< Amos 2 >
1 The Lord God seith these thingis, On thre grete trespassis of Moab, and on foure, Y schal not conuerte it, for it brente the boonys of the kyng of Idumee til to aische.
౧యెహోవా చెప్పేదేమిటంటే “మోయాబు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నం చేశారు.
2 And Y schal sende fier in to Moab, and it schal deuoure the housis of Carioth; and Moab schal die in sown, in the noise of a trumpe.
౨మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను. అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది. యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది.
3 And Y schal leese a iuge of the myddis therof, and Y schal sle with it alle the princes therof, seith the Lord.
౩దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను. అతనితోపాటు వారి అధిపతులందరిని నేను చంపేస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.
4 The Lord seith these thingis, On thre grete trespassis of Juda, and on foure, Y schal not conuerte hym, for he hath caste awei the lawe of the Lord, and kepte not the comaundementis of hym; for her idols, after whiche the fadris of hem yeden, disseyueden hem.
౪యెహోవా చెప్పేదేమిటంటే “యూదా మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎందుకంటే వారు తమ పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాల వలన మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి, ఆయన విధులను గైకొనలేదు.
5 And Y schal sende fier in to Juda, and it schal deuoure the housis of Jerusalem.
౫యూదా మీద నేను అగ్ని పంపిస్తాను. అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.”
6 The Lord seith these thingis, On thre grete trespassis of Israel, and on foure, Y schal not conuerte hym, for that that he seelde a iust man for siluer, and a pore man for schoon.
౬యెహోవా తెలియజేసేది ఏంటంటే “ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు నిర్దోషులను అమ్మేశారు. చెప్పుల కోసం పేదలను అమ్మేశారు.
7 Whiche al to-foulen the heedis of pore men on the dust of erthe, and bowen awei the weie of meke men; and the sone and his fadir yeden to a damesele, that thei schulden defoule myn hooli name.
౭నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు దిక్కులేనివారి తలలను తొక్కేస్తున్నారు. అణగారిన వారిని అవతలికి గెంటేస్తున్నారు. తండ్రి, కొడుకు ఒకే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుని నా పవిత్ర నామాన్ని అవమానపరుస్తున్నారు.
8 And thei eeten on clothis leid to wedde bisidis ech auter, and drunken the wyn of dampned men in the hous of her God.
౮తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు. జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని తమ దేవుని మందిరంలో తాగుతారు.
9 Forsothe Y distriede Ammorrei fro the face of hem, whos hiynesse was the hiynesse of cedris, and he was strong as an ook; and Y al to-brak the fruyt of hym aboue, and the rootis of hym bynethe.
౯దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా! పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ నేను నాశనం చేశాను గదా!
10 Y am, that made you to stie fro the lond of Egipt, and ledde you out in desert bi fourti yeer, that ye schulden welde the lond of Ammorrei.
౧౦ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించి, అమోరీయుల దేశాన్ని మీకు స్వాధీనం చేయాలని నలభై ఏళ్ళు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను.
11 And Y reiside of youre sones in to profetis, and Nayareis of youre yonge men. Whether it is not so, ye sones of Israel? seith the Lord.
౧౧మీ కొడుకుల్లో ప్రవక్తలను నియమించాను. మీ యువకుల్లో నాజీరులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలీయులారా, ఇది నిజం కాదా?” యెహోవా వెల్లడించేది ఇదే.
12 And ye birliden wyn to Nayareis, and comaundiden to profetis, and seiden, Profecie ye not.
౧౨“అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు. ప్రవచించ వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు.
13 Lo! Y schal charke vndur you, as a wayn chargid with hei charkith.
౧౩చూడండి. ధాన్యంతో నిండిన బండి ఎవరినైనా అణిచి తొక్కగలిగినట్టు నేను మిమ్మల్ని అణగదొక్కుతాను.
14 And fliyt schal perische fro a swift man, and a strong man schal not holde his vertu, and a stalworthe man schal not saue his lijf;
౧౪చురుకైన వారు సైతం తప్పించుకోలేరు. బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు.
15 and he that holdith a bowe schal not stonde, and a swift man schal not be sauyd by hise feet; and the stiere of an hors schal not saue his lijf,
౧౫విలుకాడు నిలబడలేడు. వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు. రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు.
16 and a stronge man of herte schal fle nakid among stronge men in that dai, seith the Lord.
౧౬ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా నగ్నంగా పారిపోతారు. యెహోవా ప్రకటించేది ఇదే.”