< 5 Mojžišova 10 >
1 Toho času řekl mi Hospodin: Vyhlaď sobě dvě dsky kamenné, podobné prvním, a vstup ke mně na horu, a udělej sobě truhlu dřevěnou.
౧అప్పుడు యెహోవా “నువ్వు మొదటి పలకల వంటివి రెండు రాతిపలకలు చెక్కి, కొండ ఎక్కి నా దగ్గరికి రా. అలాగే చెక్కతో ఒక పెట్టె చేసుకో.
2 I napíši na dskách těch slova, kteráž byla na dskách prvních, kteréž jsi rozrazil, a vložíš je do té truhly.
౨నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరవాత వాటిని నువ్వు ఆ పెట్టెలో ఉంచాలి” అని నాతో చెప్పాడు.
3 Tedy udělal jsem truhlu z dříví setim, a vyhladiv dvě dsky kamenné, podobné prvním, vstoupil jsem na horu, nesa ty dvě dsky v rukou svých.
౩కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక పెట్టె చేయించి మొదటి పలకలవంటి రెండు రాతి పలకలను చెక్కి వాటిని పట్టుకుని కొండ ఎక్కాను.
4 I napsal na těch dskách, tak jakž prvé byl napsal, deset slov, kteráž mluvil k vám Hospodin na hoře z prostředku ohně v den shromáždění onoho, a dal je Hospodin mně.
౪మీరు సమావేశమైన రోజున ఆయన ఆ కొండ మీద అగ్నిలో నుండి మీతో పలికిన పది ఆజ్ఞలనూ మొదట రాసినట్టే ఆ పలకల మీద రాశాడు. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను కొండ దిగి వచ్చి
5 A obrátiv se, sstoupil jsem s hory té, a vložil jsem ty dsky do truhly, kterouž jsem byl udělal, a byly tam, jakož mi přikázal Hospodin.
౫నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో, యెహోవా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను.
6 Synové pak Izraelští hnuli se z Beerot synů Jakan do Moserah. Tam umřel Aron, a tu jest pochován; i konal úřad kněžský na místě jeho Eleazar, syn jeho.
౬ఇశ్రాయేలు ప్రజలు యహకానీయులకు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు.
7 Odtud táhli do Gadgad, a z Gadgad do Jotbata, do země vod tekutých.
౭అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొత్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు.
8 Toho času oddělil Hospodin pokolení Léví, aby nosili truhlu smlouvy Hospodinovy, a aby stáli před Hospodinem k službě jemu, a k dobrořečení ve jménu jeho až do dnešního dne.
౮అప్పటి వరకూ జరుగుతున్నట్టు యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవించడానికి, ప్రజలను ఆయన పేరిట దీవించడానికి ఆ సమయంలో యెహోవా లేవీ గోత్రం వారిని ఎన్నుకున్నాడు.
9 Pročež nemělo pokolení Léví dílu a dědictví s bratřími svými, nebo Hospodin jest dědictví jeho, jakož mluvil k němu Hospodin Bůh tvůj.
౯అందుకే లేవీయులు తమ సోదరులతో పాటు స్వాస్థ్యం పొందలేదు. మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టు వారి స్వాస్థ్యం ఆయనే.
10 Já pak zůstal jsem na té hoře jako dnů prvních, čtyřidceti dní a čtyřidceti nocí, a uslyšel mne Hospodin i tehdáž, a nechtěl shladiti tebe.
౧౦ఇంతకు ముందులాగా నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు కొండ మీద ఉన్నప్పుడు యెహోవా నా మనవి ఆలకించి మిమ్మల్ని నాశనం చేయడం మానుకున్నాడు.
11 Potom řekl mi Hospodin: Vstaň, jdi, předcházeje lid, aby vešli a vládli zemí, kterouž jsem s přísahou zaslíbil otcům jejich, že jim ji dám.
౧౧యెహోవా నాతో “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకొనేలా వారికి ముందుగా నడువు” అని చెప్పాడు.
12 Nyní tedy, Izraeli, čeho žádá Hospodin Bůh tvůj od tebe? Jediné abys se bál Hospodina Boha svého, a chodil po všech cestách jeho, a abys miloval ho, a sloužil Hospodinu Bohu svému v celém srdci svém, a ve vší duši své,
౧౨కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు.
13 Ostříhaje přikázaní Hospodinových a ustanovení jeho, kteráž já přikazuji tobě dnes k tvému dobrému.
౧౩మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు?
14 Aj, Hospodina Boha tvého jest nebe i nebesa nebes, země a všecky věci, kteréž jsou na ní.
౧౪చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే.
15 Však toliko v otcích tvých zalíbilo se Hospodinu, aby je zamiloval, a vyvolil símě jejich po nich, vás totiž ze všech národů, jakož dnes vidíš.
౧౫అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు.
16 Protož obřežtež neobřízku srdce svého, a šíje své nezatvrzujte více.
౧౬కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి.
17 Nebo Hospodin Bůh váš, on jest Bůh bohů, a Pán pánů, Bůh silný, veliký, mocný a hrozný, kterýž nepřijímá osoby, ani béře darů.
౧౭ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు.
18 Čině soud sirotku a vdově, miluje také příchozího, dávaje mu chléb a oděv.
౧౮ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు.
19 Protož milujte hostě, nebo jste byli hosté v zemi Egyptské.
౧౯మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి.
20 Hospodina Boha svého báti se budeš, jemu sloužiti, a jeho se přídržeti, a ve jménu jeho přisahati budeš.
౨౦మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి.
21 Onť jest chvála tvá, a onť jest Bůh tvůj, kterýž učinil s tebou tyto veliké a hrozné věci, kteréž viděly oči tvé.
౨౧ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.
22 V sedmdesáti dušech sstoupili otcové tvoji do Egypta, nyní pak rozmnožil tě Hospodin Bůh tvůj, abys byl v množství jako hvězdy nebeské.
౨౨మీ పూర్వీకులు 70 మంది గుంపుగా ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడైతే మీ యెహోవా దేవుడు ఆకాశనక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపజేశాడు.