< Ruth 2 >

1 Then Naomis husband had a kinsman, one of great power of the familie of Elimelech, and his name was Boaz.
నయోమి భర్తకు ఒక బంధువు ఉన్నాడు. అతడు చాలా భాగ్యవంతుడు. అతడు కూడా ఎలీమెలెకు వంశం వాడే. అతని పేరు బోయజు.
2 And Ruth ye Moabitesse said vnto Naomi, I pray thee, Let mee goe to the fielde, and gather eares of corne after him, in whose sight I finde fauour. And she said vnto her, Goe my daughter.
మోయాబీ స్త్రీ రూతు నయోమితో ఇలా అంది “నువ్వు వెళ్ళమంటే నేను పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను. నాపై ఎవరు దయ చూపిస్తారో వారి వెనకే వెళ్ళి పరిగె ఏరుకుంటాను.” అప్పుడు నయోమి “అలాగే అమ్మా, వెళ్ళు” అంది.
3 And she went, and came and gleaned in the fielde after the reapers, and it came to passe, that she met with the portion of the fielde of Boaz, who was of the familie of Elimelech.
ఆమె పనికి వెళ్ళింది. పంట కోసేవారి పని అయ్యాక వెళ్ళి నేలపై రాలిన పరిగె ఏరుకుంది. ఆమె పరిగె ఏరుకునే ఆ పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుది.
4 And behold, Boaz came from Beth-lehem, and saide vnto the reapers, The Lord be with you: and they answered him, The Lord blesse thee.
బోయజు బేత్లెహేము నుండి వచ్చి పంట కోస్తున్న పనివారితో “యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక” అన్నాడు. అప్పుడు ఆ పనివారు తిరిగి బోయజుతో “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక” అన్నారు.
5 Then saide Boaz vnto his seruant that was appointed ouer the reapers, Whose maide is this?
అప్పుడు బోయజు పంట కోస్తున్న వాళ్ళపై అజమాయిషీ చేస్తున్న పనివాడితో “ఆ అమ్మాయి ఎవరు?” అని అడిగాడు.
6 And the seruant that was appointed ouer the reapers, answered, and said, It is the Moabitish maide, that came with Naomi out of the countrey of Moab:
అతడు “ఆమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా వచ్చిన మోయాబీ యువతి.
7 And shee saide vnto vs, I pray you, let mee gleane and gather after the reapers among the sheaues: so shee came, and hath continued from that time in the morning vnto now, saue that she taried a litle in the house.
ఆమె ‘నేను పంట కోత కోసే వాళ్ళ వెనకాలే వెళ్ళి పనల మధ్య నేలపై పడే పరిగె ఏరుకుని పోగు చేసుకోవడానికి అనుమతి నివ్వండి’ అని నన్ను అడిగింది. ఆమె వచ్చి పొద్దుటినుంచి పరిగె ఏరుకుంటూనే ఉంది. కొంచెం సేపు మాత్రం విశ్రాంతి తీసుకుంది” అని చెప్పాడు.
8 Then said Boaz vnto Ruth, Hearest thou, my daughter? goe to none other fielde to gather, neither goe from hence: but abide here by my maydens.
అప్పుడు బోయజు రూతుతో “అమ్మాయీ, వింటున్నావా, వేరే పొలంలో పరిగె ఏరుకోడానికి వెళ్ళ వద్దు. ఇక్కడే పనిచేస్తున్న పనికత్తెల దగ్గరే ఉండు.
9 Let thine eyes be on the field that they do reape, and goe thou after the maidens. Haue I not charged the seruants, that they touche thee not? Moreouer whe thou art a thirst, go vnto ye vessels, and drinke of that which ye seruants haue drawen.
కోత పనివారు పంట కోస్తున్న చేను కనిపెట్టుకుని పనికత్తెల వెనకే వెళ్తూ ఉండు. నిన్ను తాకకూడదని యువకులను ఆదేశించాను. నీకు దాహం వేస్తే నీటికుండల దగ్గరికి వెళ్లి మా పనివాళ్ళు చేదిన నీళ్ళు తాగు” అని చెప్పాడు.
10 Then shee fell on her face, and bowed her selfe to the ground, and said vnto him, How haue I found fauour in thine eyes, that thou shouldest know me, seeing I am a stranger?
౧౦అప్పుడు ఆమె బోయజు ముందు సాగిలపడి తన తల నేలకు ఆనించి “పరాయి దేశానికి చెందిన నాపై ఇంత శ్రద్ధ చూపడానికి నీకు నాపై దయ ఎలా కలిగిందో!” అంది. అప్పుడు బోయజు “నీ భర్త చనిపోయిన తరువాత నువ్వు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను.
11 And Boaz answered, and said vnto her, All is told and shewed me that thou hast done vnto thy mother in lawe, since the death of thine husband, and how thou hast left thy father and thy mother, and ye land where thou wast borne, and art come vnto a people which thou knewest not in time past.
౧౧నువ్వు నీ తల్లిదండ్రులనూ, పుట్టిన దేశాన్నీ విడిచిపెట్టి నీకు ఏమాత్రం పరిచయం లేని ప్రజల మధ్యకు వచ్చావు.
12 The Lord recompense thy worke, and a ful reward be giuen thee of the Lord God of Israel, vnder whose wings thou art come to trust.
౧౨యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు గాక, ఎవరి నీడన నువ్వు క్షేమంగా ఉన్నావో ఆ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నీకు నిండైన ప్రతిఫలం ఇస్తాడు గాక!” అన్నాడు.
