< Žalmy 66 >
1 Přednímu z kantorů, píseň žalmu. Plésej Bohu všecka země.
౧ప్రధాన సంగీతకారుని కోసం సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి.
2 Zpívejte žalmy k slávě jména jeho, ohlašujte slávu a chválu jeho.
౨ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి.
3 Rcete Bohu: Jak hrozný jsi v skutcích svých! Pro velikost síly tvé lháti budou tobě nepřátelé tvoji.
౩నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.
4 Všecka země skláněti se tobě a prozpěvovati bude, žalmy zpívati bude jménu tvému. (Sélah)
౪లోకమంతా నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది, నీ నామాన్నిబట్టి నిన్ను కీర్తిస్తుంది, అంటూ దేవుణ్ణి ఘనపరచండి. (సెలా)
5 Poďte a vizte skutky Boží, jak hrozný jest v správě při synech lidských.
౫దేవుని ఆశ్చర్యకార్యాలు వచ్చి చూడండి. మనుషులకు ఆయన చేసే కార్యాలు చూసినప్పుడు ఆయన భీకరుడుగా ఉన్నాడు.
6 Obrátil moře v suchost, řeku přešli nohou po suše, tuť jsme se veselili v něm.
౬ఆయన సముద్రాన్ని ఎండిన భూమిగా చేశాడు. ప్రజలు కాలినడకన నదిని దాటారు. అక్కడ ఆయనలో మేము సంతోషించాము.
7 Panuje v síle své nade vším světem, oči jeho spatřují národy, zpurní nebudou míti zniku. (Sélah)
౭ఆయన తన పరాక్రమంతో శాశ్వతంగా ఏలుతాడు. ఆయన కళ్ళు అన్యజాతులను పరిశీలిస్తాయి. తిరుగుబాటుచేసే ప్రజలు తమలో తాము గర్వించవద్దు.
8 Dobrořečte národové Bohu našemu, a ohlašujte hlas chvály jeho.
౮జనాల్లారా, మా దేవుణ్ణి సన్నుతించండి. స్వరమెత్తి ఆయన కీర్తిని వినిపించండి.
9 Zachoval při životu duši naši, aniž dopustil, aby se poklesla noha naše.
౯మా ప్రాణాలను జీవంతో నింపేది ఆయనే. ఆయన మా నడకలు స్థిరంగా ఉంచుతాడు.
10 Nebo jsi nás zpruboval, ó Bože, přečistil jsi nás, tak jako přečištěno bývá stříbro.
౧౦దేవా, నువ్వు మమ్మల్ని పరీక్షించావు. వెండిని పరీక్షించి నిర్మలం చేసినట్టు మమ్మల్ని పరీక్షకు గురిచేశావు.
11 Uvedl jsi nás byl do leči, krutě jsi bedra naše ssoužil,
౧౧మమ్మల్ని ఒక వలలో ఇరుక్కునేలా చేశావు. మా నడుముల మీద పెద్ద బరువు పెట్టావు.
12 Vsadils člověka na hlavu naši, vešli jsme byli do ohně i do vody, a však jsi nás vyvedl do rozvlažení.
౧౨మనుషులు మా మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. మేము నిప్పులగుండా నీళ్ళ గుండా నడిచి వెళ్ళాం. అయినా నువ్వు మమ్మల్ని విశాలమైన స్థలానికి రప్పించావు.
13 A protož vejdu do domu tvého s zápalnými obětmi, a plniti tobě budu sliby své,
౧౩దహనబలులతో నేను నీ మందిరంలోకి వస్తాను.
14 Kteréž vyřkli rtové moji, a vynesla ústa má, když jsem byl v ssoužení.
౧౪నేను బాధల్లో ఉన్నప్పుడు నా పెదాలు, నా నోరు ప్రమాణం చేసిన మొక్కుబడులు నేను నీకు అర్పిస్తాను.
15 Zápaly tučných beranů obětovati budu tobě s kaděním, volů i kozlů nastrojím tobě. (Sélah)
౧౫పొట్టేళ్ల హోమం ఘుమఘుమలతో కొవ్విన జంతువులను నీకు దహనబలిగా అర్పిస్తాను. ఎద్దులను, పోతుమేకలను అర్పిస్తాను.
16 Poďte, slyšte, a vypravovati budu, kteříž se koli bojíte Boha, co jest učinil duši mé.
౧౬దేవునిలో భయభక్తులు గలవారంతా వచ్చి వినండి, ఆయన నా కోసం చేసిన కార్యాలు నేను వినిపిస్తాను.
17 Ústy svými k němu jsem volal, a vyvyšoval jsem ho jazykem svým.
౧౭ఆయనకు నేను మొరపెట్టాను. అప్పుడే నా నాలుక ఆయన్ని కీర్తించింది.
18 Bychť byl patřil k nepravosti srdcem svým, nebyl by vyslyšel Pán.
౧౮నేను నా హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే ప్రభువు నా మనవి అంగీకరించడు.
19 Ale vyslyšelť Bůh, a pozoroval hlasu modlitby mé.
౧౯కానీ దేవుడు నా మనవి అంగీకరించాడు. ఆయన నా విన్నపాన్ని ఆలకించాడు.
20 Požehnaný Bůh, kterýž neodstrčil modlitby mé, a milosrdenství svého ode mne neodjal.
౨౦దేవుడు నా ప్రార్థనను తోసిపుచ్చలేదు, నా నుండి తన కృపను తీసివేయలేదు. ఆయనకు స్తుతి కలుగు గాక.