de Ĥeŝbon, kaj al Og, reĝo de Baŝan, kiu loĝis en Aŝtarot.
౧౦యొర్దాను తీరంలో ఉన్న హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో ఉన్న బాషాను రాజైన ఓగు అనే ఇద్దరు అమోరీయుల రాజులకు ఆయన చేసినదంతా మేము విన్నాం.
11 Kaj diris al ni niaj plejaĝuloj kaj ĉiuj loĝantoj de nia lando jene: Prenu en viajn manojn manĝaĵon por la vojo, kaj iru renkonte al ili, kaj diru al ili: Ni estas viaj sklavoj; faru do kun ni interligon.
౧౧అప్పుడు మా పెద్దలూ మా దేశ ప్రజలంతా మాతో, మీరు ప్రయాణం కోసం ఆహారం తీసుకుని వారికి ఎదురు వెళ్లి వారితో ‘మేము మీ దాసులం కాబట్టి మాతో ఒక ఒప్పందం చేయండి’ అని మీతో చెప్పమన్నారు.
12 Ĉi tiu nia pano estis varma, kiam ni prenis ĝin provize el niaj domoj en la tago, en kiu ni eliris, por iri al vi; kaj nun jen ĝi malfreŝiĝis kaj ŝimiĝis.
౧౨మీ దగ్గరికి రావాలని బయలుదేరిన రోజు మేము సిద్ధం చేసుకుని మా ఇళ్ళనుండి తెచ్చుకొన్న వేడి ఆహార పదార్ధాలు ఇవే, ఇప్పటికి అవి యెండిపోయి ముక్కలయ్యాయి.
13 Kaj ĉi tiuj niaj felsakoj kun vino, kiujn ni plenigis novajn, jen ili disfendiĝis; kaj ĉi tiuj niaj vestoj kaj ŝuoj malnoviĝis pro la tre longa vojo.
౧౩ఈ ద్రాక్షారసపు తిత్తులు మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పుడు అవి చినిగిపోయాయి. బహుదూర ప్రయాణం చేయడం వల్ల మా బట్టలు, చెప్పులు పాతవైపోయాయి” అని అతనితో చెప్పారు.
14 Tiam la homoj prenis iom el ilia pano, kaj la Eternulon ili ne demandis.
౧౪ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర అనుమతి తీసుకోకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు.
15 Kaj Josuo faris pacon kun ili, kaj starigis interligon kun ili, por lasi ilin vivaj; kaj la ĉefoj de la komunumo ĵuris al ili.
౧౫యెహోషువ ఆ వచ్చిన వారితో సంధి చేసి వారు చావకుండేలా వారితో ఒప్పందం చేశాడు. సమాజ ప్రధానులు కూడా వారితో ప్రమాణం చేశారు.
16 Sed post paso de tri tagoj, post kiam ili faris kun ili interligon, ili ekaŭdis, ke ili estas iliaj najbaroj kaj loĝas apude de ili.
౧౬అయితే వారితో ఒప్పందం చేసి మూడు రోజులైన తరువాత, వారు తమకు పొరుగు వారేననీ, తమ మధ్య నివసించే వారేననీ ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు.
17 Kaj la Izraelidoj elmoviĝis, kaj venis al iliaj urboj en la tria tago; iliaj urboj estis Gibeon kaj Kefira kaj Beerot kaj Kirjat-Jearim.
౧౭ఇశ్రాయేలీయులు ముందుకు సాగి మూడవరోజు వారి పట్టణాలకు వచ్చారు. గిబియోనీయుల పట్టణాలు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము.
18 Kaj la Izraelidoj ne batis ilin, ĉar la estroj de la komunumo ĵuris al ili per la Eternulo, Dio de Izrael. Kaj la tuta komunumo ekmurmuris kontraŭ la estroj.
౧౮ఇశ్రాయేలీయులు వారిని చంపలేదు. ఎందుకంటే వారి నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు. అయితే, సమాజమంతా నాయకులకు వ్యతిరేకంగా సణగడం మొదలుపెట్టారు.
