< Genesis 9 >

1 And God blesseth Noah, and his sons, and saith to them, 'Be fruitful, and multiply, and fill the earth;
దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి.
2 and your fear and your dread is on every beast of the earth, and on every fowl of the heavens, on all that creepeth on the ground, and on all fishes of the sea — into your hand they have been given.
అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి.
3 Every creeping thing that is alive, to you it is for food; as the green herb I have given to you the whole;
ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను.
4 only flesh in its life — its blood — ye do not eat.
కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు.
5 'And only your blood for your lives do I require; from the hand of every living thing I require it, and from the hand of man, from the hand of every man's brother I require the life of man;
మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను.
6 whoso sheddeth man's blood, by man is his blood shed: for in the image of God hath He made man.
దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి.
7 And ye, be fruitful and multiply, teem in the earth, and multiply in it.'
మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి” అని వాళ్ళతో చెప్పాడు.
8 And God speaketh unto Noah, and unto his sons with him, saying,
దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ,
9 'And I, lo, I am establishing My covenant with you, and with your seed after you,
“వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను,
10 and with every living creature which [is] with you, among fowl, among cattle, and among every beast of the earth with you, from all who are going out of the ark — to every beast of the earth.
౧౦మీతో పాటు ఉన్న ప్రతి జీవితోను, అవి పక్షులే గాని పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను.
11 And I have established My covenant with you, and all flesh is not any more cut off by waters of a deluge, and there is not any more a deluge to destroy the earth.'
౧౧నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు” అన్నాడు.
12 And God saith, 'This is a token of the covenant which I am giving between Me and you, and every living creature that [is] with you, to generations age-during;
౧౨దేవుడు “నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే,
13 My bow I have given in the cloud, and it hath been for a token of a covenant between Me and the earth;
౧౩మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది.
14 and it hath come to pass (in My sending a cloud over the earth) that the bow hath been seen in the cloud,
౧౪భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది.
15 and I have remembered My covenant which is between Me and you, and every living creature among all flesh, and the waters become no more a deluge to destroy all flesh;
౧౫అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు.
16 and the bow hath been in the cloud, and I have seen it — to remember the covenant age-during between God and every living creature among all flesh which [is] on the earth.'
౧౬ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను” అన్నాడు.
17 And God saith unto Noah, 'This [is] a token of the covenant which I have established between Me and all flesh that [is] upon the earth.'
౧౭దేవుడు “నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే” అని నోవహుతో చెప్పాడు.
18 And the sons of Noah who are going out of the ark are Shem, and Ham, and Japheth; and Ham is father of Canaan.
౧౮ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి.
19 These three [are] sons of Noah, and from these hath all the earth been overspread.
౧౯వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది.
20 And Noah remaineth a man of the ground, and planteth a vineyard,
౨౦నోవహు భూమిని సాగుచేయడం ప్రారంభించి, ద్రాక్షతోట వేశాడు.
21 and drinketh of the wine, and is drunken, and uncovereth himself in the midst of the tent.
౨౧ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు.
22 And Ham, father of Canaan, seeth the nakedness of his father, and declareth to his two brethren without.
౨౨అప్పుడు కనాను తండ్రి అయిన హాము, తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయం చెప్పాడు.
23 And Shem taketh — Japheth also — the garment, and they place on the shoulder of them both, and go backward, and cover the nakedness of their father; and their faces [are] backward, and their father's nakedness they have not seen.
౨౩అప్పుడు షేము, యాపెతు, ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచివెళ్ళి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు.
24 And Noah awaketh from his wine, and knoweth that which his young son hath done to him,
౨౪అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్నకొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు.
25 and saith: 'Cursed [is] Canaan, Servant of servants he is to his brethren.'
౨౫“కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు.
26 And he saith: 'Blessed of Jehovah my God [is] Shem, And Canaan is servant to him.
౨౬అతడు “షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక. కనాను అతనికి సేవకుడవుతాడు గాక.
27 God doth give beauty to Japheth, And he dwelleth in tents of Shem, And Canaan is servant to him.'
౨౭దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక. అతడు షేము గుడారాల్లో నివాసం ఉంటాడు. అతనికి కనాను సేవకుడవుతాడు” అన్నాడు.
28 And Noah liveth after the deluge three hundred and fifty years;
౨౮ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల ఏభై సంవత్సరాలు బ్రతికాడు.
29 and all the days of Noah are nine hundred and fifty years, and he dieth.
౨౯నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.

< Genesis 9 >