13 Then she saide, Let me finde fauour in thy sight, my lord: for thou hast comforted mee, and spoken comfortably vnto thy mayde, though I be not like to one of thy maydes.
౧౩అందుకు ఆమె “అయ్యా, నేను నీ దగ్గర పని చేసేదాన్ని కాకపోయినా, నన్ను ఆదరించారు. నీ దాసినైన నాతో దయగా మాట్లాడారు. నాపై మరింత దయ ఉంచండి” అని చెప్పింది.
14 And Boaz said vnto her, At the meale time come thou hither, and eat of the bread, and dippe thy morsell in the vineger. And she sate beside the reapers, and hee reached her parched corne: and shee did eate, and was sufficed, and left thereof.
౧౪భోజన సమయంలో బోయజు “నువ్వు ఇక్కడికే వచ్చి భోజనం చెయ్యి. నీ రొట్టెముక్కలను ద్రాక్షారసంలో ముంచుకుని తిను” అని చెప్పాడు. కాబట్టి ఆమె పంట కోసే వాళ్ళ దగ్గర కూర్చుంది. బోయజు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె కొన్ని తృప్తిగా తిని కొన్ని మిగిల్చింది.
15 And when she arose to gleane, Boaz commanded his seruants, saying, Let her gather among the sheaues, and doe not rebuke her.
౧౫ఆమె పరిగె ఏరుకోడానికి లేచినప్పుడు బోయజు తన పనివాళ్ళతో “ఆమెను పనల మధ్య ఏరుకోనివ్వండి. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దు.
16 Also let fall some of the sheaues for her, and let it lie, that she may gather it vp, and rebuke her not.
౧౬అలాగే ఆమె కోసం కొన్ని కంకులు పడవేయండి. ఆమె వాటిని ఏరుకునేలా చూడండి. ఆమెతో ఎవరూ కఠినంగా మాట్లాడవద్దు” అని చెప్పాడు.
17 So she gleaned in the fielde vntill euening, and she thresshed that shee had gathered, and it was about an Ephah of barly.
౧౭కాబట్టి ఆమె సాయంకాలం వరకూ అదే పొలంలో ఏరుకుని తాను ఏరుకున్న వాటిని దుళ్ళగొట్టింది. అవి దాదాపు తూమెడు బార్లీ గింజలు అయ్యాయి.
18 And she tooke it vp, and went into the citie, and her mother in law saw what she had gathered: Also she tooke foorth, and gaue to her that which she had reserued, when she was sufficed.
౧౮ఆమె వాటిని తీసుకుని ఊళ్ళోకి వచ్చింది. ఇంటి దగ్గర తన అత్త నయోమికి తాను ఏరిన వాటిని చూపించింది. తరువాత తాను తిన్న తరువాత మిగిల్చిన పేలాలు అత్తకు ఇచ్చింది.
19 Then her mother in lawe saide vnto her, Where hast thou gleaned to day? and where wroughtest thou? blessed be he, that knewe thee. And she shewed her mother in lawe, with whome she had wrought, and saide, The mans name, with whom I wrought to day, is Boaz.
౧౯అప్పుడు రూతుతో ఆమె అత్త “నువ్వు ఈ రోజు ఎక్కడ పరిగె ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నీకు సహాయం చేసినవాణ్ణి దేవుడు దీవిస్తాడు గాక” అంది. అప్పుడు రూతు తాను ఎవరి పొలంలో పని చేసిందో ఆ వ్యక్తిని గూర్చి తన అత్తకు చెప్పింది. “అతని పేరు బోయజు” అని చెప్పింది.
20 And Naomi said vnto her daughter in law, Blessed be he of the Lord: for he ceaseth not to doe good to the liuing and to the dead. Againe Naomi saide vnto her, The man is neere vnto vs, and of our affinitie.
౨౦దానికి నయోమి “యెహోవా అతణ్ణి ఆశీర్వదిస్తాడు గాక! ఆయన బ్రతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ మేలు చేయడం మానలేదు” అని తన కోడలితో అంది. నయోమి ఇంకా “ఆ వ్యక్తి మనకు దగ్గర చుట్టం. మనలను అతడు ఆదుకొంటాడు” అని చెప్పింది.
21 And Ruth the Moabitesse said, He said also certainely vnto mee, Thou shalt be with my seruants, vntill they haue ended all mine haruest.
౨౧దానికి మోయాబీయురాలైన రూతు “అంతేకాదు, అతడు పంటకోత అంతా ముగిసే వరకూ తన పని వాళ్ళ దగ్గరే ఉండమని నాతో చెప్పాడు” అంది.
22 And Naomi answered vnto Ruth her daughter in lawe, It is best, my daughter, that thou goe out with his maides, that they meete thee not in an other fielde.
౨౨అప్పుడు నయోమి తన కోడలు రూతుతో “అమ్మా, అతని పనిపిల్లలతో కలసి ఉండటమే మంచిది. వేరొకరి చేలోకి వెళ్తే ఏదైనా కీడు జరుగవచ్చు” అంది.
23 Then she kept her by the maides of Boaz, to gather vnto the end of barly haruest, and of wheate haruest, and dwelt with her mother in lawe.
౨౩రూతు అప్పటినుండి బార్లీ పంట కోత, గోదుమ పంట కోత ముగిసే వరకూ బోయజు పనికత్తెల దగ్గరే ఉండి పరిగె ఏరుకుంటూ, తన అత్తతోనే నివసించింది.

< Ruth 2 >