< 詩篇 65 >
1 達味詩歌,交與樂官。 天主,人應在熙雍山上歌詠讚美您,同時也應向您還願,因您允我所祈。
౧ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన దేవా, సీయోనులో నీ ఎదుట మౌనంగా కనిపెట్టడం, నీకు మా మొక్కుబడి చెల్లించడం ఎంతో మంచిది.
౨ప్రార్థన ఆలకించే నీ దగ్గరికి మనుషులంతా వస్తారు.
౩మా దోషాలు మమ్మల్ని ముంచెత్తాయి. మా అతిక్రమాలకు నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు.
4 您所選拔,而使他居留在您庭院的人,真是有福!願我們得飽享您居所的福樂,您殿宇中的聖物!
౪నీ ఆవరణల్లో నివసించడానికి నీవు ఎంపిక చేసుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం అనే నీ మందిరంలోని మేలుతో మేము తృప్తిపొందుతాము.
5 天主我們的救主您常照公義以奇事來俯聽我們,世人在天涯地角與海洋的遠處都對您全心信任。
౫మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతాల్లో, దూర సముద్రం మీద ఉన్న వారికందరికీ నీవే ఆశ్రయం. నీతిని బట్టి అద్భుతమైన క్రియల ద్వారా నువ్వు మాకు జవాబిస్తావు.
౬బలాన్నే నడికట్టుగా కట్టుకుని నీ శక్తితో పర్వతాలను స్థిరపరచింది నువ్వే.
7 您曾平息了澎湃的汪洋,咆哮的巨浪,萬民的喧嚷:
౭నువ్వే సముద్రాల హోరునూ వాటి అలల ఘోషనూ శాంతింపజేసేవాడివి. ప్రజల అల్లరిని అణిచేవాడివి.
8 遠居地角的人,因您的奇跡而恐慌;您使東西兩極的人,都要喜氣洋洋。
౮నీ క్రియలు జాడలను చూసి ఈ భూమి అంచుల్లో నివసించే ప్రజలు భయపడతారు. తూర్పు పడమరలు సంతోషించేలా చేసేది నువ్వే.
9 您眷顧大地,普降甘霖,使大地豐收;天主的河水洋溢,為他們準備五穀。原來這一切都是由於您安排就緒。
౯నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దాన్ని ఐశ్వర్యవంతం చేస్తున్నావు. దేవుని నది జలమయంగా ఉంది. నువ్వు భూమిని ఆ విధంగా సిద్ధం చేసి మానవాళికి ధాన్యం దయ చేస్తున్నావు.
10 您灌溉了田畦,又犁平了土壤,使雨鬆軟土壤,祝福植物生長。
౧౦దాని దుక్కులను నీళ్లతో సమృద్ధిగా తడిపి దాని నాగటి చాళ్ళను చదును చేస్తున్నావు. వాన జల్లు కురిపించి దాన్ని మెత్తన చేస్తున్నావు. అది మొలకెత్తినప్పుడు దాన్ని ఆశీర్వదిస్తున్నావు.
౧౧సంవత్సరమంతటికీ నీ మంచితనం ఒక కిరీటంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు సారం ఒలికిస్తున్నాయి.
౧౨అడవి బీడులు సారాన్ని వెదజల్లుతున్నాయి. కొండలు ఆనందాన్ని నడుముకు కట్టుకున్నాయి.
13 羊群遮蔽了牧場,山谷蓋滿了食糧,一切在歡呼歌唱。
౧౩గొర్రెల మందలు పచ్చిక మైదానాలను శాలువాలాగా కప్పాయి. లోయలు పంట ధాన్యంతో కప్పి ఉన్నాయి. అవన్నీ సంతోషధ్వని చేస్తున్నాయి. అవన్నీ పాటలు పాడుతున్నాయి.