< Осия 12 >
1 Ефрем се храни с вятър, и гони източния вятър; Непрестанно умножава лъжите и насилието; Правят завет с Асирийците, И занасят дървено масло в Египет!
౧ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. తూర్పు గాలి వెంట పరిగెడుతున్నాడు. మానక అబద్ధమాడుతూ బలాత్కారం చేస్తున్నాడు. ప్రజలు అష్షూరీయులతో సంధి చేస్తారు. ఐగుప్తునకు ఒలీవనూనె పంపిస్తారు.
2 Още, Господ има спор с Юда, И ще накаже Якова според постъпките му, Според делата му ще му въздаде.
౨యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు. యాకోబు సంతతి వారు చేసిన దాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు.
3 В утробата той хвана петата на брата си, и като мъж се бори с Бога;
౩తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు.
4 Да! бори се с ангел, и преодоля С плач и молба към него. Бог го намери във Ветил, и там говори с нас,
౪అతడు దూతతో పోరాడి గెలిచాడు. అతడు కన్నీటితో అతని అనుగ్రహానికై బతిమాలాడు. బేతేలులో అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ ఆయన అతనితో మాట్లాడాడు.
5 Да! Иеова Бог на Силите, Чието паметно име е Иеова.
౫ఈయన యెహోవా, సేనల ప్రభువు. “యెహోవా” అని ఆయన్ను పిలవాలి.
6 За това, обърни се към твоя Бог, Пази милост и правосъдие, И винаги се надявай на твоя Бог.
౬కాబట్టి నీవు నీ దేవుని వైపు తిరగాలి. నిబంధన నమ్మకత్వాన్ని, న్యాయాన్ని అనుసరించు. నీ దేవుని కోసం ఎడతెగక కనిపెట్టు.
7 Ефрем е търговец; Неверни къпони има в ръката му; Той обича да мами.
౭కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు. దగా చెయ్యడమే వారికి ఇష్టం.
8 И Ефрем си рече: Наистина аз се обогатих, Придобих си имот; Досежно всичките ми трудове няма да се намери в мене беззаконие, Което да се счита за грях.
౮“నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది. నేను సంపాదించుకున్న దానిలో దేనిని బట్టీ శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరూ చూపలేరు” అని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు.
9 А аз съм Господ твой Бог от времето, когато беше ти в Египетската земя; Пак ще те заселя в шатри Като в празнични дни.
౯“అయితే ఐగుప్తుదేశంలో నుండి మీరు వచ్చినది మొదలు యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. నియామక దినాల్లో మీరు డేరాల్లో కాపురమున్నట్టు నేను మళ్లీ మిమ్మల్ని డేరాల్లో నివసింపజేస్తాను.
10 Говорих още и чрез пророците, И явих им много видения; И чрез думите на пророците служих си с уподобления.
౧౦ప్రవక్తలతో నేను మాటలాడాను. విస్తారమైన దర్శనాలు నేనిచ్చాను. ఉపమానరీతిగా అనేకసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడాను.
11 Ето, в Галаад има беззаконие; Станаха съвсем суетни; В Глагал жертват юнци; И жертвениците им са многобройни като куповете тор В браздите на нивите.
౧౧గిలాదులో దుర్మార్గం ఉన్నట్టయితే, అక్కడి ప్రజలు పనికిమాలిన వారు. గిల్గాలులో ప్రజలు ఎడ్లను బలులుగా అర్పిస్తారు. వారి బలిపీఠాలు దున్నిన చేని చాళ్ళపై ఉన్న రాళ్లకుప్పల్లాగా ఉన్నాయి.
12 А Яков побягна в Сирийското поле; Израил е работил за жена, И за жена е пазил овци,
౧౨యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోకి వెళ్లిపోయాడు. భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేశాడు. భార్య కావాలని అతడు గొర్రెలు కాచాడు.
13 Чрез пророк Господ възведе Израиля от Египет; И чрез пророк той биде опазен.
౧౩ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు. ప్రవక్త ద్వారా వారిని కాపాడాడు.
14 Ефрем разгневи Бога много горчиво; За това, ще оставя върху него проляната от него кръв, И неговият Господ ще възвърне укора му върху самия него.
౧౪ఎఫ్రాయిము యెహోవాకు ఘోరమైన కోపం పుట్టించాడు. కాబట్టి అతని యజమాని అతని మీద రక్తాపరాధం మోపుతాడు. అతని సిగ్గులేని పనులను బట్టి అతన్ని అవమానపరుస్తాను.”