19 Kaj ĉiuj estroj diris al la tuta komunumo: Ni ĵuris al ili per la Eternulo, Dio de Izrael, kaj nun ni ne povas tuŝi ilin;
౧౯దానికి ఆ సమాజ ప్రధానులంతా ప్రజలతో ఇలా అన్నారు. “మనం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడు అని వారితో ప్రమాణం చేశాం కాబట్టి మనం వారికి హాని చేయకూడదు.
20 tion ni faros al ili: ni lasu ilin vivaj, por ke ne trafu nin kolero pro la ĵuro, kiun ni ĵuris al ili.
౨౦మనం వారితో చేసిన ప్రమాణం వల్ల మనమీదికి ఉగ్రత రాకుండ ఆ ప్రమాణం గురించి వారిని బతకనియ్యాలి” అని చెప్పారు.
21 Kaj la estroj diris al ili: Ili vivu. Kaj ili fariĝis lignohakistoj kaj akvoportistoj por la tuta komunumo, kiel diris al ili la estroj.
౨౧నాయకులు “వారిని బతకనియ్యండి” అని చెప్పినందుకు గిబియోనీయులు ఇశ్రాయేలు సమాజమంతటికీ కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు తోడేవారుగా అయ్యారు.
22 Kaj Josuo alvokis ilin, kaj diris al ili jene: Kial vi nin trompis, dirante, ke vi estas tre malproksimaj de ni, dum vi loĝas apude de ni?
౨౨యెహోషువ వారిని పిలిపించి ఇలా చెప్పాడు. “మీరు మా మధ్య నివసించేవారే అయినా చాలా దూరం నుండి వచ్చామని మీరెందుకు మమ్మల్ని మోసం చేశారు?
23 estu do nun malbenitaj: ne ĉesiĝu inter vi sklavoj kaj lignohakistoj kaj akvoportistoj por la domo de mia Dio.
౨౩ఆ కారణం వల్ల మీరు శాపగ్రస్తులౌతారు, నా దేవుని ఆలయానికి కట్టెలు నరకడానికీ నీళ్లు తోడడానికీ మీలో కొంతమంది ఎప్పటికీ బానిసలుగానే ఉంటారు” అన్నాడు.
24 Kaj ili respondis al Josuo kaj diris: Estis dirite al viaj sklavoj, ke la Eternulo, via Dio, promesis al Sia servanto Moseo, ke Li donos al vi la tutan landon kaj ekstermos antaŭ vi ĉiujn loĝantojn de la lando; tial ni tre ektimis antaŭ vi pri nia vivo, kaj ni faris tiun aferon.
౨౪అందుకు వారు యెహోషువను చూసి “నీ దేవుడు యెహోవా ఈ దేశాన్నంతా మీకిచ్చి, మీ ముందు నిలవకుండా ఈ దేశ ప్రజలందరినీ నాశనం చేయమని తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించాడని నీ దాసులమైన మాకు రూఢిగా తెలిసింది. కాబట్టి మేము మా ప్రాణాల గురించి చాలా భయపడి ఈ విధంగా చేశాం.
25 Kaj nun jen ni estas en via mano: kiel vi trovas bona kaj justa agi kun ni, tiel agu.
౨౫కాబట్టి మేము నీ వశంలో ఉన్నాం, నీ దృష్టికి ఏది న్యాయమో, ఏది మంచిదో, అదే మాకు చెయ్యి” అని యెహోషువకు జవాబిచ్చారు.
26 Kaj li agis kun ili tiel: li savis ilin kontraŭ la manoj de la Izraelidoj, kaj ĉi tiuj ne mortigis ilin.
౨౬కాబట్టి యెహోషువా ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లోనుండి విడిపించాడు.
27 Sed Josuo destinis al ili en tiu tago, ke ili estu lignohakistoj kaj akvoportistoj por la komunumo kaj por la altaro de la Eternulo, ĝis la nuna tago, sur la loko, kiun Li elektos.
౨౭అయితే సమాజం కోసమూ యెహోవా నిర్ణయించిన చోట ఉండే బలిపీఠం కోసమూ కట్టెలు నరికే వారుగా నీళ్లు తోడేవారుగా యెహోషువ ఆ రోజే వారిని నియమించాడు. ఇప్పటివరకూ వారు ఆ పని చేస్తూనే ఉన్నారు.